ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికలో బిజెపికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బిజెపిని బలపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల్లో  కూటమితో  పొత్తు లేకుండానే ఆప్    ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ కన్వీనర్  కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. 2013లో  ఆప్ తో పొత్తు పెట్టుకోవడం తమ పార్టీ చేసిన అతి పెద్ద పొరపాటు అని కాంగ్రెస్ నేత  అజయ్ మాకెన్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనే కాదు.. జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది.  ఐదేళ్ల పాటు జగన్ అరాచక, విధ్వంస పాలనను పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు.  జగన్ ఐదేళ్ల హయాంలో అష్టకష్టాలూ పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్ఛ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం  చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు, అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలూ ప్రారంభం కాలేదు. అంతే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీశారు.   అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారితప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసు కూడా పంపాడు. అంతే కాకుండా జగన్ ప్రాపంకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన  410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్నవారే.  జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో  అవకతవకలను బటయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై  తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై  చర్యలు తీసుకోవాలంటూ, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై కొరడా ఝుళిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీరెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పేరుగుతోంది. 
కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నిఖిల్ కూడా ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఎస్ ఐ , కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధానికి నిఖిల్ కారకుడని తెలుస్తోంది.  ప్రస్తుతం ఎస్ ఐ డెడ్ బాడీ దొరకకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్ ఐ కారు చెరువు కట్ట వద్దే ఉంది.    బిక్కనూర్ ఎస్ ఐ సాయికుమార్ బీబీనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాయికుమార్ బీబీపేట ఎస్ఐ గా పని చేస్తున్న సమయంలో శృతితో ఎఫైర్ ఉన్నట్టు వినికిడి.   సాయికుమార్ బిక్కనూర్ కు బదిలీ కావడంతో వీరిరువురి మధ్య గ్యాప్ ఏర్పడింది. శృతికి గతంలో పెళ్లి జరిగింది. కానీ భర్తతో విడిపోయి సాయికుమార్ తో ప్రేమాయణం నడిపించింది.  నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని శృతి వత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా ? అనేది తేలాల్సి ఉంది. ముగ్గురు ఒకే సారి సుసైడ్ చేసుకుంటే ఒకే సారి డెడ్ బాడీలు బయటపెడతాయి. కానీ అలా జరుగలేదు. కేవలం రెండు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. నిఖిల్ , శృతిలను సాయికుమార్ చంపేసి పరారైనట్లు మరో కథనం వినిపిస్తోంది. 
ALSO ON TELUGUONE N E W S
Cast: Kichcha Sudeep, Varalaxmi Sarathkumar, Samyukta Hornad, Sukrutha Wagle, Anirudh Bhat, Sunil, Ilavarasu, Redin Kingsley Crew:  Cinematography by Shekhar Chandra Edited by S. R. Ganesh Baabu Music by B. Ajaneesh Loknath Produced by Kalaippuli S. Thanu, Sudeepa Directed by Vijay Karthikeyaa Kichcha Sudeep has a good following in Telugu states as he made a great impression with Eega movie directed by SS Rajamouli. He has been acting in different languages even though he hails majorly from Kannada Cinema. The highly popular actor has come up with an high voltage action entertainer Max for Christmas holidays. The movie released in original language on 25th December and in Telugu on 27th December. Let's discuss about the film in detail.  