బిఆర్ఎస్  సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్క్రైబ్ , నిప్పు కోడి వంటి సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడైంది. సోమవారం  సైబర్ క్రైం పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు. అటు ఏపీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా  విష ప్రచారం చేస్తున్న పలువురిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వాన్ని బదనాం చేసే సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి  చట్టం చేయనుందని  వార్తలు వెలువడుతున్నాయి.   
సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియోటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పోసాని కృష్ణమురళిపై  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారంటూ తెలుగుదేశం రాష్ట్ర తెలుగుయువత ప్రతినిథి  బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. పోసాని వ్యాఖ్యలు చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని బండారు వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోసానిపై సీఐడీ అధికారులు భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   వైసీపీ హయాంలో అధికారం అండతో   సామాజిక మాధ్యమంలో ఇష్టారీతిగా చెలరేగిపోయి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బూతులు, దూషణలే విమర్శలు అన్నట్లుగా చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఆ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పోసానిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ సీఐడీ కూడా పోసానిపై కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కూడా కేసు నమోదు కావడంతో పోసాని అరెస్టు అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
గత వైసీపీ  ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది.  మాజీ మంత్రి విడదల రజిని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి ఏకంగా ప్రభుత్వ భూమిని కాజేసాడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డిపై కేసు నమోదైంది.  నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు  కోటిరెడ్డిని అరెస్టు చేశారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కోటిరెడ్డి  ఇక్కడితో ఆగలేదు. ఒకే స్థలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు. మరొకరికి దీన్ని అక్రమంగా  డబుల్ రిజిస్ట్రేషన్‌ చేయించాడని, వాణిజ్య దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చారని గ్రామస్థులు ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించేందుకు రెండ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఎంపీడీవో స్వరూపరాణిని, ఫిర్యాదుదారు, టీడీపీ స్థానిక నేత భవనం శ్రీనివాసరెడ్డిని కోటిరెడ్డి నానా బూతులు తిట్టాడు. దౌర్జన్యంగా వ్యవహరించాడు.  తనను కోటిరెడ్డి కులం పేరుతో అసభ్యంగా దూషించి కొట్టాడని ఎంపీడీవో నాదెండ్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏజేసీజే న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ALSO ON TELUGUONE N E W S
Pushpa 2 The Rule trailer has been launched at Patna, in front of huge crowd. It almost looked like a big political meeting and crowds gathered at unbelievable number for a trailer event. While the event showcased Pushpa's pull in the north belt, the event also cemented the craze for the second film.  Icon Star Allu Arjun is pleased by the reception and he is thinking about hitting huge jackpot with the second one. Rashmika Mandanna, Fahadh Faasil and all others are really excited about the movie reception. Director Sukumar is busy with post production works while Sreeleela is expecting Pan-India fame with her special song.  Now, many have started betting about Pushpa 2 opening day number. While the trailer has crossed 100 Million views and going strong, the betting addicts are talking about movie opening with earth shattering Rs.300-350 crores Day one worldwide. Some are saying it would not cross 260-275 crores mark.  In any case, the movie will be the biggest opener for Indian film ever crossing RRR's Rs.226 crores gross mark. Well, 5th December will be a historic day for sure but the makers are anticipating the movie to be celebrated beyond opening day and we wish for the same too. 
Nayanthara has alleged Dhanush in her open letter as a person who acts in public and hides his real face. She stated that she has been asking for 2 years to give her permission to use Naanum Rowdy Dhaan film BTS clips, music and scenes in her wedding video on Netflix.  The documentary released on 17th November, titled, Nayanthara - Beyond the Fairytale, on the streaming service. Her letter created a huge sensation as even actresses who worked with Dhanush have liked and shared it.  Now, reports from Tamil media state that Nayanthara wanted them to support her for unity and even compelled them stating that Dhanush has been rude to her. In fact, the actresses went ahead to support her as they wanted to show solidarity to their fellow Malayalee.  Also, she wanted to make this all a #MeToo kind of a movement against the actor. Her husband, writer-director Vignesh Shivn orchestrated all this to get more publicity for their wedding documentary and also get back at Dhanush for belittling comments against him during NRD making it seems.  Well, this could be Dhanush getting back at the couple indirectly but it could also be carrying some truth about everything. Few reports suggested that Dhanush was hurt that Vignesh played foul game spoiling his and Nayanthara friendship. We would never really know the full reason for this conflict until Dhanush talks about it.
