సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుద్ధ వనoలో ధమ్మ  విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద   పుష్పాంజలి ఘటించారు. అనంతరం నాగార్జునసాగర్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం లో సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధమ్మాని స్వీకరించిన రోజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు అయిన అక్టోబర్ 14 సోమవారం నాడు నిర్వహించిన ధమ్మ విజయం వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వార్థం మితిమీరి అత్యాశ తారా స్థాయికి చేరి అతలాకుతులమైన ప్రస్తుత సమాజంలో బుద్ధుని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే లేదన్నారు. అనంతరం శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి మాట్లాడుతూ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో విలసిల్లిన బౌద్ధాన్ని ప్రస్తావిస్తూ బుద్ధ వనం రాబోయే రోజులలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని  హంగులతో సిద్ధమైన బుద్ధవనం రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందనున్నట్లుగా తెలిపారు. మోక్షానందా బుద్ధ విహార అధ్యక్షులు ధర్మ రక్షిత బౌద్ధ దమ్మ విజయాల గురించి వివరించగా, లతా రాజా ఫౌండేషన్ సలహాదారులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దమ్మ దీక్ష తీసుకున్న నేపథ్యం గురించి వివరించారు. అటుపిమ్మట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బుద్ధ వనం ప్రత్యేక పర్యాటక స్థావరం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు బుద్ధ వనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి   మాట్లాడుతూ ధమ్మ విజయం, ధమ్మ దీక్షోత్సవాలు పర్యాటక ప్రాధాన్యత కలిగి ఈ తరానికి బౌద్ధం పట్ల అవగాహన కల్పించడానికి తోడ్పడతాయన్నారు. బుద్ధ వనం లోని ధమ్మ విజయం వేడుకలలో ఒగ్గు నృత్య కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు  సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్య ప్రకాష్ రావు, శ్యామ్ సుందర్ రావు ,మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పే లోని మహా బోధి విహార నుండి బద్ద భిక్షువులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్ మరియు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కంది) 60 మంది దక్షిణ దేశాల విద్యార్థులు, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు
పరిశ్రమల స్థాపనకు భారత్ లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్ లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫోరమ్ చైర్మన్, జెసి2 వెంచర్స్ వ్యవస్థాపకుడు జాన్ ఛాంబర్స్ అధ్యక్షత వహించారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విరాట్ భాటియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక,సామాజిక అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేష్ మాట్లాడుతూ...  ‘‘వేగవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించాం. ప్రైవేటు సెక్టారు ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటుచేశాం. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అనుమతులు  ఇచ్చే విధానాన్ని అమలుచేస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతివారం ఇన్వెస్టర్స్ కు అప్ డేట్ చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా తొలివిడతలో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా హౌస్ హోల్డ్ డాటా, ఎడ్యుకేషన్ డేటా మైక్రో లెవల్ లో సేకరిస్తున్నాం. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల సాధించాలన్న మా లక్ష్యానికి స్కిల్ సెన్సస్ దోహదపడుతుంది. ప్రధాని మోడీ వికసిత్ భారత్ స్పూర్తితో 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. లాంగెస్ట్ కోస్ట్ లైన్ మాకు ఉంది. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవడం మా లక్ష్యం. ఎపిలో వేగవంతమైన పారిశ్రామికాభివృద్దికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నాం. ఐటి రంగంలో తెలుగు ప్రజల పాత్ర కీలకం. గతంలో చంద్రబాబుగారు పెద్దఎత్తున ఇంజనీరింగ్ కాలేజిలను ఏర్పాటుచేసి ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించారు. ఆయన కృషి కారణంగా వై2కె బూమ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఐటి అభివృద్ధి చెందింది. మాకు మంచి మ్యాన్ పవర్ ఉంది. విశాఖ నగరాన్ని ఐటి, కెమికల్, ఫార్మా, మెడికల్ డివైస్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఎపిలో పరిశ్రమలస్థాపనకు అవసరమైన ఎకోసిస్టమ్ కల్పిస్తున్నాం. అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధికి ఫోకస్ పాయింట్లను నిర్దేశించాం. రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజ్, పెట్రో కెమికల్, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తాం. 2029నాటికి 72 గిగావాట్స్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.   నేడు వేగంగా మారుతున్న అధునాతన సాంకేతిక ప్రక్రియలో స్టార్టప్ అంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చే ఓ అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అంకురాల ద్వారా సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. గతనెలల్లో ఎపిలో సంభవించిన  వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం ఓ నూతన అధ్యాయంగా అభివర్ణించారు. సెప్టెంబర్ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.  సహాయక చర్యల కోసం తొలిసారిగా మా ప్రభుత్వం డ్రోన్‌ల వినియోగాన్ని ప్రారంభించింది. విజయవాడలో 40 కిలోల వరకు మోసుకెళ్లగల డ్రోన్‌లను వినియోగించాం. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.  వరద నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లపై శాఖల నుంచి వచ్చే ఫిర్యాదులు ఆధారంగా  రియల్ టైమ్ పరిష్కారాల కోసం అంకురాలను ఆహ్వానించామని లోకేష్ తెలిపారు. రికార్డ్ సమయంలో సమస్యలు పరిష్కారానికి స్టార్టప్ ఎకోసిస్టమ్ శక్తి తమకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. విశాఖకు చెందిన స్టార్టప్ ఫ్లూయంట్ గ్రిడ్ ద్వారా అభివృద్ధి చేసిన యాక్టిలిజెన్స్ అనే ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ సహాయక బృందాలు త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడింది. బాధితులకు బిస్కెట్లు, మ్యాగీ వంటి ఆహార సామగ్రిని అందించడానికి వీలు కల్పించే ఆన్‌లైన్ వ్యవస్థ దీని ద్వారా ఏర్పాటైంది. RINT_SS అనే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ కేవలం 2 రోజుల్లోనే  ఫ్లడ్ ఎన్యూమరేషన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహాయం చేసింది. దీనిద్వారా బాధితుల గణన త్వరగా చేయటం,  కేవలం 15రోజుల్లో పరిహారం బదిలీ చేయడానికి వీలు కల్పించింది. Sat_sure , జియోస్పేషియల్ డేటా అనలిటిక్స్ కంపెనీ వరద ప్రభావిత జోన్‌లలో వరద తీవ్రతను లెక్కించడానికి ఉపయోగపడింది. QoptarsL అనే అంకురసంస్థ డేటాను సేకరించేందుకు, కెమెరాలతో డ్రోన్‌లను మోహరించేందుకు సహాయం అందించింది. దోమలు, అంటు వ్యాధుల వ్యాప్తి జరగకుండా నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు అనలిటిక్స్ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ దోహదపడింది’’ అన్నారు. ‘‘ఈ ఏడాది జూన్ లో చంద్రబాబునాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ట్రిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సాధించిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా  ఆంధ్రప్రదేశ్ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, రాష్ట్రాన్ని ప్రగతిశీల సంస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో 10 కీలకమైన రంగాలను ప్రభుత్వం గుర్తించింది. పట్టణ, గ్రామీణ అవసరాలను పరిష్కరిస్తూ వివిధ రంగాల్లో సమగ్ర పురోగతి సాధించడానికి కృషిచేస్తున్నాం. అమరావతి అభివృద్ధి, నదుల అనుసంధానం, మెరుగైన నీటి నిర్వహణ, ప్రజలు-పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారించాం. మా ప్రభుత్వం పరిశ్రమలు, టూరిజం, సేవా రంగాలను ప్రోత్సహిస్తోంది, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తోంది.  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, పునరుత్పాదక శక్తి, టెలికమ్యూనికేషన్స్, రసాయన తయారీ సబ్‌సెక్టార్లలో ప్రాధాన్యతలతో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం.  ఉద్యోగ సృష్టి లక్ష్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ప్రైవేటు రంగం నుంచే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.  అమరావతిని వరల్డ్ క్లాస్ ఎఐ రాజధానిగా తీర్చిదిద్దబోతున్నాం. ఫేజ్ -1 లో 100 రకాల ప్రభుత్వ సేవలను ఫోన్ ద్వారా అందించబోతున్నాం. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం ద్వారా మెరుగైన సేవలందిస్తాం. డిజిటల్ విధానంలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. గతంలో చంద్రబాబునాయుడు సైబరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలిపారు.  అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రైతుల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ సిటీగా తయారుచేసేందుకే ప్రణాళికలు సిద్ధంచేశాం. ఎస్ఆర్ఎం, విఐటి వంటి సంస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎపి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 92శాతం స్ట్రయిక్ రేటుతో 175కు 164 స్థానాల్లో విజయం సాధించాం. ఇందులో 88 మంది ఎమ్మెల్యేలు, 17మంది మంత్రులు కొత్తవారు ఉన్నారు. ఎపి ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని లోకేష్ అన్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా మృత దేహం రీసెర్చి పర్పస్ గాంధీ హాస్పిటల్ కు అప్పగించారు. గత శనివారం చనిపోయిన సాయిబాబా  మృత దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం మౌలాలిలోని నివాసంలో  ఉంచారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని గాంధీకి  ఇచ్చేశారు.  మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. నేరం రుజువు కానప్పటికీ  జైలులో  కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సాయిబాబా. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడటంతో అంతర్గత రక్త స్రావమై  సాయిబాబా  చనిపోయారు.   ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంకు చెందిన సాయిబాబా తెలంగాణ ఉద్యమం, ఆదివాసుల హక్కుల కోసం శ్రమించారు.   1967లో జన్మించిన సాయిబాబాకు  పోలియో సోకి చిన్న వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సాయిబాబా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది.  సాయిబాబా రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు అప్పగించిన కుటుంబసభ్యులు వైద్య విద్యార్థుల రీసెర్చిపర్పస్ గాంధీ హాస్పటల్ కు అప్పగించారు. 
ALSO ON TELUGUONE N E W S
2025 సంక్రాంతికి 'NBK 109'తో నందమూరి బాలకృష్ణ, 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సమరానికి సై అంటూ సడెన్ గా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ చెప్పారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించడం కంటెంట్ మీద నమ్మకమా? లేక ప్రమోషనల్ స్టంట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.    