Plot:  Inspector Arjun Mahakshay(Sudeep) known as Max, gets suspended for two months and transferred to another police station. On the day, he is taking charge, he arrests two local MLA sons and they die in the lock-up. As the MLAs are influential and have capability to topple CM, local police are completely shaken. In fear, they try to save themselves. Gangster Ganesh aka Gani(Sunil) and Inspector Roopa(Varalaxmi Sarathkumar) gets involved. How Max will solve this issue in 12 hours forms the rest of the story.  Analysis:  Kichcha Sudeep is good and in form as an action hero. His screen presence and look are believable as a mass action hero. His style of dialogue delivery and daredevil attitude does engage us. But the movie needed to carve out his character even better as it looks like bang an action episode after a point. Varalaxmi Sarathkumar, Sunil did their best but Sunil's voice has been dubbed by someone else and we miss the connect. All others also did well.  The movie seems to be inspired heavily from Lokesh Kanagaraj's films in setting up an action sequence and even executing it. Mainly, Kaithi influence is visible even in the action set pieces and set design. But the makers seems to have deliberately deviated from some of the emotional beats that Karthi's film touched to make it even more bloody actioner. So, the characters don't really stay with us after the movie finishes.  Technical values are outstanding. Production design, cinematography and editing streamline the movie as a one huge action set piece divided into episodes. While few episodes are engaging, few feel like the makers have gone overboard. Gallons and gallons of bloodshed is seen on the screen but innovativeness in action set pieces vanishes as the film goes on. At the attempt level, we can say, it is nice from Kannada Cinema.  Ajaneesh Loknath has gone loud for this one and it seems like hero worship vehicle after a point. Movie is aimed at action lovers and it will find takers but a strong core and emotional depth would have made this movie much more better. With it ending up being a film that happens in 12-hours and in one night, the inventiveness could have made it even better. Still, watchable for Sudeep.  In Conclusion:  Max goes a little bit overboard in action tiring us after a point.  Rating: 2.5/5 
Pushpa 2 The Rule film starring Allu Arjun, Rashmika Mandanna has become the key factor in Telangana State and TFI discussions, recently. The stampede occured during movie premiere night on 4th December at Sandhya Theatre, has stirred up a huge storm that entire TFI met CM Revanth Reddy.  While on one hand, such issues are going on, movie is continuing to create huge records. Movie has collected Rs.1705 crores gross worldwide in just 21 days. Movie has opened Rs.700 crores Nett gross collections club in Hindi markets and became first film to collect such huge amount.    It might even cross Rs.750 crores Nett gross collections, if it maintains pace till New Years' Eve. Movie team is unable to enjoy this success due to the accident but Pushpa 2 will remain a film to have created such a storm at the box office post Baahubali 2.  Now, Hindi films and stars would be looking to spreading their wings into South India for such wide reach and big grosses as Pushpa 2, showcased how universally loved character can bring audiences to theatres in large numbers. Movie is third highest grosser in Telugu states while it created Industry record in Hindi. 
  ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజైన రోజు నుంచి అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తొలిరోజు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన విషయంలోను,కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన విషయంలోను తొలి భారతీయ సినిమాగా నిలిచింది.హిందీలో ఇప్పటికే 700 కోట్ల నెట్ కలెక్షన్ ని సాధించిందంటే పుష్పరాజ్ హవాని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుష్ప 2 మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే 1705 కోట్ల గ్రాస్ ని అందుకున్న తొలి బారతీయ మూవీగా నిలిచింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన కేజీఎఫ్ పార్ట్ 2 (1250 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1300 కోట్లు) రికార్డుని  దాటేసి  బాహుబలి 2 (1800 కోట్లు) ని బీట్ చేసే దిశగా వెళ్తుంది.బాహుబలి 2 కి టోటల్ రాంగ్ రన్ లో 1800 కోట్లు వచ్చిన దృష్ట్యా పుష్ప 2 ఆ రికార్డుని లాంగ్ రన్ లో  ఈజీగా దాటే అవకాశం ఉంది. ఇక  పుష్ప 2 ఓటిటి వేదికగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్తలపై పుష్ప 2 మేకర్స్ స్పందిస్తు పుష్ప 2 థియేటర్ రిలీజైన రోజు నుంచి యాభై ఆరు రోజుల తర్వాతే ఓటిటి లోకి స్ట్రీమింగ్ కి వస్తుందని చెప్పారు    
గత ఇరవై రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. అది ప్రజల సమస్య కాకపోయినా, జరిగిన ఘటనలో ఓ సాధారణ మహిళ మృతి చెందడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై జనం ఎంతో ఆసక్తి చూపించారు. మీడియా అత్యుత్సాహం కూడా దీనిపై విపరీతమైన ఆసక్తి పెరగడానికి కారణమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని సమస్యను అల్లు అర్జున్‌ వర్సెస్‌ రేవంత్‌రెడ్డిగా మలిచారు కొందరు. మిగతా వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడిందంటూ ప్రచారం హోరెత్తించారు. ఈ విషయంలో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మంచు మోహన్‌బాబు వ్యవహారం క్రిటికల్‌గా మారిపోయింది. మీడియా రిపోర్టర్‌పై దాడి చేసిన కేసులో పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అతని అరెస్ట్‌ అనివార్యమైంది. అయితే పోలీసుల అందుబాటులో లేకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని కూడా మీడియా బాగా హైలైట్‌ చేస్తోంది.  మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, దాడులు, అరెస్టులు వంటివి చాలా జరిగాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన టాలీవుడ్‌ ఇలాంటి వివాదాలతో, ఆరోపణలతో అప్రతిష్ట పాలవుతోంది. మరో పక్క అల్లు అర్జున్‌ను రేవంత్‌రెడ్డి కావాలనే టెన్షన్‌ పెడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇకపై స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ల హైక్‌ ఉండదని, బెనిఫిట్‌ షోలకు కూడా అనుమతులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో టాలీవుడ్‌ షాక్‌కి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉంటే పరిస్థితి ఇంకా దిగజారుతుందని, కాబట్టి పరిశ్రమను ఆంద్రప్రదేశ్‌కి షిఫ్ట్‌ చెయ్యాలని సినీ పెద్దలు ఆలోచిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చిత్ర పరిశ్రమ భేటి అంటూ ఓ ప్రకటన చేశాడు ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌రాజు. గురువారం ఉదయం 10 గంటలకు 36 మందితో కూడిన సినీ ప్రముఖుల బృందం రేవంత్‌రెడ్డిని కలిసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్‌ వ్యహారం, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు.. ఇలా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తారని అందరూ భావించారు. ఆ మీటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఆ మీటింగ్‌ సారాంశాన్ని దిల్‌రాజు వివరించిన తర్వాత అందరికీ చాలా సందేహాలు వస్తున్నాయి. మీటింగ్‌లో వాళ్ళు మాట్లాడిన అంశాల గురించే మీడియాకి చెబుతున్నారా? లేక అసలు విషయాలు దాచిపెట్టి కొసరు మాటలే బయటికి వదిలారా అంటూ ప్రశ్నిస్తున్నారు.  అసలు సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లింది దేనికి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వెలుగు చూసిన పలు వివాదాల గురించి, సంధ్య థియేటర్‌ దుర్ఘటన గురించి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, దిల్‌ రాజు బయటికి వచ్చిన తర్వాత మీడియాకు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తెలుగు సినిమా రేంజ్‌ పెంచడమే రేవంత్‌రెడ్డి ధ్యేయమని చెప్పారు దిల్‌రాజు. కొన్నేళ్ళ క్రితమే బాహుబలి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ను కూడా సాధించి తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించింది. పుష్ప2 కూడా ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్‌ అయి రికార్డు స్థాయి కలెక్షన్స్‌ సాధించి బాహుబలి రికార్డును కూడా క్రాస్‌ చేసింది. ఇలా ఇండియాలోనే నెంబర్‌వన్‌ చిత్ర పరిశ్రమగా టాలీవుడ్‌ పేరు ఆల్రెడీ తెచ్చుకుంది. ఇంకా రాబోయే కొన్ని సినిమాలతో ఆ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.  