ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు అందరూ హైదరాబాద్ లో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. పలువురు నారావారి పల్లెకు చేరుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు.  అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం నారా రామ్మూర్తి నాయుడి మృతి పట్ల కనీసం సంతాపం కూడా తెలపలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.  నారా రామ్మూర్తినాయుడి మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సంతాపం  వ్యక్తం చేయకపోవడం, అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైందిని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 
దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరిన్ని ఆంక్షలు అమలు చేయడానికి నిర్ణయించింది.  ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 కింద మరిన్ని నిబంధనలను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది.   *ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేయనుంది. ఈ ఆదేశాలు సోమవారం (నవంబర్ 18) నుంచే అమలులోకి వచ్చాయి. అవికూడా ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తుంది. ఇంకా ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపైనా,  ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతక న్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాలపైనా నిషేధం విధించింది.   అంతే కాకుండా  అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చే సింది.  ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది. *రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్  ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫారసుపై ఒకటి రెండు రోజులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  
  మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.  బ్రెజిల్ వేదికగా సోమ, మంగళ (నవంబర్ 18, 19) వారాలలో  రెండు రోజుల పాటు జరిగే  19వ జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ్య దేశాల నాయకులతో మోడీ కీలక చర్చలు జరపనున్నారు. కీలకమైన ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నాయకులు పాల్గొంటారు తాను బ్రెజిల్ చేరుకున్న విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డిజెనీరో నగరంలో అడుగు పెట్టానననీ, ఈ సదస్సులో సభ్యదేశాల నేతలతో  ఫలవంతమైన చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాననీ పేర్కొన్నారు. తనకు విమానాశ్రయంలో  లభించిన స్వాగతానికి సంబంధించిన ఫొటోలను ఆయన తన పోస్టుతో పాటు షేర్ చేశారు.  మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా సందర్శన అనంతరం ప్రధాని మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయ సమూహంతో కూడా ఆయన మాట్లాడారు. కాగా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.  
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం ఎక్కడా చూసినా పుష్ప పేరు మారుమోగిపోతోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా అందరూ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'పుష్ప-2' గురించి మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'పుష్ప-2' ట్రైలర్ ను తాజాగా పాట్నాలో లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో, ట్రైలర్ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు సైతం 'పుష్ప-2' ట్రైలర్ కి ఫిదా అయ్యారు. ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా 'పుష్ప-2' ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. "పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న భారీ పేలుడు సంభవించనుంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నాను పుష్ప." అంటూ రాజమౌళి పవర్ ఫుల్ ట్వీట్ చేశారు.  "పుష్ప-2 ట్రైలర్ మ్యాసివ్ గా, పవర్ ఫుల్ గా ఉంది. మరో బ్లాక్ బస్టర్ సిద్ధమవుతోంది." అంటూ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. "ప్రతి ఫ్రేమ్ లో అల్లు అర్జున్ కష్టం, తపన కనిపిస్తోంది. ట్రైలర్ లో విజువల్స్, బీజీఎం, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. టీంకి హ్యాట్సాఫ్." అని దర్శకుడు హరీష్ శంకర్ రాసుకొచ్చారు. "ఇది నిజంగానే వైల్డ్ ఫైర్. ట్రైలర్ పవర్ ప్యాక్డ్ గా ఉంది. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నా." అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. "పుష్ప-2 ట్రైలర్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ ఇంటెన్సిటీ, స్వాగ్ అదిరిపోయాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ సుకుమార్ పనితనం కనిపిస్తోంది. దేవిశ్రీప్రసాద్ బీజీఎం ఆకట్టుకుంది." అని దర్శకుడు బాబీ రాసుకొచ్చారు. "ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్..." అంటూ దర్శకుడు బుచ్చిబాబు ట్వీట్ చేశారు. "తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగొచ్చాడు. మరింత బిగ్గరగా, భయంకరంగా, ఘోరంగా ఉన్నాడు. డిసెంబర్ 5 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా." అని దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకొచ్చారు. "యాక్షన్ తో కూడిన పుష్ప-2 ట్రైలర్ అదిరిపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ మ్యాజిక్ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నా." అని దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. "పుష్ప-2 ట్రైలర్ ప్యూర్ మ్యాడ్ నెస్" అని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు.  వీరితో పాటు ఇంకా ఎందరో సెలబ్రిటీలు 'పుష్ప-2' ట్రైలర్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను పక్కన పెడితే.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక వంటి వారు కూడా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనను మనసులో పెట్టుకునే పుష్ప-2 ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించడం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
Nayanthara has gained huge image as Lady Superstar in Tamil Cinema. She became hugely popular in Telugu, Malayalam languages as well with her big hits. With Jawan, she delivered a huge Rs.1000 crores hit in Hindi, too. So, the actress commands a huge fan following like no other actress in South Indian Cinema.  She has been looking to be part of more lady-oriented movies from past 6 years. Now, she is taking on a complete action avatar as a lady warrior. The makers have released title teaser with her in an action sequence saving herself and her kid from group of attackers.  The action design is sleek and stylish. Nayanthara looks believable as Rakkayie and wielding dangerous weapons, she looks terrifying. With blood splatters all over, the actress has been able to raise curiosity around and buzz for the film with the title teaser itself. 