Suriya is on a roll with back-to-back big projects. He is now gearing up to join hands with Dream Warrior Pictures for his next big budget action adventure. The #Suriya45 will be directed by actor-director RJ Balaji. He directed films like Mookuthi Amman and Veetla Vishesham films, before.  The production house, Dream Warrior Pictures has been pioneers in making films that satisfy everyone universally. Their films like Khaithi, Khakhi/ Theeran Adhigaram Ondru, Oke Oka Jeevitham have received universal acclaim from Telugu and Tamil people alike.  Now, they have joined hands with Suriya to bring a massive action adventure, which is their most expensive film yet. On top of it all, Oscar award winning composer AR Rahman will compose music for the film. Suriya and AR Rahman combination has given some memorable film and this one is expected to be another massive addition to their elite list.  The film has started officially with Pooja ceremony. The makers have promised a stellar cast to be part of the project and the regular shoot will commence from November. Film is scheduled for release in second half of 2025. 
కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం 'క'(ka).1970 వ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా పాన్ ఇండియా లెవల్లో ఈ నెల 31 న విడుదల కాబోతుంది.ఆల్రెడీ  ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ తో ప్రేక్షకుల్లో కూడా 'క' పై భారీ అంచనాలు ఉన్నాయి.  తాజాగా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతుండగా హీరో కిరణ్ అబ్బవరం పలు ఆసక్తి కర విషయాలని వెల్లడి చేసాడు. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అనుకున్నాం. కానీ తమిళనాడు లో ముప్పై ఒకటిన విడుదల అవ్వడం లేదు. ఎందుకంటే తమిళనాడు లో వాళ్ళ హీరోల సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ ఉన్నాయి. థియేటర్స్ దొరకడం కష్టమని, కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేద్దామని 'క' తమిళనాడు హక్కులని కొన్న వాళ్ళు చెప్పారని విషయాన్నీ వెల్లడి చేసాడు.   కిరణ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మన తెలుగు నాట సంక్రాంతితో పాటు చాలా ఫెస్టివల్స్ అప్పుడు మన హీరోల సినిమాలు ఉన్నా కూడా తమిళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటిది మన హీరోకి తమిళనాట ఎందుకు థియేటర్స్ ఇవ్వరని పలువురు సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.
Matka is garnering buzz post the teaser release. The riveting teaser has presented Varun Tej in different looks and it became a viral hit. Now, the makers continuing with the promotions, unveiled a sensuous club song as their first single.  Nora Fatehi, the Bollywood actress and dancing queen, will be seen sizzling on screen for this song. Her dance moves and expressions are top notch and seductive as per the song lyrics. The song is going to be a highlight for the movie, we can say so.  The song tune is composed keeping retro theme in mind and it is highly addictive. The song brings back the memories of popular club songs like "Nee Illu Bangaram Kaanu", "O Apparao Oo Subbarao" and this is going to be as popular as them.  Neeti Mohan has sung the song while GV Prakash Kumar composed the tune. Lyricist Bhaskarabhatla wrote lyrics and the song seems to a tribute to popular culb songs from the makers of Matka. SRT Entertainments and Vyra Entertainments are producing this movie on a lavish scale. 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హోదాలో ప్రభుత్వానికి చెందిన పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తు చాలా బిజీగా ఉన్నాడు.రీసెంట్ గా విజయవాడకి దగ్గర్లో ఉన్న కంకిపాడు లో పలు రకాల సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం,బిజెపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అదే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పవన్ ప్రసంగిస్తున్నంత సేపు పెద్దఎత్తున ఓజీ ఓజీ అని అరవడంతో పవన్  కాసేపు సినిమాల గురించి మాట్లాడాడు.మీరు ఓజీ,ఓజీ అని అరుస్తూ ఉంటే నాకు మోడీ మోడీ అని వినిపిస్తుంటుంది. మీరు మీ అభిమాన హీరో సినిమాకి వెళ్లి జై కొట్టాలంటే రోడ్ లు బాగుండటంతో పాటు చేతి నిండా డబ్బులు ఉండాలి. అందుకు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చాలా బాగుండాలి. కాబట్టి ఆర్ధిక వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత విందు వినోదాలు చేద్దాం సినిమా ఇండస్ట్రీ లో  ఏ హీరోతో నాకు ఇబ్బంది ఉండదు.నేను ఎవరితోనూ పోటీ పడను. ఒక్కో హీరో ఒక్కో దాంట్లో నిష్ణాతులు.చిరంజీవి(chiranjeevi)బాలకృష్ణ(balakrishna)మహేష్ బాబు(mahesh babu)ఎన్టీఆర్(ntr)అల్లు అర్జున్(allu arjun)రామ్ చరణ్(ram charan)నాని(nani)ఇలా ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. వీళ్ళందరు బాగుండాలని కోరుకునేవాడినని చెప్పుకొచ్చాడు.  