One of the most popular, powerful and biggest stars of Indian Cinema, Aamir Khan revealed some shocking secrets about therapy. He stated that every relationship does have issues and communication has to be good at all levels to sort out them.  He further recommended therapy to each and everyone. He stated that his relationship with his daughter Ira Khan, improved after she pushed him for therapy. In fact, he shared openly that he always felt he knew everything but only therapy helped him open up better.  He also shared that his daughter actually came up with the idea and then pushed him for a joint therapy with her. He stated that the therapy sessions helped them open up and improve their communication better and thereby their relationship too. Aamir Khan further recommended everyone to try therapy, if they wish too and not delay it.  On films front, Aamir Khan has not confirmed any movie after Lal Singh Chaddha. He is evaluating his options and the actor is said to be in talks with South Indian directors like Lokesh Kanagaraj, Nelson Dilipkumar, Prashanth Neel, Prashanth Varma, Atlee and few others. Let's wait for his official confirmation about his next. 
Thandel starring Naga Chaitanya Akkineni, Sai Pallavi has created curiosity with the announcement video and recent release date drama before confirmation as 7th February. In the annoucement video itself, the glimpse of song's music used by composer Devi Sri Prasad has impressed everyone. Hence, the makers are starting promotions by releasing melodious first single, Bujji Thalli, on 21st November.   Love Story starring Naga Chaitanya and Sai Pallavi has become a blockbuster success and hence, the pairing has risen curiosity once again big time for this film. The movie has patriotic elements to go with and some sources state that Sita Ramam kind of epic romance is painted on this canvas too.  After Karthikeya 2, director Chandoo Mondeti took time to write and direct this film. The makers have plans to make this a huge Rs.100 crore blockbuster for everyone involved. If the song becomes a viral hit, there are chances that the buzz for the film grow huge. 
2021 లో సుమంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే మూవీతో తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన నటి  మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) గుంటూరు కారం, ది గోట్,లక్కీ భాస్కర్, మట్కా లాంటి వరుస సినిమాలతో క్రేజీ  హీరోయిన్ గా మారిన మీనాక్షి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న'మెకానిక్ రాకీ' అనే మూవీలో చేస్తుంది.ఎస్ఆర్ టి పతాకంపై పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా ఈ నెల 22 న విడుదల కానుంది.   ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో మెకానిక్ రాకీ ప్రమోషన్స్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో మీనాక్షి తను ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడుతు మహేశ్‌బాబు(mahesh babu)క్రమశిక్షణగా ఉంటారు.విజయ్(vijay)ఎప్పుడూ ఒకేలా ఉంటారు. దుల్కర్‌ (dulqur salman)వినయం అంటే నాకు ఇష్టం. వరుణ్ తేజ్‌(varun tej)ది పూర్తిగా జెంటిల్‌మ్యాన్‌ నేచర్‌.ఇక విశ్వక్ సేన్‌(vishwak sen)ఎప్పుడూ సరదాగా,ఎనర్జిటిక్‌గా ఉంటూ సెట్‌లో సందడి క్రియేట్‌ చేస్తుంటాడని తెలిపింది.  ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.      
దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు మూడూ ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శిమవుతున్నాయి. గత వారం విడుదలైన 'మట్కా', 'కంగువా' మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో ఈ వారం విడుదల కానున్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ నవంబర్ 22న ఏకంగా అర డజను సినిమాలు విడుదలవుతున్న్నాయి. విశ్వక్‌సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మెకానిక్ రాకీ'. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అశోక్‌ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించాడు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జీబ్రా'. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు.  వీటితో పాటు 'రోటి కపడా రొమాన్స్', రాకింగ్ రాకేష్ 'కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్), సన్నీ లియోన్ 'మందిర' సినిమాలు కూడా నవంబర్ 22న విడుదల కానున్నాయి. ఇక ఓటీటీలోనూ ఈవారం సినిమాలు, సిరీస్ ల సందడి బాగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్‌: వాండరూస్‌ 2 (యానిమేషన్‌ సిరీస్‌) - నవంబర్ 18 జాంబీ వర్స్‌ (కొరియన్‌ సిరీస్‌) - నవంబర్ 19  ఎ మ్యాన్‌ ఆన్‌ ది ఇన్‌ సైడ్‌ (హాలీవుడ్ సిరీస్‌) - నవంబర్ 21 జాయ్‌ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22 పోకెమాన్‌ హారిజాన్స్‌ ది సిరీస్‌ 4 (యానిమేషన్‌) - నవంబర్ 22 స్పెల్‌బౌండ్‌ (యానిమేషన్‌ మూవీ) - నవంబర్ 22 ది పియానో లెసన్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22 యే కాలీ కాలీ ఆంఖే 2 (హిందీ సిరీస్‌) - నవంబర్ 22  డిస్నీ+హాట్‌స్టార్‌: కిష్కిందకాండమ్‌ (మలయాళం/తెలుగు) - నవంబర్ 19  ఇంటీరియర్‌ చైనా టౌన్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్ 19 ఏలియన్‌ రొమ్యులస్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 21 అవుట్‌ ఆఫ్‌ మై మైండ్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22  జియో సినిమా: బ్యాక్‌ టు బ్లాక్‌ (హాలీవుడ్‌) - నవంబర్ 17  డ్యూన్‌: ప్రొఫెసి (వెబ్‌సిరీస్‌) - నవంబర్ 18 హరోల్డ్‌ అండ్‌ ది పర్పుల్‌ క్రేయాన్‌ (హాలీవుడ్) - నవంబర్ 23  అమెజాన్ ప్రైమ్: క్యాంపస్ బీట్స్-2 (హిందీ సిరీస్) - నవంబర్ 20  ఈటీవీ విన్: ఐ హేట్ లవ్ (తెలుగు) - నవంబర్ 21  రేపటి వెలుగు (తెలుగు) - నవంబర్ 21  ఆపిల్‌ టీవీ ప్లస్‌: బ్లిట్జ్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22  బుక్‌ మై షో: ది గర్ల్‌ ఇన్‌ ది ట్రంక్‌ (హాలీవుడ్‌) - నవంబర్ 22 
పాట్నా వేదికగా అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప పార్ట్ 2(pushpa 2)ట్రైలర్ నిన్న రిలీజైన విషయం తెలిసిందే. ఆద్యంతం కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో అల్లుఅర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక, చిత్ర నిర్మాతలు పాల్గొని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.పుష్ప పార్ట్ 1 విజయం తర్వాత సుకుమార్(sukumar)అల్లు అర్జున్ కాంబోలో మరోసారి వస్తున్న పుష్ప 2 పై అభిమానులు, ప్రేక్షకుల్లోనే కాకుండా అగ్ర దర్శకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ట్రైలర్ రిలీజైన వెంటనే ట్రైలర్ అదిరిందని, సినిమా చూడాలనే ఉత్సుకత పెరిగిపోయిందని దర్శక ధీరుడు రాజమౌళి,సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ, హరీష్ శంకర్ వంటి వారు చెప్పుకొచ్చారు. ఇక పుష్ప 2 ట్రైలర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో పదిహేను గంటల్లోనే నలభై మిలియన్లకి పైగా వ్యూస్ ని సాధించింది. కేవలం తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించే నలబై  మిలియన్ల వ్యూస్ ని రాబట్టిన  మొట్ట మొదటి దక్షిణ భారతీయ సినిమాగా పుష్ప 2  సరికొత్త రికార్డు సృష్టించింది.దీంతో పుష్ప పార్ట్ 2 కోసం సినీ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్దమవుతుంది.    డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 ట్రైలర్  తెలుగుతో పాటు తమిళ ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.ఆయా లాంగ్వేజ్ ల్లో కూడా హయ్యస్ట్ వ్యూస్ ని సాధిస్తూ సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది.ఇక ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో  అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. డిసెంబర్ 5 నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద అల్లు అర్జున్ కలెక్షన్ల సునామిని సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