పాన్ ఇండియా కలలు అందరూ కంటున్నారు. కానీ ఆ కలను నిజం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా చేసి, వివిధ భాషల్లో విడుదల చేస్తే సరిపోదు. అందుకు తగ్గ భారీ ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు రాజమౌళి (Rajamouli) అందరికంటే ముందు ఉంటారు. ఆయన మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. సినిమాని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయితే హీరోలలో మాత్రం ఆ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేసుకునే వారు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసే దిశగా అల్లు అర్జున్ (Allu Arjun) అడుగులు పడుతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'పుష్ప-2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో స్టార్ట్ చేసింది మూవీ టీం. నవంబర్ 17న పాట్నాలో 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు, దాదాపు రెండు లక్షల మంది అభిమానులు హాజరయ్యారని అంచనా. నార్త్ స్టేట్ లో, అందునా ఏకంగా రెండు లక్షల మంది సమక్షంలో.. సక్సెస్ ఫుల్ గా గ్రాండ్ ఈవెంట్ జరపడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో 'పుష్ప-2' టీం నూటికి నూరు శాతం విజయం సాధించింది. అంతేకాదు పాట్నాలో జరిగిన ఈవెంట్ సౌండ్, దేశవ్యాప్తంగా మోతమోగిపోయింది. ఎంతలా అంటే రాజమౌళి సైతం ఈ ఈవెంట్ సక్సెస్ కి ఫిదా అయిపోయారు. (Pushpa 2 Trailer) పాట్నాలో జరిగిన 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ పై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న భారీ పేలుడు సంభవించనుంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నాను పుష్ప." అంటూ రాజమౌళి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.  రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్ తో.. నార్త్ లో చేసిన 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థమవుతుంది. అల్లు అర్జున్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇదే టెంపోని కొనసాగిస్తే.. భవిష్యత్ లో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి వర్సెస్ అల్లు అర్జున్ అనే పేరు పడినా ఆశ్చర్యంలేదు.
నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ(balakrishna)కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు.తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకి సంబంధించిన పనుల్ని తనే దగ్గరనుండి చూసుకోవడమే కాకుండా,తన అప్ కమింగ్ చిత్రమైన 'డాకు మహారాజ్'(daku maharaj)షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు.ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల కాబోతుంది. దీంతో అతి త్వరలోనే 'డాకు మహారాజ్' షూటింగ్ ని బాలయ్య కంప్లీట్ చెయ్యబోతున్నాడు.ఆ తర్వాత ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా వెంటనే 'అఖండ 2 'షూటింగ్ ని కూడా స్టార్ట్  చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.డిసెంబర్ రెండో వారంలో బాలకృష్ణ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనేలా దర్శకుడు బోయపాటి ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక మోక్షజ్ణ మూవీ కూడా డిసెంబర్ మధ్య నుంచే షూటింగ్ దశలోకి అడుగుపెట్టబోతుందని, ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఈ విధంగా తండ్రి, కొడుకులిద్దరు డిసెంబర్ నెలలోనే షూటింగ్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చారు.పై పెచ్చు బాలయ్య,మోక్షజ్న సినిమాలకి ఒకే రకమైన ప్రత్యేకత ఉంది.అదేంటంటే  బాలయ్య, మోక్షజ్ఞ చిత్రాలు రెండు కూడా ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలతో తెరకెక్కుతున్నాయి.అఖండ 2(akhanda 2)ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన మూవీ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ కూడా మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ విషయాన్నీ  దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma)అధికారంగా వెల్లడి కూడా చేసాడు. ఇక ఈ రెండు చిత్రాలకి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.  