Vishwambhara, the high budget movie starring Megastar Chiranjeevi, Trisha Krishnan, Ashika Ranganath, is gearing up for huge release Summer next year. The movie team were preparing to release the film by Sankranthi 2025 but Ram Charan's Game Changer team requested Chiranjeevi and now, Vishwambhara would release in Summer.  The makers wanted to start promotions from Dasara till Sankranthi creating constant buzz. But the last moment decision had them shocked but they continued with the release of teaser, as earlier planned. They can take this as a blessing in disguise. Because the early reactions to teaser have been highly mixed.  While some fans of Chiranjeevi are happy with his looks and Jagadeeka Veerudu Athiloka Sundari style story, most are unhappy with visuals. Director Vassishta seems to have openly taken inspiration from recent Hollywood biggies. There are threads with images being compared all over social media.  Visual quality too is not at the same level as anticipated. While MM Keeravaani's BGM score is praised, the film that's planned to be a visual wonder seems to have failed to give that "awe" feeling with this teaser. Same problem persisted with Prabhas's Adipurush. The makers had to postpone for six months but their output did not change much as writing had many loopholes.  Vishwambhara team can go back to drawing board to correct some over-colorful visuals and work on matte painting better. Even some visuals look a bit too inspired from Marvel films and while they cannot change it entirely, they can try different color templates with highlights being less saturated.  Many visuals seem to have been asked to present at over saturated colors without shadows and realistic looking color grading, skin texturing. They can take this time to change that and improve on every detail that is missing from the visuals released in the teaser for Trailer.  Recently, Vijay's The Greatest of All Time makers changed de-ageing output of the actor after fan backlash. There is enough time for Megastar's film and let's hope the makers will look at all the feedback in a positive manner and make it better. 
Upendra has a unique way of narrating his stories and he is one of the most famous director-actors in Indian Cinema. He started off as a writer, proved himself as a different director with films like A, Upendra, Om and so on. He turned into an actor and then stopped frquently directing movies.  Now, he is back to direction seat with his upcoming UI. With the teaser, first single, Upendra once again proved his uniqueness in making a film and even promoting it. The most eagerly awaited film release date is finally announced by the makers.  The movie will be releasing on 20th December, 2024. The makers seem to have waited for Ram Charan's Game Changer team to confirm their release for Christmas or Sankranthi. As Game Changer has been officially postponed, the makers of UI have decided to grab it.  The makers have challenged viewers with this tagline, “ALL THESE DAYS, YOU WATCHED MOVIES AND DECIDED WHETHER THEY WERE A HIT OR FLOP. THIS MOVIE WILL WATCH YOU AND ……” Ajaneesh Loknath is composing music for the film and it is set to release in 9 languages worldwide. 
మెగాబ్రదర్ నాగబాబు(naga babu)గురించిప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.నటుడుగా,నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు చేసి ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో క్రియా శీలక పాత్ర పోషిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా నా డైరీలో ఒక పేజీ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న నాగబాబు రీసెంట్ గా అందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh bachchan)గురించి ప్రేక్షకులతో కొన్ని విషయాలని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ గారు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీగా జరగలేదు.అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు.అమితాబ్,రాజీవ్ గాంధీ మొదటి నుంచి ఫ్యామిలీఫ్రెండ్స్ కావడం వలన అమితాబ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే వారు. ఒకసారి ఇందిరా గాంధీ గారితో రికమండేషన్ లెటర్ ఇవ్వమని అమితాబ్ అడిగితే  ఈ అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి. బాగా యాక్ట్ చేస్తాడు ఒకసారి ట్రై చెయ్యండని ఇందిరాగాంధీ లెటర్ రాసి ఇచ్చేవారు.అయినా కూడా అమితాబ్ కి అవకాశాలు వచ్చేవి కాదు. పైగా అమితాబ్ గారు సాధారణ వ్యకి కొడుకు వ్యక్తి  కాదు.ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్(harivansh rai bachchan)హిందీ సాహిత్య రంగంలో అద్భుతమైన పేరు ఉన్న వ్యక్తి. మన తెలుగు నాట  విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీ ఎంత పెద్ద కవుల్లో హరివంశ రాయ్ బచ్చన్ కూడా అంత పెద్ద కవి. ఇక అన్నయ్య చిరంజీవి దగ్గరనుంచి మా ఇంటిల్లిపాది మొత్తం అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్(pawan kalyan)కి అయితే చాలా విపరీతమైన అభిమానం. ఒక్కోసారి పవన్ ని ఏడిపించడానికి  అమితాబ్ బచ్చన్ గారిని సరదాగా విమరించేవాళ్ళం. దాంతో  విపరీతమైన కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువుని విసిరేసేవాడని చెప్పుకొచ్చాడు.    
తనదైన కెమెరా పనితనంతో ఎన్నో సినిమాల ఘన విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు... "మాయాలోకం" పేరుతో రూపొందిన "ర్యాప్ వీడియో ఆల్బమ్" విడుదల చేయనున్నారు. ఈ ఆల్బమ్ కు యువ ప్రతిభాశాలి రాకి.. లిరిక్స్ అండ్ ర్యాప్ సమకూర్చగా జె.హెచ్.ఎల్.టి నిర్మించారు. "మాయాలోకం" ర్యాప్ వీడియో ఆల్బమ్ ను లాంచ్ చేసేందుకు అంగీకరించిన చోటా. కె.నాయుడుకు ఆల్బమ్ రూపకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.  "స్వాతి - విజ్జు ముదిరాజ్"ల కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ వీడియో ఆల్బమ్ కు అసిస్టెంట్ కెమెరామెన్: మాదాసు డేనియల్, హెయిర్ అండ్ మేకప్: బగ్స్ బన్నీ, కాస్ట్యూమ్స్: రాకి, పోస్టర్స్: మధుకర్ పడాల, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ,  మ్యూజిక్ - మిక్సింగ్ & మాస్టరింగ్: ప్రశాంత్ మ్యూజికల్, డి.వొ. పి: ఫల్గుణ బెజవాడ, ఎడిటింగ్ & డి.ఐ: శశి కుమార్ చిట్లూరి, లిరిక్స్ & ర్యాప్: రాకి, నిర్మాణం: డి.హెచ్.ఎల్.టి., కాన్సెప్ట్: స్వాతి - విజ్జు ముదిరాజ్.  