Kanguva starring Suriya and Disha Patani directed by Siva, released on 14th November to a wild and wide negative feedback. People had such defying reaction that they kept complaining that the sound design was so annoying and jarring that they couldn't forget the experience for days together.  The complains started from the FDFS - First Day First Show, all over and even Suriya die-hard fans couldn't really tolerate the film. More than the film, the pre-release promotional statements have caused this heavy blacklash from all corners. People have been very respectful of Suriya for his previous failures but this one just blasted all over with similar reactions.  Firstly, producer K.E. Gnanavelraja came out and addressed the criticism and negative feedback denying that people have been complaining about entire film. He stated that only sound is the issue and first 20 minutes did not work. He tried to handle it by saying that reducing sound in theatres would help.  Later, the team started inflating the numbers by almost Rs.20-25 crores according to various box office tracking sources. Still, the reactions against the movie became even more negative. People started trolling pre-release speeches and started counting down for Rs.2000 crores collection as the producer predicted.  Then, the producer stated that he and the entire team was happy with response and second part will happen in 2026. When nothing seemed to work, wife of Suriya, Jyothika, also an actress, released an open letter on her Instagram handle blaming critics, reviewers and alleging them off having an agenda and propagating hatred.  Over the first weekend, producer gave two to three interviews addressing negative feedback and Jyothika, directly attacked even viewers who had issues with the film. She stated that only first 20 mins did not work and rest of it all had hardwork of 2-3 years and praised it as visual spectacle.  The biggest takeaway from this debacle is that actors have very fragile ego and "Yes Men" around them have been nursing them for years together. When such an overwhelmingly negative feedback has been prevailing all over, either you can try to correct yourself or defend your work for ages to come.  Jyothika trying to defend Suriya's work and then naming herself as "true movie-lover" and not his wife while writing the letter, it looks like a pathetic attempt at blaming everyone elese but themselves for the mistakes. Yes, Suriya has worked hard for this film and technically it was brilliant in terms of cinematography.  But just visuals cannot make a compelling narrative. Even masters like Mani Ratnam faced debacles but they never seemed to blame audiences. Either they moved on making another film or maintained a dignified silence. Rather than showcasing that they live in a denial island, it would be better to stay silent and accept the mistakes.  Every actor has gone through such debacles and Suriya has been unable to find the best script for him for over a decade now. While Soorarai Pottru, Jai Bhim did break that run, they did not release theatrically. Maybe that's causing more frustration among his ranks more than the hardwork and money put into Kanguva.  Better scripts always warrant for better results at the box office, even at least in long run. And unfortunately, Kanguva just failed in really delivering to the potential that the script had.  
  మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై  డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి  నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్,వెంకట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.  షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న  ఈ చిత్రం నుంచి తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్‌‌ను  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్‌కు ఆల్  ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్‌‌లో శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌లో వచ్చిన సినిమా ఇది. మా ఫస్ట్ పోస్టర్, టీజర్ ఆర్జీవీ గారి చేతులమీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ లక్ష్మణరావు గారు ఈ సినిమాని ప్యాషనేట్‌గా నిర్మించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ ‘సినీ  నిర్మాణరంగంలోకి  శ్రీహరి గారి ప్రొద్బలంతో అడుగుపెట్టాం.  మా బ్యానర్ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నా. మా పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆర్జీవీ గారికి థ్యాంక్యూ’ అని చెప్పారు.  