SS Rajamouli has delivered films that became huge blockbusters from the beginning of his career. He has been able to increase his and Telugu Cinema market with each of his film. Post Magadheera, his vision has shifted to Pan-India market and he delivered never anticipated blockbusters with Baahubali series.  Baahubali 2 has become the biggest ever blockbuster for any Indian regional film and he opened wide Pan-India market for every film. With his inspiration, KGF series and Pushpa have decided to go to Pan-India level. Now, Pushpa 2 is set to become another big blockbuster for Telugu Cinema on the cards of Baahubali 2.  With Sukumar being at the helm, the expectations have been sky high. Rajamouli who is fan of the director has openly praised the film and wished to join the party. On social media, wishing the film, he wrote,  "WILDFIRE started in Patna!! Spreading across the country!! Explodes on Dec 5th!!! CAN’T WAIT for the party PUSHPA!!!" Icon Star Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil are acting in the leading roles in this film. Devi Sri Prasad composed songs and S Thaman is scoring background score. Pushpa 2 trailer has been unveiled on 17th November and the movie is releasing on 5th December worldwide.  
తెలుగు చిత్ర సీమలో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించే హీరోల్లో నారా రోహిత్(nara rohit)కూడా ఒకడు. తన మొదటి సినిమా బాణం దగ్గరనుంచి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు వచ్చిన ప్రతిధ్వని పార్ట్ 2 చిత్రాలే అందుకు ఉదాహరణ.శనివారం నాడు అయన తండ్రి మాజీ ఎంఎల్ఏ నారా రామ్మూర్తి నాయుడు చనిపోయిన విషయం తెలిసిందే. కార్డియో రెస్పిరేటరీ సమస్యల కారణంగానే రామ్మూర్తి నాయుడు(ramamurthy naidu)చనిపోయారు. కార్డియో రెస్పిరేటరీ అంటే శరీరంలో అన్ని కణాలకు ప్రవహించే రక్త ప్రసరణ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగిపోతుంది. ఈ కారణంతోనే పద్నాలుగవ తారీఖున ఆయనకి గుండె పోటు రావడంతో కుటుంబసభ్యులు  ఆసుపత్రిలో చేర్పించారు.దీంతో డాక్టర్స్ స్టంట్ కూడా వేయడం జరిగింది. కొంత కోలుకుంటున్నారు అనే లోపే గతంలోనే ఆయనకి ఉన్న శ్వాస కి సంబంధించిన కారణాల వల్ల   పల్మనరీ ఇష్యుస్ ట్రిగర్ అవడంతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ అవ్వడంతో సీపాప్ ద్వారా కృత్రిమంగా శ్వాస కూడా అందించడానికి డాక్టర్స్ ట్రై చేసారు. కానీ పదహారవ తేదీ ఉదయం మళ్ళీ కార్డియాడిక్ అటాక్ అవ్వడంతో చనిపోవడం జరిగింది.నిన్న ఆయన  స్వగ్రామం నారావారి పల్లె లో ప్రభుత్వ లాంఛనాలతో  అంత్యక్రియలు జరిగాయి.   ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)కి రామ్మూర్తి నాయుడు తమ్ముడున్న విషయం  తెలిసిందే.  