Cinephiles or lovers of cinema, who always take cinema seriously, have been talking about the diminishing returns in terms of content for the money, efforts they put in to watch, love, analyse and decode movies. Their major problem with the current trend in cinema business is the overpricing of the tickets. They believe it is killing the business step-by-step and only big films can survive theatrically, killing any sort of chance for medium and small budget films to give a lasting theatrical experience.  The concern raises from the recent success percentage and failure of many films that aim for business more than the craft. In 1980's and 90's, when the commercialisation of filmmaking took its peak, the major concern had been similar stories being told back to back with same and different heroes in same mould. The arrival of "commercial formula" into movies for survival and sustenance of business started hurting development of overall filmmaking craft. In 90's, with arrival of Ram Gopal Varma, Mani Ratnam things did change but then the "formula" took over with several blockbusters re-packaging things in new style.  There is no wrong in turning something into a good business model but filmmaking sustains as a business with uniqueness at the core. Not all brains thinks alike and similarly, not every person's financial status remains same. In a successful business model, that too, when it is dependent on mass cosumption, one cannot eliminate or alienate good chunk of film watching enthusiasts with overpricing.  So, what price is perfect?  In recent interview, Producer Naga Vamsi of Sithara Entertainments, made some interesting comments. He said, "With Rs.250/- ticket rate, a family of four can watch a film and buy popcorn for Rs.500 and spend Rs.1500 to watch a film." He remarked it as "cheapest form of entertainment" as every other can cost more money. While, it is right from his POV, as every film costs crores in production, similarly the consumer, that is ticket purchaser, has all the rights to decide what is acceptable price for them to spend.  If a producer wants to recover their money as fast as they can, it is their right to decide. Similarly, it is a viewer's discretion, on how much they can spend on what film, too. An universal ticket rate doesn't prevail now-a-days. And it is important to understand that increase in ticket prices for first week or weekend or even for first day, will also kill the enthusiasm for a movie-lover to watch the film, immediately. Which would directly affect box office returns. If the solution for this problem is increasing price even further on the first day, then it would affect the business in long term killing any enthusiasm that any viewer would show ever.  Filmmaking is a mass consumer business and not aimed for short term gains ever. So, it would be better for producers to rationalise and think about either introduce flexible pricing even for big films after first weekend or first week or second weekend would be a welcome change. If a film like KGF Chapter 2 or Baahubali 2 can reduce prices during weekdays and have higher rates during weekends, that too, with respect to screen size and facilities available at a theatre, then the returns would mutliple.  A film like Devara will bring in more crowds during weekdays with lower prices while weekends it can play at slightly increased rates. For small budget films and medium budget films, the rates should be lesser so that the sustainable long run for these films is not killed by OTT release. If theatrical business needs to sustain, then a flexible ticketing system or at least a viable universal ticket pricing should be introduced. Maybe it is better to go the flexible rates way, as that would become an attraction for family audiences to give sustainable long run of 4-5 weeks with weekdays also performing well.  