మీ ఆర్థిక సంవత్సరం ఎలా ఉంది??
posted on Nov 18, 2024 9:30AM
ఏముంది జీవితంలో నెలనెలా సంపాదన, ఖర్చులు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కొడుతూ ఉంటాయి. ఇది ప్రతి నెలా ఉండేదే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు. అయితే ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సంవత్సర ముగింపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉంటుంది. ఈ మార్చ్ నెలలోనే బడ్జెట్ లు నిర్ణయించబడతాయి. పన్నులు, ఖర్చులు, మిగులు, ఆదాయం, నిధుల కేటాయింపు ఇలా అన్నిటికీ ఈ మార్చ్ నెల మూల కేంద్రకంలా ఉంటుంది.
ప్రభుత్వాలు ఆర్థికపరంగా సాగడానికి ఈ ప్రణాళికలు ఎంత మేలు చేస్తాయో దీని వల్ల అర్థమవుతూనే ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఇలాంటి ఆర్థిక ప్రణాళిక ఒకటి ఎందుకు ఏర్పాటు చేశాకోకూడదు అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది??
కుటుంబానికో అర్గిక ప్రణాళిక!!
ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా వరకు అందరి విషయంలో జరుగుతూ ఉండేవి అయినా అవన్నీ అనుకోవడంతోనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నోటి లెక్కల్లో ఆర్థిక సంస్కరణలు లాగే కుటుంబాలే బోలెడు. అలాంటి కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఒక స్లోగన్ పట్టుకోవాలి, ఆ స్లోగన్ ప్రకారం దారి మార్చుకోవాలి.
కొత్తకొత్తగా ఉన్నదీ!!
నిజంగానే కొత్తగా ఉండాలి, అప్పుడు అలాగే పాడుకోవచ్చు, ఆర్థిక ఖంగారులు లేకుండా ఆస్ట్రేలియాలో గంతులేసే కంగారుల్లా ఉల్లాసంగా ఉండచ్చు.
ప్రతి ఒంట్లో సంవత్సరం వారీ పెద్ద పెద్ద ఖర్చుల సందర్భాలు మామూలుగానే వస్తుంటాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత పిల్లల చదువు"కొనడానికి" అదే అదే చదువు కోసం పెట్టె ఖర్చు అన్నమాట. ఏడాదికో మారు పిల్లల ఫీజు, పుస్తకాల ఖర్చు మొదలైనది.
ఆ తరువాత ఇన్సూరెన్స్ ల కహానీ. ఏడాదికోసారి ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టే సమవమ్ వచ్చినప్పుడు మధ్యతరగతి జీవులు పడే తంటాలు అంతా ఇంతా కావు. ఈ ఇన్సూరెన్స్ ల కోసం నెలవారీ సంపాదనలో కొద్దిగా ముందుజాగ్రత్తగా తీసిపెడుతుంటే సంవత్సరానికోసారికి పడే టెన్షన్ హుష్ కాకి.
పండుగలు, పుట్టినరోజులు అన్ని ఇళ్లలో తీసుకొచ్చే సందడి ఎంతో గొప్పది. అయితే చాలామంది అలాంటి సందడిని కాస్త అసంతృప్తితోనే గడిపేస్తూ ఉంటారనేది నిజం. బాగా డబ్బున్న వాళ్లే ఇలాంటి సంతోషాల్ని ఆర్థికంగా కూడా ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు ఉన్నదాంతో తృప్తిపడటమనే మాటను పెద్దలు చెప్పి, పాటించేవాళ్ళు, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పట్లో ఉన్నదాంట్లో తృతీ పడాలి అనే మాట వింటే కాంప్రమైజ్ అవుతున్నట్టు, తమని తాము మోసం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు కాబట్టి ఇప్పట్లో తృప్తి లభించాలి అంటే ఆర్థిక స్థాయిలు ఎక్కువగానే ఉండాలి.
పొరపాట్లు తలపోట్లు!!
చాలామంది ఆర్థిక పరంగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన ప్లానింగ్ లేకుండా చాలా ఖరీదైన వస్తువులు ఇన్స్టల్మెంట్ లలో కొనడం, వడ్డీ శాతం గురించి సీరియస్ నెస్ లేకుండా బంగారు నగలు తాకట్టు పెట్టడం, కారణం లేకుండా షాపింగ్ చేయడం, సరదాకు, మోహమాటాలకు వేల రూపాయల ఖర్చులు చేసేయ్యడం. సాధ్యాసాద్యల ఆలోచన లేకుండా అప్పులు చేయడం. ఇలాంటి వాటి వల్ల ఉన్న కాసింతలో సర్దుకుపోవడం అనే తృప్తి కూడా ఉండకుండా దూరమైపోతుంది. అలాంటి ఇబ్బందుల అసంతృప్తులు ఇంట్లో ఒకరిమీద మరొకరు చూపించుకుంటూ తలపోటు తెచ్చుకుంటారు.
ఆర్యోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాని అందరూ దాన్ని కొంటున్నారు. రెండింటికి తేడా ఏంటి అంటే?? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, శారీరక వ్యాయాయం ఉంటే ఆరోగ్యమదే మెరుగుపడుతుంది. కానీ అవేమీ లేకుండా లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా కృత్రిమ మందులు వాడితే ఆరోగ్యం బాగైపోతుందని ప్రోయిన్లు, వితమిన్లతో సహా అన్నిటినీ టాబ్లెట్స్ రూపంలో కొని వాడితే ఆయుష్షు తగ్గుతుంది.
రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లలో ఒకో శాఖకు ఇంత అని నిధులు కేటాయించినట్టు. మనము కూడా మన సంపాదనను అనుసరించి విద్య, ఆరోగ్యం, వైద్యం, సంతోషాలు, ప్రత్యేకతలు వంటి వాటికి ప్రధాన్యతలు ఇచ్చుకుంటూ ఉంటే మన సంవత్సరం కూడా ఆర్థిక భరోసాతో నడిచేస్తుంది.
ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తమ సంపాదనతో తృప్తి పడేవాళ్ళు అన్నిటినీ హ్యాండిల్ చేసుకోగలరు.
◆ వెంకటేష్ పువ్వాడ.