ప్రస్తుతం 'పుష్ప-2' ట్రైలర్ గురించి అందరూ ఎంతలా మాట్లాడుకుంటున్నారో, ఆ ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంపై కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. తెలుగు నుంచి వస్తున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ, అందునా తమ ఫ్యామిలీలో ఒకడైన అల్లు అర్జున్ నటించిన సినిమా వస్తుంటే.. మెగా హీరోలు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలోని అల్లు అర్జున్ నంద్యాల పర్యటనను దృష్టిలో ఉంచుకునే, మెగా ఫ్యామిలీ స్పందించడం లేదని బన్నీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి మెగా అభిమానుల స్పందన మాత్రం మరోలా ఉంది. (Pushpa 2 Trailer) పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్లింప్స్, చిరంజీవి 'విశ్వంభర' టీజర్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదలైనప్పుడు అల్లు అర్జున్ స్పందించలేదు. కనీసం తాను ఇన్స్పిరేషన్ గా భావించే తన మావయ్య చిరంజీవి మూవీ టీజర్ కి బన్నీ నుంచి రెస్పాన్స్ లేదు. అలాంటిది 'పుష్ప-2' ట్రైలర్ కి మాత్రం మెగా హీరోలు ఎందుకు స్పందించాలని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మీ హీరో స్పందించనప్పుడు, మీ హీరో సినిమాకి ప్రతి స్పందన ఎలా ఆశిస్తున్నారని నిలదీస్తున్నారు. లాజిక్ గా ఆలోచిస్తే మెగా అభిమానుల ప్రశ్న సరైనదే. ప్రతి టీజర్ కి, ప్రతి ట్రైలర్ కి అందరూ స్పందించాలని లేదు. బహుశా సినిమా విడుదలై పెద్ద విజయం సాధించాక మెగా ఫ్యామిలీ నుంచి విషెస్ వస్తాయేమో. అప్పటివరకు వెయిట్ చేయకుండా.. ముందుకు ముందే మెగా హీరోలు రియాక్ట్ అవ్వలేదని అనడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏముంది  జీవితంలో నెలనెలా సంపాదన, ఖర్చులు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కొడుతూ ఉంటాయి. ఇది ప్రతి నెలా ఉండేదే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు. అయితే  ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సంవత్సర ముగింపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉంటుంది. ఈ మార్చ్ నెలలోనే బడ్జెట్ లు నిర్ణయించబడతాయి.  పన్నులు, ఖర్చులు, మిగులు, ఆదాయం, నిధుల కేటాయింపు ఇలా అన్నిటికీ ఈ మార్చ్ నెల మూల కేంద్రకంలా ఉంటుంది.   ప్రభుత్వాలు ఆర్థికపరంగా సాగడానికి ఈ ప్రణాళికలు ఎంత మేలు చేస్తాయో దీని వల్ల అర్థమవుతూనే ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఇలాంటి ఆర్థిక ప్రణాళిక ఒకటి ఎందుకు ఏర్పాటు చేశాకోకూడదు అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది?? కుటుంబానికో అర్గిక ప్రణాళిక!! ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా వరకు అందరి విషయంలో జరుగుతూ ఉండేవి అయినా అవన్నీ అనుకోవడంతోనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నోటి లెక్కల్లో ఆర్థిక సంస్కరణలు లాగే కుటుంబాలే బోలెడు. అలాంటి కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఒక స్లోగన్ పట్టుకోవాలి, ఆ స్లోగన్ ప్రకారం దారి మార్చుకోవాలి.  కొత్తకొత్తగా ఉన్నదీ!!  