This would help theatres to stay in business as the increasing trend of footfall drops from first Monday, itself is killing the theatres. It would be difficult for audiences to think about theatrical visits if theatres cease to exist. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి ఎలా ఉండాలి?? అతడి ధర్మం ఎలా ఉండాలి?? అతడు ఎలా నడుచుకోవాలి?? అనే విషయం గురించి ఓ ఉదాహరణా కథనం ఉంది.  పూర్వం జపాన్లో కైచూ అనే గొప్ప జెన్ మాస్టర్ క్యోటో ప్రాంతంలో ఒక ఆలయానికి అధిపతిగా ఉంటుండేవాడు. ఒకసారి క్యోటో గవర్నర్ ఆ ఆలయానికి మొదటిసారి వచ్చాడు. జెన్ మాస్టర్ సహాయకుడు, గవర్నర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకెళ్ళి మాస్టర్కు ఇచ్చాడు. ఆ కార్డు మీద "కిటగానీ, క్యోటో గవర్నర్" అని ఉంది. "నాకు ఇతగాడితో ఏమీ పనిలేదు. వెళ్లిపొమ్మను” అన్నాడు కైచూ. సహాయకుడు గవర్నర్ వద్దకు వచ్చి 'మన్నించండి' అంటూ జరిగిన విషయం చెప్పాడు.  “పొరపాటు నాదే సుమా” అంటూ గవర్నర్ కలం చేత బుచ్చుకొని, తన పేరు మాత్రమే ఆ కార్డు మీద ఉంచి, 'క్యోటో గవర్నర్' అనే పదాలు కొట్టేసి కార్డును సహాయకుడి చేతుల్లో పెడుతూ “మళ్ళీ ఒకసారి మీ మాస్టర్ వద్దకు వెళ్ళి అడిగిచూడు” అన్నాడు. అది చూసిన జెన్ మాస్టర్ "ఓహో! వచ్చింది కిటగానీయా? అయితే అతణ్ణి నేను చూడాలనే అనుకుంటున్నాను రమ్మను” అన్నాడు ఈసారి.  మనిషి తన హోదాతో ఒకటైపోతాడు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ ఇతడు జీవితంలో ఏమవుతాడో అనే చింత తల్లిదండ్రులకు దాదాపు ఆనాటినుంచే ప్రారంభం అవుతుంది. జాతకచక్రం వేయించి చూస్తారు. గొప్ప కంప్యూటర్ ఇంజనీరో, లేక ఏదో పెద్ద సంస్థకు అధిపతిగా ఉంటాడనో, గొప్ప డాక్టరో, సైంటిస్టో అవుతాడని చెప్పించుకొని సంతోషపడతారు. పిల్లవాడు చేతులు, కాళ్ళు ఆడించి కాస్త పాకే సమయానికల్లా అతడి ముందు ఒక కలమూ, కాస్త ఎడంగా ఒక ఉంగరమూ, అలాంటివే మరేవో అక్కడ పెట్టి ఏది పట్టుకుంటాడో అని వేచి చూస్తుంటారు. అంటే సరస్వతీదేవికి అంకితమవుతాడా లేక లక్ష్మీకటాక్షం అనుభవించనున్నాడా అనే విషయం కనుగొంటారన్నమాట. అయినా కాకపోయినా అప్పటికి అదే పెద్ద సంతృప్తి. ఏవో బంగారు కలలు కంటూ కాలం గడుపుతుంటారు.  కానీ ఆకాశమంత అవకాశంతో పుట్టిన ఆ శిశువు ఈ కాస్తతోనే సంతృప్తి పడాలా? గొప్ప ఇంజనీర్ కావడంతో అతడి జన్మ సఫలీకృతమైనట్లేనా? ఫలానా కీర్తిగడించిన ఇంజనీర్ మావాడే, నాకొడుకే, మామేనల్లుడే, మాఊరి వాడేనండోయ్ అని చెప్పుకోడానికేనా? జీవితం అంత పరిమితమైనదా? ఈ జీవితానికి అంతకన్నా విస్తృత అవకాశాలు లేవా? సాక్షాత్తూ జీవితాన్నే దర్శించి అంబరమంత ఎత్తు ఎదిగిన మహనీయులు, అంత ఎలా సాధించారు? వారు కూడా ఈ కాస్తతోనే సరిపెట్టుకొని ఉంటే, ఇంతటితోనే సంతృప్తి చెంది ఉంటే, మనిషిగా ఎదిగి ఉండేవారా?  మరి పిల్లవాడు అలా ఎదగడానికి మనం దోహదం చేసే బదులు, ఇంజనీర్ అవమనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు అతడి జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకీ స్వయంగా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా?  జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. ఒకప్పుడు రాముడనే దేవుడు, కృష్ణుడనే దేవుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ  ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం ఈ పిల్లజీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా  అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో?  'అందరూ అంతంతటి వారెలా అవుతారు?' అనే వేళాకోళం అటువుంచి, అరుణాచల రమణుడూ,  జిడ్డు కృష్ణమూర్తి, అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? వారిని గురించి కూడా తల్లిదండ్రులు అలానే అనుకొని ఉండవచ్చు కదా? “వెర్రి వేషాలు వేయకు. కుదురుగా చదువుకొని పెద్ద ఆఫీసరన్నా అవు, లేదా నీ కర్మ అదేనైతే, ఎక్కడో గుమాస్తాగా నీ బతుకు ఈడ్చెయ్" అని వారి రెక్కలు కత్తిరించేసినట్లయితే ఏమయ్యేది? అందువల్ల పిల్లవాణ్ణి సాధారణ చదువులు చదివిస్తూ, వాటిలో ప్రావీణ్యత గడిస్తూ ఉన్న సమయంలో కూడా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. . ఎత్తుకున్నప్పటినుంచి మీ అభిప్రాయాలను గురించి మీరు స్వయంగా ఎరగని మతసిద్ధాంతాలతో అతణ్ణి 'కండీషన్' చేయకూడదు. అతడు కోరుకున్న వృత్తిని స్వీకరించనివ్వాలి. అతడి భవిష్యత్తును మీ అభిమతానుసారంగా మలచడానికి ప్రయత్నించకూడదు. తాను ప్రేమించని వృత్తిని చేపట్టిన సదరు పిల్లవాడు ఆ వృత్తిలో ధనం ఎంతైనా సంపాదించ వచ్చు. తల్లిదండ్రుల్ని తూగుటుయ్యాలలో ఊగించవచ్చు. కానీ అతడికి మాత్రం సంతోషముండదు. అలా దిగులుగా తిరుగుతూనే ఉంటాడు.అంటే ఇష్టం లేని పనిలో డబ్బు వస్తుందేమో కానీ తృప్తి మాత్రం రాదు.                                  ◆నిశ్శబ్ద.