దిల్‌ రాజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎదురైన బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు ప్రశ్నను అసలు లెక్కలోకి తీసుకోకుండా.. అది చాలా చిన్న విషయమని, సినిమాలో అది ఒక పార్ట్‌ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా తెలుగు సినిమా స్థాయిని పెంచడంపైనే ఉందని చెప్పారు. కొన్ని సామాజిక అంశాల ప్రచారంలో టాలీవుడ్‌ తారలు పాల్గొనాలని ముఖ్యమంత్రి అడిగారని, దానికి చిత్ర పరిశ్రమ ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ విషయాలు చర్చించేందుకు అంత అత్యవసరంగా మీటింగ్‌ ఏర్పాటు చేయడాన్ని జనం నమ్మడం లేదు. దిల్‌రాజు మాట్లాడిన మాటల్లో ఒక్కసారి కూడా సంధ్య థియేటర్‌ ఘటన గురించి ప్రస్తావించలేదు. టాలీవుడ్‌లో పరంపరగా వస్తున్న వివాదాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ పరిష్కారం కాకుండా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తామని, హాలీవుడ్‌ సినిమాల షూటింగ్స్‌ కూడా ఇక్కడ జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్యలను గాలికి వదిలేసి.. ఇలా గాలిలో మేడలు కట్టడం మానుకోవాలని, ఆ సమస్యల్ని పరిష్కరిస్తే అద్భుతాలు చేసేందుకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలి. ఇప్పటికే తెలుగు సినిమాలు హాలీవుడ్‌ డైరెక్టర్లను సైతం మెప్పించే స్థాయిలో ఉంటున్నాయి. మన సినిమాల రేంజ్‌ను ఇంకా పెంచేందుకు మీరంతా కంకణాలు కట్టుకోవాల్సిన అవసరం లేదని గుర్తిస్తే మంచిది అంటున్నారు ప్రేక్షకులు.
Victory Venkatesh has always been a different and distinctive from other stars with his films. He is choosing wholesome family entertainers for festivals. Hence, he is coming up with Sankrantiki Vasthunnam with blockbuster director Anil Ravipudi. Both the actor and director made a successful combination with F2 and F3 successes.  Makers are not leaving any kind of innovativeness for marketing their film. Now, Venkatesh is singing a song in this film. The special Sankranti song has been sung by the actor. After Guru, he has become a singer for this film.    Most interesting aspect is the promotional video. Alike Swathi Muthyam sequence, where Kamal Haasan keep pestering JV Somayajulu for a job. Here, Venkatesh keeps pestering Anil Ravipudi until he relents to let him sing the song. Anil is able to deliver another funny video for promoting the film.  Aishwarya Rajesh and Meenakshi Chaudhary are playing leading lady roles in the film. The song is said to be special Sankranti song and has been shot on the main leads, recently. Mobvie is releasing on 14th January worldwide and has good buzz among the audiences. Bheems Ceciroleo is composing music for the film and Dil Raju is presenting it. 
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు సంపాదించిన నటుడు రాకింగ్ రాకేష్(rocking rakesh)పలు సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించిన రాకేష్ రీసెంట్ గా 'కేసిఆర్'(kcr)అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నవంబర్ 22 న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ మూవీకి గరుడవేగ అంజి(garuduvega anji)దర్శకత్వం వహించగా   రాకేష్ నే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు.   ఇప్పుడు 'కేసిఆర్' మూవీ ఈ నెల 28 నుంచి ఓటిటి వేదికగా 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా చెప్పడమే కాకుండా సరికొత్త ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది.టైటిల్ రోల్ లో రాకేష్ నటించగా అనన్య కృష్ణన్ హీరోయిన్ గా,తనికెళ్ళ భరణి,ధనరాజ్,లోహిత్ కుమార్,జోర్దార్ సుజాత,రచ్చరవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.చరణ్ అర్జున్ సంగీత దర్శకుడు కాగా మధు ఎడిటర్ గా వ్యవహరించాడు.   