'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో ఘనంగా జరిగింది. దాదాపు రెండు లక్షల మంది అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకకు అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ హిందీ స్పీచ్ తో అదరగొట్టాడు. (Allu Arjun Speech) అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. ఎప్పుడు పాట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. దేశం మొత్తానికి థ్యాంక్యూ. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్యూ. ఇది నా గొప్పతనం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఈ సందర్భంగా పుష్ప టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. ‘పుష్ప’ను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. స్పాన్సర్స్‌కి, పోలీస్ సిబ్బందికి, అభిమానులందరికీ థ్యాంక్యూ. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా" అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2'. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ వచ్చింది. (Pushpa 2 Trailer) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా 'పుష్ప-2' వస్తోంది. నవంబర్ 17 సాయంత్రం పాట్నాలో జరిగిన ఈవెంట్ లో 'పుష్ప-2' ట్రైలర్ ను లాంచ్ చేశారు. 2 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ అదిరిపోయింది. ఏనుగు ఘీంకారం, ఎర్రచందనం స్మగ్లింగ్, పెద్ద మొత్తంలో డబ్బు విజువల్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. "డబ్బంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో ఉంది" అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్ తో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేశారు. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. యాక్షన్ తో పాటు.. రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రతో చూపించారు. ఇక పుష్పరాజ్, షకావత్(ఫహాద్ ఫాజిల్) మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. "పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్" అనే డైలాగ్ తో ఈ సినిమా స్థాయి ఏంటో చెప్పకనే చెప్పేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అలాగే అల్లు అర్జున్ బాడీ ల్యాంగ్వేజ్, గెటప్ లతో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయాయి. ఇక "రప్ప రప్ప", "పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్" అంటూ ట్రైలర్ ని ఎండ్ చేసిన విధానం వేరే లెవెల్. మొత్తానికి పుష్పరాజ్ మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఏముంది  జీవితంలో నెలనెలా సంపాదన, ఖర్చులు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కొడుతూ ఉంటాయి. ఇది ప్రతి నెలా ఉండేదే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు. అయితే  ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సంవత్సర ముగింపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉంటుంది. ఈ మార్చ్ నెలలోనే బడ్జెట్ లు నిర్ణయించబడతాయి.  పన్నులు, ఖర్చులు, మిగులు, ఆదాయం, నిధుల కేటాయింపు ఇలా అన్నిటికీ ఈ మార్చ్ నెల మూల కేంద్రకంలా ఉంటుంది.   ప్రభుత్వాలు ఆర్థికపరంగా సాగడానికి ఈ ప్రణాళికలు ఎంత మేలు చేస్తాయో దీని వల్ల అర్థమవుతూనే ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఇలాంటి ఆర్థిక ప్రణాళిక ఒకటి ఎందుకు ఏర్పాటు చేశాకోకూడదు అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది?? కుటుంబానికో అర్గిక ప్రణాళిక!! ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా వరకు అందరి విషయంలో జరుగుతూ ఉండేవి అయినా అవన్నీ అనుకోవడంతోనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నోటి లెక్కల్లో ఆర్థిక సంస్కరణలు లాగే కుటుంబాలే బోలెడు. అలాంటి కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఒక స్లోగన్ పట్టుకోవాలి, ఆ స్లోగన్ ప్రకారం దారి మార్చుకోవాలి.  కొత్తకొత్తగా ఉన్నదీ!!  నిజంగానే కొత్తగా ఉండాలి, అప్పుడు అలాగే పాడుకోవచ్చు, ఆర్థిక ఖంగారులు లేకుండా ఆస్ట్రేలియాలో గంతులేసే కంగారుల్లా ఉల్లాసంగా ఉండచ్చు.  ప్రతి ఒంట్లో సంవత్సరం వారీ పెద్ద పెద్ద ఖర్చుల సందర్భాలు మామూలుగానే వస్తుంటాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత పిల్లల చదువు"కొనడానికి" అదే అదే చదువు కోసం పెట్టె ఖర్చు అన్నమాట. ఏడాదికో మారు పిల్లల ఫీజు, పుస్తకాల ఖర్చు మొదలైనది. ఆ తరువాత ఇన్సూరెన్స్ ల కహానీ. ఏడాదికోసారి ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టే సమవమ్ వచ్చినప్పుడు మధ్యతరగతి జీవులు పడే తంటాలు అంతా ఇంతా కావు. ఈ ఇన్సూరెన్స్  ల కోసం నెలవారీ సంపాదనలో కొద్దిగా ముందుజాగ్రత్తగా తీసిపెడుతుంటే సంవత్సరానికోసారికి పడే టెన్షన్ హుష్ కాకి. పండుగలు, పుట్టినరోజులు అన్ని ఇళ్లలో తీసుకొచ్చే సందడి ఎంతో గొప్పది. అయితే చాలామంది అలాంటి సందడిని కాస్త అసంతృప్తితోనే గడిపేస్తూ ఉంటారనేది నిజం. బాగా డబ్బున్న వాళ్లే ఇలాంటి సంతోషాల్ని ఆర్థికంగా కూడా ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు ఉన్నదాంతో తృప్తిపడటమనే మాటను పెద్దలు చెప్పి, పాటించేవాళ్ళు, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పట్లో ఉన్నదాంట్లో తృతీ పడాలి అనే మాట వింటే కాంప్రమైజ్ అవుతున్నట్టు, తమని తాము మోసం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు కాబట్టి ఇప్పట్లో తృప్తి లభించాలి అంటే ఆర్థిక స్థాయిలు ఎక్కువగానే ఉండాలి. పొరపాట్లు తలపోట్లు!! చాలామంది ఆర్థిక పరంగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన ప్లానింగ్ లేకుండా చాలా ఖరీదైన వస్తువులు ఇన్స్టల్మెంట్ లలో  కొనడం, వడ్డీ శాతం గురించి సీరియస్ నెస్ లేకుండా బంగారు నగలు తాకట్టు పెట్టడం, కారణం లేకుండా షాపింగ్ చేయడం, సరదాకు, మోహమాటాలకు వేల రూపాయల ఖర్చులు చేసేయ్యడం. సాధ్యాసాద్యల ఆలోచన లేకుండా అప్పులు చేయడం. ఇలాంటి వాటి వల్ల ఉన్న కాసింతలో సర్దుకుపోవడం అనే తృప్తి కూడా ఉండకుండా దూరమైపోతుంది. అలాంటి ఇబ్బందుల అసంతృప్తులు ఇంట్లో ఒకరిమీద మరొకరు చూపించుకుంటూ తలపోటు తెచ్చుకుంటారు. ఆర్యోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాని అందరూ దాన్ని కొంటున్నారు. రెండింటికి తేడా ఏంటి అంటే?? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, శారీరక వ్యాయాయం ఉంటే ఆరోగ్యమదే మెరుగుపడుతుంది. కానీ అవేమీ లేకుండా లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా కృత్రిమ మందులు వాడితే ఆరోగ్యం బాగైపోతుందని ప్రోయిన్లు, వితమిన్లతో సహా అన్నిటినీ టాబ్లెట్స్ రూపంలో కొని వాడితే ఆయుష్షు తగ్గుతుంది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లలో ఒకో శాఖకు ఇంత అని నిధులు కేటాయించినట్టు. మనము కూడా మన సంపాదనను అనుసరించి విద్య, ఆరోగ్యం, వైద్యం, సంతోషాలు, ప్రత్యేకతలు వంటి వాటికి ప్రధాన్యతలు ఇచ్చుకుంటూ ఉంటే మన సంవత్సరం కూడా ఆర్థిక భరోసాతో నడిచేస్తుంది.  ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తమ సంపాదనతో తృప్తి పడేవాళ్ళు అన్నిటినీ హ్యాండిల్ చేసుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.  
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు  అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం,  బంధువులకు దూరంగా.. కొత్త జంట  ఒకరినొకరు తెలుసుకోవటానికి,  అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన  సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే  వేరే విషయం. కానీ పెద్దలు  కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు  ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా  లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం  సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది.  హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే.. పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు.. పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.  రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి  ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి  అస్సలు మాట్లాడొద్దు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు. గతాలు వద్దూ.. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు.  ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి. వాదన వద్దూ.. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు  ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం.  హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది. గదికే పరిమితం కావద్దు.. హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు.  అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.                                           *నిశ్శబ్ద.
  దారి తప్పినప్పుడల్లా మనల్ని సన్మార్గంలో నడిపించటానికి గురువు అవసరం. అలాంటి గొప్ప గురువులలో ఒకరైన గురునానక్ జయంతి నేడు. గురునానక్ జయంతి సిక్కులకి అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి.  సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతినీ  ఒక పండుగలా జరుపుకుంటారు.  సిక్కులకే కాకుండా గురునానక్ బోధనలు  ప్రజలందరికీ, మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విలువలు నేర్పిస్థాయి. ఈ రోజును గురు పురబ్, గురునానక్ ప్రకాశ్ ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగుతుంది. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతి జరుపుకుంటున్నారు. గురునానక్ 1469 లో తల్వండిలో జన్మించి, చిన్న వయస్సులోనే  ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి కనబర్చారు. ఇతరులకి సాయం చేయాలనీ ఆయనకు ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఆధిపత్యం వహించిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతం ముందడుగు వేసింది. గురునానక్ స్థాపించిన సిక్కిజం, వినయాన్ని, సేవను, దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించే దిశగా సాగింది.  గురునానక్ జయంతి ప్రాముఖ్యత .. గురునానక్ జయంతి అంటే కేవలం గురునానక్ కు నివాళి కాదు, అది ఆయన బోధనలకు ఇచ్చే గౌరవం. ఇది విశ్వ సోదరభావం, కరుణ,  సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. సిక్కులకు, గురునానక్ ప్రతిపాదించిన ఏకమతం, భక్తి సూత్రాలను గుర్తు చేస్తుంది. "ఇక్ ఓంకార్" అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఆయన సందేశం.  