జీవితంలో మనిషికి ఎన్నెన్నో అలవాట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని ఉపయోగకరమైతే మరికొన్ని పతనానికి దారితీస్తాయి. ఈ అలవాట్లకి కారణం అతని మానసిక ఆలోచనా ధోరణే తెలివైనవాడు తన ఆలోచనా ధోరణిని నియంత్రిస్తే, మూర్ఖుడు ఆలోచనల చేత నియంత్రింపబడతాడు. తెలివైనవాడు ముందు తను ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నిర్ణయించుకుంటాడు. బాహ్య విషయాలు అతని ఆలోచనా ధోరణిని భంగపరచకుండా జాగ్రత్త వహిస్తాడు. కానీ తెలివి తక్కువవాడు అలా కాదు. అస్థిరమైన ఆలోచనలతో ఇతర విషయాల ప్రభావంతో తన నిర్ణయాలను క్షణం క్షణం మార్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తాడు. ఆలోచనా రాహిత్యం మనిషిని ఉన్మత్తుడ్ని చేస్తుంది. మనిషి వైఫల్యానికి ప్రధాన కారణం అతని అశ్రద్ధతో కూడిన ఆలోచనా ధోరణులే సరైన, నిజమైన ఆలోచన గల మానసిక ప్రవృత్తి మాత్రమే మనిషి తప్పుడు జీవితాన్ని సరిచేయగలదు. సరైన, నిర్దుష్టమైన నడవడిక మాత్రమే మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించి, సఫలీకృతుడ్ని చేయగలదు. ఆలోచనలని నియంత్రించాలంటే ముందు మనలో గజిబిజిగా కలిగే ఆలోచనలను క్రమబద్దం చేయాలి. తార్కికతను అలవర్చుకోవాలి. ఒకదానికి మరోదానికి మధ్యన సారూప్యత, సామరస్యత ఉండాలి. పొంతన లేనట్లుండే అనంతమైన ఆలోచనా పరంపరల్ని ఓ క్రియాశీలకమైన రూపంలోకి మరల్చుకోవాలి. మన ఆచనలు మన నియమాలకు గానీ లేదా మన ధోరణికి గానీ విరుద్దంగా వుండకూడదు. మనం ఇతరుల మీద చూపించే జాలిగానీ, దయగానీ, క్షమగుణం గాని మనల్ని ఇబ్బందుల్లో పడేయగూడదు. నీతితో కూడిన నియమాలకు నీతికర వాతావరణంలో కూడా కట్టుబడి వుండాలి. మనలో కలిగే ఆలోచనలలో, స్పందనలలో ఏవి నిజాలో, ఏవి అపోహలో తేల్చుకోవాలి. మనలోని విజ్ఞాన పరిధుల్ని కనుగొనాలి. మనకేం తెలుసో మనకి తెలియాలి. అలాగే, మనకేం తెలియదో కూడా మనకు తెలియాలి. ఏవి సత్యాలో, ఏవి అభిప్రాయాలో మనం గ్రహించాలి. చాలా మంది తమ నమ్మకాలని తమకు తెలిసిన జ్ఞానంగా భావిస్తారు, అది సమంజసం కాదు. తప్పుగా ఆలోచించే వాడి చేష్టలు కూడా దుర్మార్గంగా వుంటాయి. దానికి తగ్గట్టు సమస్యలు అవిశ్రాంతంగా వచ్చి పడుతుంటాయి. తనని ఇతరులు నాశనం చేస్తారని, మోసం చేస్తారని, తనకి కీడు తలపెడతారని ఊహిస్తుంటాడు. తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. ఫలితంగా తన దుర్మార్గపు అంచనాలకు తానే బలి అవుతాడు, ఆత్మ పరిశీలన లేకపోవడం చేత దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య తేడా గ్రహించలేడు. కాని సరైన పంథాలో ఆలోచించేవాడు అలాకాదు. తన గురించి గాని, తన వ్యక్తిగత శ్రద్ధ గురించిగాని ఆలోచించడు. తనపై ఇతరులు ప్రదర్శిస్తున్న ఈర్ష్యాద్వేషాలు అతనికి మానసిక అస్తిరతను కలిగించవు. అతనెప్పుడు “ఫలానావ్యక్తి నాకు కీడు తలపెట్టాడు" అని ఆలోచించడు. కేవలం తన దుశ్చేష్టలే తనని నాశనం చేస్తాయి తప్ప ఇతరుల చేష్టలు  తననేమి చేయలేవని గ్రహిస్తాడు. తన భవిష్యత్తు, తన ఎదుగుదల కేవలం తన చేతుల్లోనే వుందని గ్రహిస్తాడు. విషయాసక్తి, విషయావగాహన వుంటుంది. యదార్థాలని యదార్థాలుగా చూస్తాడు కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా కదిలిపోడు. అలాగే ఆనందవు సమయాలలో వివరీతంగా చలించడు జీవితపు ఆటుపోట్లకు తట్టుకునే మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రకృతినుంచీ, తన చుట్టూవున్న సమాజం నుంచీ నిరంతరమూ నేర్చుకుంటూనే వుంటాడు. మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు కానీ, దానికి తగ్గ సమయస్ఫూర్తి ధర్మచింతన లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముందు మనిషి తనని తాను జయించుకోగలిగిన నాడు ఆధర్మాన్ని జయించగలడు. కష్టాలు, బాధలు చిరాకులు ప్రతి మనిషికీ వుంటాయి. అయితే వాటిని ఓపికతో, ఓ నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యూహంతో ఛేదించ గలిగిననాడు మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది.                                  ◆నిశ్శబ్ద.
జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. అన్నీ సానుకూలంగా అమరిన భద్రమైన జీవితాలు చాలామందికి అసాధ్యం. అలాంటి వారి సమస్యల్లో 1ఏ ఒక్కటైనా మనం తీర్చే ప్రయత్నం చేసినప్పుడే మనకు అసలైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. కళాశాలలో చదువుకునే రోజుల్లో, తన తోటి విద్యార్థులకు ఫీజు డబ్బులు లేనప్పుడు స్వామి వివేకానంద తనే ముందుండి ఆ సమస్యను తీర్చేవారు. ఎదుటి వారి ఏ చిన్న కష్టాన్నైనా తనదిగానే భావించి తపించిపోయేవారు. మరొకరి కాలికి ముల్లు గుచ్చుకుంటే, తన కంటిలో గుచ్చుకున్నంత విలవిల్లాడిపోయేవారు. అందుకే ఆయన మహానుభావులయ్యారు. ఇప్పటికీ కొంతమంది యువతీ యువకులు తమ జీతంలో కొంత మిగుల్చుకొని, అనాథలకు, అభాగ్యులకు సహాయపడుతూ ఉంటారు. తమ సరదాలను కొన్నింటిని త్యాగం చేసుకొని, అవసరమైన చిన్నారులకు, ఆర్తులకు పంచుతూ ఉంటారు. వారు నిజంగా అభినందనీయులు, ధన్యులు! ఇలాంటి పునాదిరాళ్ళయిన యువతరంపైనే నవసమాజం నిర్మాణమవుతుంది. ఆధారం లేక అలమటించే వారికి ఏ కొంత చేయూతనిచ్చి, వారి ముఖాన చిరునవ్వులు చిందింపజేసినా అది మంచి మనస్సులకు చిరాయువు నిస్తుంది. అందుకే రాల్ఫ్ వాడో ఎమర్సన్ Make yourself necessary to somebody' అంటారు. మనకున్నదాన్ని ఒకరితో పంచుకోవడానికి, మనస్సు ముందు కాస్త గింజుకుంటుంది. అయినా ఇవ్వడంలోని ఆనందాన్ని మనస్సుకు అలవాటు చేయాలి. ఆనక అది పొందే ఉల్లాసాన్ని అనుభూతి చెందమనాలి.    ఊపిరున్నప్పుడే ఇచ్ఛగా నీవు ఇవ్వగలిగినంతా ఇచ్చేయ్. ఇవ్వలేనని పిడికిట్లో దాచుకొని కూర్చుంటే, మృత్యువు బలవంతంగా నీ మణికట్టు పట్టుకొని పిడికిలి విడిపించి మరీ ఇప్పించేస్తుంది అంటోంది దివ్య ఖురాన్, ఇలా బాధగా ఇవ్వడం కన్నా ఇష్టంతో ముందే నలుగురికి పంచి ఇవ్వడంలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది. ఒకరి నుంచి మనం ఏదైనా స్వీకరిస్తున్నప్పటి కన్నా, ఒకరికి మనం ఇస్తున్నప్పుడే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆనందం కలుగుతాయని.. ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఇవ్వకుండా, తామొక్కరే దాచుకొని తినే అలవాటు భవిష్యత్తులో ఒక రకమైన మానసిక వ్యాధికి కూడా దారితీస్తుందని వైద్యులు తమ పరిశీలనలో తేల్చారు. మన మనుగడలో విలువైన, చెప్పుకోదగ్గ సందర్భాలు, గుర్తుచేసుకొని గర్వపడే సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే, అవి కేవలం ఇతరులకు మనం సహాయపడ్డ క్షణాలే! భగవంతుడు కూడా పరిగణనలోకి తీసుకునేది ఆ మంచి పనుల్నే! అయితే మితిమీరుతున్న మన ఆశలు దేనినీ వదులుకోనీయడం లేదు. కాస్త కూర మిగిలినా ఫ్రిజ్లో పెట్టుకొని రేపు తిందామనీ, పాతబట్టలుంటే స్టీల్ సామగ్రికి మార్చుకుందామనేంత కక్కుర్తికి దారితీస్తున్నాయి. ఇలాంటి ధోరణి మనల్నే కాదు, ఇంట్లో మనల్ని గమనిస్తున్న చిన్నారులను కూడా సంకుచిత స్వభావులుగా మార్చేస్తుంది. మనకు సరిపడ్డాకనైనా ఇతరులకు ఇద్దామన్న దయాగుణం, పరోపకార తత్త్వం మనకు లేకపోతే మనల్ని చూసి మూగజీవాలు కూడా తలదించుకుంటాయి. మన సనాతన ధర్మం పరోపకారానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ...  పరోపకారః కర్తవ్యః ప్రాణై రపి ధనై రపి|  పరోపకారం పుణ్యం న స్యా త్రతు శతై రపి ॥  'కష్టపడి సంపాదించిన ధనమిచ్చి అయినా, చివరకు ప్రాణమిచ్చి అయినా పరోపకారం చేయాలి. నూరుయజ్ఞాల వల్ల కలిగే పుణ్యం కూడా పరోపకారంతో సమానం కాదు'అని హితవు పలుకుతోంది.                                       *నిశ్శబ్ద.
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యానికి..  ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం..  స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది. బరువు నిర్వహణ..  బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.                                             *నిశ్శబ్ద.
చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు  డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె  వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్.  ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది.  క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా  ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత  సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్,  ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక   ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం. ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం,  భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి  చేసిన  కొన్ని పరిశోధనల ప్రకారం   నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే.. నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట  గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు.. ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన  ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని  ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.                                                       *నిశ్శబ్ద.
ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూరోపతి ఎందుకు వస్తుంది? శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.