నిజంగానే కొత్తగా ఉండాలి, అప్పుడు అలాగే పాడుకోవచ్చు, ఆర్థిక ఖంగారులు లేకుండా ఆస్ట్రేలియాలో గంతులేసే కంగారుల్లా ఉల్లాసంగా ఉండచ్చు.  ప్రతి ఒంట్లో సంవత్సరం వారీ పెద్ద పెద్ద ఖర్చుల సందర్భాలు మామూలుగానే వస్తుంటాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత పిల్లల చదువు"కొనడానికి" అదే అదే చదువు కోసం పెట్టె ఖర్చు అన్నమాట. ఏడాదికో మారు పిల్లల ఫీజు, పుస్తకాల ఖర్చు మొదలైనది. ఆ తరువాత ఇన్సూరెన్స్ ల కహానీ. ఏడాదికోసారి ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టే సమవమ్ వచ్చినప్పుడు మధ్యతరగతి జీవులు పడే తంటాలు అంతా ఇంతా కావు. ఈ ఇన్సూరెన్స్  ల కోసం నెలవారీ సంపాదనలో కొద్దిగా ముందుజాగ్రత్తగా తీసిపెడుతుంటే సంవత్సరానికోసారికి పడే టెన్షన్ హుష్ కాకి. పండుగలు, పుట్టినరోజులు అన్ని ఇళ్లలో తీసుకొచ్చే సందడి ఎంతో గొప్పది. అయితే చాలామంది అలాంటి సందడిని కాస్త అసంతృప్తితోనే గడిపేస్తూ ఉంటారనేది నిజం. బాగా డబ్బున్న వాళ్లే ఇలాంటి సంతోషాల్ని ఆర్థికంగా కూడా ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు ఉన్నదాంతో తృప్తిపడటమనే మాటను పెద్దలు చెప్పి, పాటించేవాళ్ళు, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పట్లో ఉన్నదాంట్లో తృతీ పడాలి అనే మాట వింటే కాంప్రమైజ్ అవుతున్నట్టు, తమని తాము మోసం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు కాబట్టి ఇప్పట్లో తృప్తి లభించాలి అంటే ఆర్థిక స్థాయిలు ఎక్కువగానే ఉండాలి. పొరపాట్లు తలపోట్లు!! చాలామంది ఆర్థిక పరంగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన ప్లానింగ్ లేకుండా చాలా ఖరీదైన వస్తువులు ఇన్స్టల్మెంట్ లలో  కొనడం, వడ్డీ శాతం గురించి సీరియస్ నెస్ లేకుండా బంగారు నగలు తాకట్టు పెట్టడం, కారణం లేకుండా షాపింగ్ చేయడం, సరదాకు, మోహమాటాలకు వేల రూపాయల ఖర్చులు చేసేయ్యడం. సాధ్యాసాద్యల ఆలోచన లేకుండా అప్పులు చేయడం. ఇలాంటి వాటి వల్ల ఉన్న కాసింతలో సర్దుకుపోవడం అనే తృప్తి కూడా ఉండకుండా దూరమైపోతుంది. అలాంటి ఇబ్బందుల అసంతృప్తులు ఇంట్లో ఒకరిమీద మరొకరు చూపించుకుంటూ తలపోటు తెచ్చుకుంటారు. ఆర్యోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాని అందరూ దాన్ని కొంటున్నారు. రెండింటికి తేడా ఏంటి అంటే?? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, శారీరక వ్యాయాయం ఉంటే ఆరోగ్యమదే మెరుగుపడుతుంది. కానీ అవేమీ లేకుండా లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా కృత్రిమ మందులు వాడితే ఆరోగ్యం బాగైపోతుందని ప్రోయిన్లు, వితమిన్లతో సహా అన్నిటినీ టాబ్లెట్స్ రూపంలో కొని వాడితే ఆయుష్షు తగ్గుతుంది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లలో ఒకో శాఖకు ఇంత అని నిధులు కేటాయించినట్టు. మనము కూడా మన సంపాదనను అనుసరించి విద్య, ఆరోగ్యం, వైద్యం, సంతోషాలు, ప్రత్యేకతలు వంటి వాటికి ప్రధాన్యతలు ఇచ్చుకుంటూ ఉంటే మన సంవత్సరం కూడా ఆర్థిక భరోసాతో నడిచేస్తుంది.  ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తమ సంపాదనతో తృప్తి పడేవాళ్ళు అన్నిటినీ హ్యాండిల్ చేసుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.  