సిక్కిజానికి ఈ సందేశం కేంద్ర బిందువుగా ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఏకదైవవాద దేవుని ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు.  గురునానక్ జయంతి ఎలా జరుపుకుంటారు? గురునానక్ జయంతిని భారతదేశంలోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  సిక్కు ప్రజలందరూ గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ‘అఖండ్ పాఠ్’, అంటే గురు గ్రంథ్ సాహిబ్  నిరంతర 48గంటల పఠనం గురుద్వారలో ప్రారంభమవుతుంది. భక్తులు తెల్లవారుజామున ప్రార్థనలు, ‘నగర కీర్తన’  అని పిలువబడే ఊరేగింపులో పాల్గొంటారు, ఇందులో గురుగ్రంథ్ సాహిబ్‌ని ఒక పల్లకిలో ఉంచి వీధుల్లో తీసుకువెళతారు. ఊరేగింపు సమయంలో కీర్తనలు, సిక్కు యోధులు నిర్వహించే ‘గత్కా’  అనే యోధకళా ప్రదర్శనలు ఉంటాయి. ‘లంగర్’, అంటే ఉచిత సామూహిక భోజనం.  ఈ వేడుకలో ఇదే ప్రధాన భాగం. మతం, కులం లేదా లింగం ఇలా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే లంగర్, గురునానక్ విలువలైన  సమానత్వం, సేవా గుణాలను  ప్రతిబింబిస్తుంది.  గురు నానక్ బోధనలు.. గురునానక్ బోధనలు సులభంగ ఉంటూనే లోతైన అర్థం కలిసి ఉంటాయి.  అన్ని విశ్వాసాల ప్రజలకు సంబంధించినవి. ఆయన బోధనలలో ప్రధానంగా మూడు సూత్రాలు ఉన్నాయి:   దేవుని పేరును జపించడం  ‘నిజాయితీగా సంపాదించడం ఉన్నది ఇతరులకు కొంత పంచడం.  ఇలా..  వినయము, నిజాయితీ,  దయతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. ప్రజలంతా  దేవుని దృష్టిలో సమానమని, కులం వ్యవస్థ, లింగ వివక్ష వంటివాటిని తిరస్కరించారు.  గురునానక్ బోధనలు  ప్రుజలలో  దయ, సేవాభావం కలిగి ఉండాలని, దేవుని పట్ల భక్తితో జీవితం గడపాలని మార్గనిర్దేశం చేస్తాయి. గురునానక్ జయంతి మనకు సహనం, దానం, గౌరవించటం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతుంది.                                      *రూపశ్రీ   
  ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఎక్కువ శాతం నీరు,  ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.  ముఖ్యంగా మొలలు, మలబద్దకం.  మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు.  అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట.  ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే.. ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి  చాలా పోషకాలు అందిస్తాయి.  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు. ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.  ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది.  ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకం, అజీర్ణం,  ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి.  సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి.  రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి.  అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి.  శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి.  కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం.  ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది.  సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది.  ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు.  ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు.                                           *రూపశ్రీ.
సొంపు లేదా సోపు చాలా మందికి తెలిసిన పదార్థమే. ఇవి జీలకర్రను పోలిన గింజలు. తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం తరువాత వీటిని ఇస్తుంటారు. భారీ భోజనం తరువాత సొంపు తింటే ఆహారం బాగా జీర్ణమై కడుపు బరువు తగ్గుతుందని అంటారు. పైగా ఇది గొప్ప మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది భోజనం తరువాత సొంపు తింటారు. చాలామందికి సొంపు గింజలను ఇలా తినడమే తెలుసు. కానీ సొంపు గింజలను కాకుండా సొంపు గింజల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. జీర్ణక్రియ.. సొంపు గింజల నీరు  తీసుకోవడం వల్ల  జీర్ణక్రియను  మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  గ్యాస్, అసిడిటీ,  అజీర్ణాన్ని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు  తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడంలో సొంపు నీరు బాగా పనిచేస్తాయి. సొంపు గింజలలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇక సొంపు నీటిలో సమ్మేళనాలు శరీరంలో ఉండే కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది.  పరగడుపునే సొంపు నీరు తాగడం చాలామంచిది. యాంటీ ఆక్సిడెంట్లు.. సొంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కాణాలను కాపాడటంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా కనిపించడంలోనూ, అనేకరకాల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది.. సొంపులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సొంపు నీటిని తాగుతూ ఉంటే శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్దిని అడ్డుకుంటుంది.  క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.                                                 *నిశ్శబ్ద.