సగ్గుబియ్యం ఉపయోగాలు తెలుసా?

 

 తెలుగు రాష్ట్రాలలో చాలామందికి సగ్గు  బియ్యం  ఒడియాలు పెడతారు అని మాత్రమే తెలుసు. సోషల్ మీడియా కారణంగా సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారని కూడా చూసే ఉంటారు. కానీ  ఇతర రాష్ట్రాలలో సగ్గుబియ్యాన్ని చాలా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యాన్ని చేర్చుకుంటారు.  అయితే సగ్గుబియ్యం ప్రయోజనాలు చాలా మందికి తెలియవు.  సగ్గు బియ్యం కిచిడి,  సగ్గుబియ్యం పాయసం,  సగ్గు బియ్యం ఒడియాలు.. సగ్గుబియ్యం చాట్.. ఇలా చాలా రకాలుగా ఉపయోగించే సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.  సగ్గుబియ్యంలో ఉండే పోషకాలు ఏంటి? సగ్గుబియ్యం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే..

సగ్గుబియ్యం మంచి ఎనర్జీని ఇస్తుంది.  అంతే కాదు.. ఇందులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.  సగ్గుబియ్యంలో పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో  సహాయపడతాయి. సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు శరీరాన్ని ఆవరించిన అలసట,  బలహీనత మొదలైనవి తొలగిపోతాయి.

సగ్గుబియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బలహీనమైన పేగు ఆరోగ్యం ఉన్నవారు సగ్గుబియ్యం తింటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.

ప్రోటీన్ పరంగా చూస్తే సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.  ఇది కండరాల మరమ్మత్తుకు, కండరాలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.  అందుకే ప్రోటీన్ తీసుకోవాలి  అనుకునే వారు ఆహారంలో సగ్గుబియ్యం ను చేర్చుకోవచ్చు.

చాలా సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు పెరగాలని అనుకుంటే అందుకు సగ్గుబియ్యం బాగా సహాయపడతుంది.  సగ్గుబియ్యంలో ఉండే ప్రోటీన్,  కార్బోహేడ్రేట్స్, పోషకాలు ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి.

సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది.  ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

సగ్గుబియ్యంలో ఐరన్ కంటెంట్, ఫోలేట్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.  గర్భవతులు సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల కడుపులో పిండం అబివృద్ది ఆరోగ్యకరంగా జరుగుతుంది.  ఇది రక్తహీనత వంటి రక్తలోపం సమస్య ఉన్నవారికి కూడా మంచిది.


                                  *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...