మహేష్ బాబు(mahesh babu)త్రివిక్రమ్(trivikram)కాంబోలో తెరకెక్కిన అతడు(athadu)మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని సంపాదించిన నటుడు సోనూసూద్.సూపర్,కందిరీగ,అశోక్,ఏక్ నిరంజన్,దూకుడు,జులాయి,అల్లుడు అదుర్స్ వంటి తదితర చిత్రాలతో తన నటనకి ఉన్న  ప్రత్యేకతని చాటి చెప్పాడు.ముఖ్యంగా అనుష్క ప్రధాన పాత్రలో  కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన'అరుంధతి' లో పశుపతి అనే క్యారక్టర్ ద్వారా స్టార్ స్టేటస్ ని కూడా పొందాడు.  హిందీలో కూడా చాలా చిత్రాల్లో నటించిన సోను సూద్(sonu sood)రీసెంట్ గా ఒక వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అయన మాట్లాడుతు దేశంలోనే మంచి పేరున్న వ్యక్తులు  రాజకీయాల్లో నాకు ఉన్నత పదువులు చేప్పట్టే అవకాశాన్ని కలిపిస్తామని చెప్పారు.ఆ పదవుల్లో సిఏం,డిప్యూటీ సిఎం లాంటివి కూడా ఉన్నాయి.రాజకీయాల్లోకి వస్తే పదవితో పాటు ఇల్లు, ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ భద్రతతో ఉన్న లెటర్ హెడ్ విలాసాలు ఉంటాయని,ఆ పదవుల్లో ఏదో ఒకటి తీసుకోమన్నారు.కానీ నేను తీసుకోలేదు.ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారు.వాటి పట్ల నాకు ఆసక్తి లేదు.ప్రజా సేవ చెయ్యడం కోసమైతే ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. ఎవరికైనా సరే స్వయంగా నేనే సాయం చేస్తున్నాను.ఆ విధంగా స్వేచ్ఛా జీవిగా  ఉంటున్నాను. ఒక వేళ నేను రాజకీయ నాయకుడుగా మారితే జవాబు తారి వ్యవహరించాల్సి ఉంటుంది.అది నన్ను మరింత భయపడుతుంది.ప్రజాదరణ పొందుతున్న వారు జీవితంలో ఎదగడం ప్రారంభిస్తారు.నిజానికి ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ ఉండదు.మనం ఎత్తుకి ఎదగాలని కోరుకుంటాం.కానీ అక్కడ ఎంత కాలం ఉంటామనేది ముఖ్యమని చెప్పుకొచ్చాడు.ఇక సోనూ సూద్ మాటలు విన్న అయన అభిమానులైతే సోనూ సూద్ ఆ పదవులకి ఒప్పుకుంటే బాగుండేదని అనుకుంటున్నారు.  
  నటుడు జగపతి బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. ఆయనొక బెస్ట్ ఫుడీ. అది కూడా లిమిట్ గా హెల్తీగా చేసుకుంటారు .. ఇంట్లో ఆయనే తన ఫుడ్  ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారు. ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుందో తెలుసుకుని మరీ వెళ్లి తినొస్తుంటారు. మూవీస్ లో నటించేటప్పుడు వామ్మో జగపతిబాబు విలనిజాన్ని తట్టుకోలేము చూసి. కానీ పక్కన నిలబడి రోడ్ సైడ్ ఫుడ్ అందరితో కలిసి తిన్నప్పుడు ఈయనేంటి ఇంత కలిసిపోతాడా అని సాఫ్ట్ కార్నర్ కూడా జనాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి జగ్గు భయ్యా ఇప్పుడు భీమవరం రుచులని ఆస్వాదిస్తూ ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. " భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యుటీకి ఈ మనిషి రోడ్డున పడ్డాడు..ఏదేమైనా బండి ఫుడ్ అంటే బండి ఫుడ్డే..." అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఐతే ఒక రోడ్ సైడ్ బండి దగ్గర చల్ల పునుగులు, బజ్జీలు తింటూ ఉండగా అక్కడ జనం గుమ్మి గూడారు. ఆ పిక్ చూసిన ఒక నెటిజన్  "అయ్యా..మళ్ళీ తొక్కిసలాట ఐతే...మీడియాకి  మంచి టాపిక్  దొరుకుతుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి రిప్లైగా మరో నెటిజన్ "క్లోజ్డ్ గా ప్లేస్ కి ఓపెన్ ప్లేస్ కి తేడా తెలీడం లేదా బ్రో" అంటూ రిప్లై ఇచ్చారు. "జగ్గు అన్నా మీ ఎంజాయ్ వేరే లెవెల్..మీరు సూపర్, గ్రేట్ సర్" అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. ఐతే బన్నీ ఇష్యూతో ఏ సెలెబ్రిటీ ఐనా కానీ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఇక జగ్గు భాయ్ రీసెంట్ గా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీ తేజ్ ని కూడా హాస్పిటల్ కి వెళ్లి కలిసి వచ్చారు. తాను వెళ్లి కలిసి వచ్చిన విషయం పబ్లిసిటీ చేసుకోలేదని ఐతే ఇప్పుడు దీని గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప 2 లో జగపతి బాబు నటించిన విషయం తెలిసిందే.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.