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు  అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం,  బంధువులకు దూరంగా.. కొత్త జంట  ఒకరినొకరు తెలుసుకోవటానికి,  అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన  సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే  వేరే విషయం. కానీ పెద్దలు  కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు  ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా  లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం  సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది.  హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే.. పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు.. పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.  రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి  ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి  అస్సలు మాట్లాడొద్దు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు. గతాలు వద్దూ.. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు.  ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి. వాదన వద్దూ.. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు  ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం.  హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది. గదికే పరిమితం కావద్దు.. హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు.  అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.                                           *నిశ్శబ్ద.
  దారి తప్పినప్పుడల్లా మనల్ని సన్మార్గంలో నడిపించటానికి గురువు అవసరం. అలాంటి గొప్ప గురువులలో ఒకరైన గురునానక్ జయంతి నేడు. గురునానక్ జయంతి సిక్కులకి అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి.  సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతినీ  ఒక పండుగలా జరుపుకుంటారు.  సిక్కులకే కాకుండా గురునానక్ బోధనలు  ప్రజలందరికీ, మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విలువలు నేర్పిస్థాయి. ఈ రోజును గురు పురబ్, గురునానక్ ప్రకాశ్ ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగుతుంది. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతి జరుపుకుంటున్నారు. గురునానక్ 1469 లో తల్వండిలో జన్మించి, చిన్న వయస్సులోనే  ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి కనబర్చారు. ఇతరులకి సాయం చేయాలనీ ఆయనకు ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఆధిపత్యం వహించిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతం ముందడుగు వేసింది. గురునానక్ స్థాపించిన సిక్కిజం, వినయాన్ని, సేవను, దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించే దిశగా సాగింది.  గురునానక్ జయంతి ప్రాముఖ్యత .. గురునానక్ జయంతి అంటే కేవలం గురునానక్ కు నివాళి కాదు, అది ఆయన బోధనలకు ఇచ్చే గౌరవం. ఇది విశ్వ సోదరభావం, కరుణ,  సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. సిక్కులకు, గురునానక్ ప్రతిపాదించిన ఏకమతం, భక్తి సూత్రాలను గుర్తు చేస్తుంది. "ఇక్ ఓంకార్" అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఆయన సందేశం.  సిక్కిజానికి ఈ సందేశం కేంద్ర బిందువుగా ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఏకదైవవాద దేవుని ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు.  గురునానక్ జయంతి ఎలా జరుపుకుంటారు? గురునానక్ జయంతిని భారతదేశంలోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  సిక్కు ప్రజలందరూ గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ‘అఖండ్ పాఠ్’, అంటే గురు గ్రంథ్ సాహిబ్  నిరంతర 48గంటల పఠనం గురుద్వారలో ప్రారంభమవుతుంది. భక్తులు తెల్లవారుజామున ప్రార్థనలు, ‘నగర కీర్తన’  అని పిలువబడే ఊరేగింపులో పాల్గొంటారు, ఇందులో గురుగ్రంథ్ సాహిబ్‌ని ఒక పల్లకిలో ఉంచి వీధుల్లో తీసుకువెళతారు. ఊరేగింపు సమయంలో కీర్తనలు, సిక్కు యోధులు నిర్వహించే ‘గత్కా’  అనే యోధకళా ప్రదర్శనలు ఉంటాయి. ‘లంగర్’, అంటే ఉచిత సామూహిక భోజనం.  ఈ వేడుకలో ఇదే ప్రధాన భాగం. మతం, కులం లేదా లింగం ఇలా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే లంగర్, గురునానక్ విలువలైన  సమానత్వం, సేవా గుణాలను  ప్రతిబింబిస్తుంది.  గురు నానక్ బోధనలు.. గురునానక్ బోధనలు సులభంగ ఉంటూనే లోతైన అర్థం కలిసి ఉంటాయి.  అన్ని విశ్వాసాల ప్రజలకు సంబంధించినవి. ఆయన బోధనలలో ప్రధానంగా మూడు సూత్రాలు ఉన్నాయి:   దేవుని పేరును జపించడం  ‘నిజాయితీగా సంపాదించడం ఉన్నది ఇతరులకు కొంత పంచడం.  ఇలా..  వినయము, నిజాయితీ,  దయతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. ప్రజలంతా  దేవుని దృష్టిలో సమానమని, కులం వ్యవస్థ, లింగ వివక్ష వంటివాటిని తిరస్కరించారు.  గురునానక్ బోధనలు  ప్రుజలలో  దయ, సేవాభావం కలిగి ఉండాలని, దేవుని పట్ల భక్తితో జీవితం గడపాలని మార్గనిర్దేశం చేస్తాయి. గురునానక్ జయంతి మనకు సహనం, దానం, గౌరవించటం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతుంది.                                      *రూపశ్రీ   
  ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఎక్కువ శాతం నీరు,  ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.  ముఖ్యంగా మొలలు, మలబద్దకం.  మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు.  అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట.  ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే.. ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి  చాలా పోషకాలు అందిస్తాయి.  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు. ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.  ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది.  ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకం, అజీర్ణం,  ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి.  సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి.  రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి.  అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి.  శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి.  కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం.  ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది.  సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది.  ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు.  ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు.                                           *రూపశ్రీ.
సొంపు లేదా సోపు చాలా మందికి తెలిసిన పదార్థమే. ఇవి జీలకర్రను పోలిన గింజలు. తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం తరువాత వీటిని ఇస్తుంటారు. భారీ భోజనం తరువాత సొంపు తింటే ఆహారం బాగా జీర్ణమై కడుపు బరువు తగ్గుతుందని అంటారు. పైగా ఇది గొప్ప మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది భోజనం తరువాత సొంపు తింటారు. చాలామందికి సొంపు గింజలను ఇలా తినడమే తెలుసు. కానీ సొంపు గింజలను కాకుండా సొంపు గింజల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. జీర్ణక్రియ.. సొంపు గింజల నీరు  తీసుకోవడం వల్ల  జీర్ణక్రియను  మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  గ్యాస్, అసిడిటీ,  అజీర్ణాన్ని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు  తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడంలో సొంపు నీరు బాగా పనిచేస్తాయి. సొంపు గింజలలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇక సొంపు నీటిలో సమ్మేళనాలు శరీరంలో ఉండే కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది.  పరగడుపునే సొంపు నీరు తాగడం చాలామంచిది. యాంటీ ఆక్సిడెంట్లు.. సొంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కాణాలను కాపాడటంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా కనిపించడంలోనూ, అనేకరకాల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది.. సొంపులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సొంపు నీటిని తాగుతూ ఉంటే శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్దిని అడ్డుకుంటుంది.  క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.                                                 *నిశ్శబ్ద.
శరీరం  మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల  పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  పాల వల్ల  ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు  పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లాక్టోస్ ప్రతికూలత  ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో  కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు. పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి   వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు  ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి  ఒక సిప్ పాలు తాగిన తర్వాత  వికారం మొదలైపోతుంటుంది. క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా  పాలు అస్సలు తాగకూడదు.  ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు.  ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు. పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు.                                                             *నిశ్శబ్ద.