జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని  మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  బాలినేని కూడా జగన్ కు సమీప బంధువు. నిన్న మొన్నటి దాకా ఆయన వైసీపీలోనే ఉన్నారు. పలు మార్లు ఆ పార్టీ అధినేతతో విభేదించారు. అలకబూనారు. ధిక్కార స్వరం వినిపించారు. అయినా సర్దుకు పోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా ఆయన కొంత కాలం వైసీపీలో కొనసాగారు. ఒంగోలులో తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత వైసీపీ తీరుతో, మరీ ముఖ్యంగా జగన్ వైఖరితో విసికి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.   ఇప్పటి వరకూ జగన్ పై రాజకీయ విమర్శలే చేస్తూ వచ్చిన బాలినేని జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనవే కాదు తన వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆస్తల కబ్జాల గురించి  తర్వాత సమయం వచ్చినప్పుడు  వివరంగా చెబుతానని బాలినేని అన్నారు.  జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని కుండబద్దలు కొట్టారు.  త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా తాను ఓ సినిమా నిర్మించనున్నట్లు బాలినేని జయకేతనం సభ వేదికగా ప్రకటించడం కొసమెరుపు.  
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే.. కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట మాట్లాడటం అన్నది.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం అన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అసలలాటిం సందర్భం ఒకటి వస్తుందన్న ఊహ కూడా రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా రాలేదు.  రేవంత్, కేసీఆర్ మధ్య మాటలయుద్ధం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ మర్యాదలకు కూడా తిలోదకాలిచ్చి వారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటుంటారు.  అయితే అనూహ్యంగా ఆ ఇరువురి నోటీ ఒకే మాట వచ్చింది. ఏదో సినిమాలో నువ్వాదరిని.. నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అన్న పాటను స్ఫురింపచేసేలే.. నిప్పూ ఉప్పులా చెరో వైపూ ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను నియోజకవర్గాల పునర్విభజన అంశం ఏకతాటిపైకి తెచ్చింది. ఔను డీలిమిటైజేషన్ ను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటా ఒకే మాట వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటీ ఒకే మాట వినిపిస్తోంది.   జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నచర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం ఎత్తారు.  జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిషేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయనీ, దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగడమో… లేదంటే అసలు సీట్లే పెరగకపోవడమో.. ఇంకా చెప్పాలంటే సీట్ల సంఖ్య  తగ్గిపోవడమో జరుగుతుందన్న ఆందోళనను డీఎంకే వ్యక్తం చేసింది.  దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి దోహదం చేసింది. అంతే కాకుండా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఈ నెల 22న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే  ఆహ్వానించింది. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కూడా ఈ సమావేశాన్నిస్వాగతించారు. హాజరవ్వడానికి అంగీకరించారు.   డీఎంకేతో కాంగ్రెస్   పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అటువంటిది డీఎంకే సమావేశానికి హాజరౌతామని కేటీఆర్ అంగీకరించడం విశేషమేనని పరిశీలకులు అంటున్నారు. అదీ కాక రేవంత్, కేటీఆర్ లు ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కానుండటం రాజకీయవర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.  మొత్తం మీద రేవంత్, కేటీఆర్ ల నోట ఏ విషయంలోనైనా సరే ఏకాభిప్రాయం వ్యక్తం కావడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. చెన్నై వేదికగా జరిగే అఖిలపక్ష సమావేశంలో ఇరువురూ ఒకే వేదిక పంచుకుంటే అది రాజకీయంగా ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవలసి ఉంటుంది. చూడాలి మరి.. రేవంత్ కేసీఆర్ లు ఆ సమావేశానికి స్వయంగా హాజరౌతారో తమతమ పార్టీల తరఫున ప్రతినిధులను పంపుతారో. 
బంగారం  తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా?  .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ  మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్‌ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.