  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు. క్రిస్మస్ సంప్రదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.  క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.   పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు. క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.                                     *రూపశ్రీ.
సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద
  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత,  నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో  తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది.  దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు.  సకాలంలో వ్యాధి నిర్ధారణ,  చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స  తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి  లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. పిసిఓయస్.. PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..! పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో  ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో  అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య.  ఇది  గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ముప్పులు తప్పవా? 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది.  PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం,  మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట.  ఇది జీవిత నాణ్యత, కెరీర్,  ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా  స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా  ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.                                   *రూపశ్రీ. 
ఎప్పుడైనా పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు.  మనిషి ఆయుష్షు వందేళ్లు అని చెబుతారు.  ఒకప్పటి మహర్షులు,  ఋషులు వందల ఏళ్లు జీవించగలిగారు.  తరువాత మన ముత్తాతలు,  తాతలు  వందేళ్ళకు పైగానే జీవించారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కాలమే ఉంటున్నా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే..  క్రమంగా మనిషి ఆయుష్షు తగ్గుతూ వస్తోందని చెప్పవచ్చు.  పరిశోధనలతో పాటు.. సమాజంలో జరుగుతున్న మరణాల రేటు, మరణాల వివరాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే  మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వెంటనే జీవితంలో 5 మార్పులు చేసుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సమతుల ఆహారం.. ఆహారమే ఆరోగ్యం అని అంటారు. చాలా వరకు తీసుకునే ఆహారమే ఔషదంగా పనిచేసి చాలా రోగాలు నయం కావడంలో సహాయపడుతుంది.  రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది.  శరీరానికి శక్తి కూడా అందుతుంది. రోజులో కనీసం 5రకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలట. గోధుమలు,  ఓట్స్,  బ్రౌన్ రైస్,  తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి.  ఎందుకంటే వీటిలో ఫైబర్ తో పాటూ అవసరమైన పోషకాలు, ప్రోటీన్ కూడూ ఉంటుంది. ప్రోటీన్ కోసం చేపలు, శనగలు,  పప్పులు, జున్ను, పనీర్  వంటివి తినాలి.  ఇవన్నీ శరీరానికి తగిన బలాన్ని ఇస్తాయి.  శరీరంలో కండరాలను బలంగా ఉంచుతాయి. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవాలి.  చక్కెర జోడించి చేసిన ఆహారం,  ఉప్పు ఎక్కువ జోడించి చేసిన ఆహారం తక్కువగా తీసుకోవాలి.  ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారం,   స్నాక్స్ లో సోడియం,  చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలు,  ఆలివ్ నూనె,  చేపలు తినాలి.  ఇవి మెదడుకు కూడా చాలా సహాయపడతాయి. వ్యాయామం.. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయవచ్చు. నిద్ర.. కనీసం 7 నుండి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.  ఇది మంచి శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి.. జీవితంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి.  ఒత్తిడి లేకుండా చూస్తూ ఏ సమస్య అయినా చాలా తొందరగానే పరిష్కారం అవుతుంది.  మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఒత్తిడే.. ద్యానం,  శ్వాస వ్యాయామాలు,  యోగ వంటివి ఫాలో అయితే ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. నీరు.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి నీరు చాలా అవసరం.  శరీరం హైడ్రేటెట్ గా ఉండాలన్నా,  శరీరంలో వ్యర్ఖాలు బయటకు వెళ్లిపోవాలన్నా రోజూ తగినంత నీరు తాగుతుండాలి. దీని వల్ల శరీరానికి  సరైన శక్తి లభిస్తుంది.                                   *రూపశ్రీ.