ALSO ON TELUGUONE N E W S
  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో టక్కున చెప్పమంటే అభిమానులు కూడా తడబడతారు. మిగాతా స్టార్స్ కి సాధ్యంకాని విధంగా వరుస భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి-2 తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో కొత్త సినిమా కమిట్ అయ్యాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. అది కూడా ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడితోనే.. ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజి' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే హను టాలెంట్ మెచ్చిన ప్రభాస్.. ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.  ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు సమాచారం.   హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి సలార్-2 కాగా, మిగతా రెండు సినిమాలకు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు హను ప్రాజెక్ట్.. ఆ మూడు సినిమాల్లో ఒక దాని ప్లేస్ లో ఉంటుందా? లేక ఇది నాలుగో ప్రాజెక్ట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.  
'మక్కల్ సెల్వం విజయసేతుపతి'(VIjay Sethupathi)గత ఏడాది 'మహారాజ'(Maharaja)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.తన కూతురు కాకపోయినా కూడా వేరే వాళ్ల కూతుర్ని కన్నకూతురిలా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటు,ఆమెకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగడానికి తన చావుని సైతం లెక్కచేయని చిన్నపాటి అమాయకత్వంతో కూడిన క్యారక్టర్ లో విజయ్ సేతుపతి నటనకి ఇండియన్ చిత్ర సీమనే కాదు చైనా బాక్స్ ఆఫీస్ కూడా నీరాజనాలు పలికింది. రీసెంట్ గా 'మహారాజ' చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి'బిహైండ్ వుడ్ అవార్డ్  అందుకున్నాడు.ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతు మహారాజ విజయాన్ని నేనెప్పటికీ మర్చిపోను.నా కెరీర్లో ఈ మూవీ ఎంతో ప్రత్యేకమైంది.ఈ సినిమాకి ముందు మూడు సంవత్సరాలు పాటు నా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి.దీంతో నా కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది మాట్లాడారు.అలాంటి టైంలో మహారాజ నన్ను నేను నిరూపించుకునేలా చేసింది.ఈ సినిమాతో ప్రపంచానికి కనెక్ట్ అవుతానని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. నితిలన్ స్వామినాథన్(Nithilan Swaminathan)దర్శకత్వంలో తెరకెక్కిన మహారాజ లో విజయ్ సేతుపతి తో పాటు అనురాగ్ కశ్యప్(anurag kashyap)అభిరామి,దివ్య భారతి,నటరాజ్ సుబ్రహ్మణ్యన్,మమతా మోహన్ దాస్ కీలక పాత్రలు పోషించారు.దిరూట్,థింక్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జగదీష్ సుందరం 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 190 కోట్లు వసులు చేసింది.       
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బాలీవుడ్ లో వార్ 2(War 2)చేస్తున్న విషయం తెలిసిందే.హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీకి బాలీవుడ్ అగ్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ(deb Mukherjee)చనిపోవడం జరిగింది. 83 సంవత్సరాల వయసు గల దేబ్ ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.మొదటి నుంచి సినిమా ఫ్యామిలీకి చెందిన దేబ్ ముఖర్జీ అధికార్, జీ జీతావొహి,సికందర్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.మరో ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవర్కర్ కూడా దేబ్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు.      
  Hari Hara Veera Mallu is one of the BIGGEST films coming from Indian cinema this year carrying massive expectations. The film was initially scheduled to release in theaters on March 28th but with post production still underway the release has been pushed forward.   Pawan Kalyan as the outlaw Veera Mallu - A warrior with a fire in his soul. This is the Powerstar in his most ferocious avatar yet ready to rip through the screen and Steal the Koh-i-noor right under the noses of Mughal Kings. He’s waging a war for justice and on May 9th we’re all signing up for the revolution.    Directed by A.M. Jyothi Krishna, this film’s been a ride from the jump. Jyothi Krishna swooped in to finish the job after delays from COVID and Pawan’s political hustle. Then there’s Oscar winning maestro M.M. Keeravani whose soundtrack is rumored to be a banger of historic proportions. while Manoj Paramahamsa is the cinematographer. Veteran Thota Tharani is the art director of the movie and you’ve got a crew that’s cooking up a visual feast fit for an outlaw.   Pawan Kalyan might be the beating heart of this madness but the supporting cast is pure dynamite. Bobby Deol as the Mughal emperor is bringing that villainous swagger we’ve been craving since Animal and Daaku Maharaaj. Nidhhi Agerwal is set to light up the screen while Anupam Kher and Jisshu Sengupta add gravitas to this already stacked lineup.    After years of delays and rumors of it being shelved, this film is finally roaring to life. Now the film is set to release on May 9th, 2025, gearing up for a solo massacre at the theaters. Releasing in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.    Produced by A Dayakar Rao and Presented by veteran AM Rathnam under the banner Mega Surya Productions.  
  చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం  జగదీష్ నిర్మించిన 'కానిస్టేబుల్' చిత్రంలోని 'మేఘం కురిసింది...' అనే పాటను విడుదల చేశారు.    ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైనదని అన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో  నిర్మించిన  ఈ చిత్రం విజయవంతం కావాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్  ఇండియా చిత్రాలలో కొన్ని మాత్రమే విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయని అన్నారు. సినీ పరిశ్రమలో తాము కూడా రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు.  దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్ గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.    ఈ కార్యక్రమంలో చిత్ర హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.  
సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)భార‌త ప్ర‌భుత్వం(Indian Government)నుంచి రెండో అత్యున్న‌త‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌ తో పాటు,అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో సత్కరించబడ్డ విషయం తెలిసిందే.ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్(Anr)జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇప్పుడు హౌస్ ఆఫ్ కామ‌న్స్ ,యు కె పార్ల‌మెంట్(Uk parliament)లో గౌరవ స‌త్కారం జరగనున్నది.యు కె పార్లమెంట్ లో చిరంజీవిని అధికార లేబ‌ర్ పార్టీ(Labour Party) పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా(Navendu Mishra)మార్చి 19న స‌న్మానించ‌నున్నారు.సోజన్ జోసెఫ్,బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా(Bridge India)సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం'ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డుని తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండ‌టం విశేషం.ఈ అవార్డు చిరు కీర్తి కీర‌టంలో క‌లికితురాయిగా నిలిచిపోతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు,తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉదేశ్యంతో వారిని సత్కరిస్తుతుంది.ఈ విధంగా యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.    
  Telugu audiences have long been familiar with actor Shivaji, who once shined as a hero in many films before taking a break from the industry. However, his stint in Bigg Boss introduced him to a new generation of fans who admired his personality and strong opinions. Following that, he made a striking comeback with the web series #90s, leaving a lasting impression.     Now, Shivaji has delivered yet another memorable performance in Court, a film produced by Nani and directed by debutant Ram Jagadish. His portrayal of Mangapati is being hailed as one of his finest, with audiences raving about his intense performance and powerful dialogue delivery.   Every time he appears on screen, his presence commands attention, drawing applause and appreciation from the viewers. What makes his role even more impactful is its relatability—many viewers see shades of real-life figures in his character, making the performance even more gripping. Critics too have highlighted Shivaji's performance as one of the film’s biggest strengths.   While many actors attempt comebacks, few manage to do so with such a compelling role. With Court, Shivaji has undoubtedly solidified his second innings, and there's no doubt that filmmakers will now be lining up to cast him in more powerful roles.  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hariharaveeramallu)పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.మార్చి 28 న రిలీజ్ అవుతుందని మేకర్స్ చాలా రోజుల కిందటే అధికారకంగా ప్రకటించారు.కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదు.పవన్ ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు,పొలిటికల్ గా బిజీగా ఉండి డేట్స్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానులు కొత్త డేట్ కోసం ఎదురుచూస్తు ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు చెప్తు మేకర్స్ కొత్త డేట్ ని విడుదల చెయ్యడం జరిగింది.మే 9 న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ ని తీసుకొచ్చింది.మే 9 న చిరంజీవి(Chiranjeevi)శ్రీదేవి(sridevi)కాంబోలో అశ్వనీదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.దీంతో వీరమల్లుపై సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. వీరమల్లుని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఏం రత్నం(Am Rathnam)దయాకర్(Dayakar)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal) హీరోయిన్ గా చేస్తుంది.బాబీడియోల్, నాజర్,సునీల్, సుబ్బరాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా క్రిష్(Krish)జ్యోతికృష్ణ(Jyothikrishna)సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ కీరవాణి(Mm Keeravani)సంగీత దర్శకుడు.ప్రచార చిత్రాలతో పాటు సాంగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి.    
  Dr Chiranjeevi Konidela will be hosted and felicitated in a grand way at the House of Commons - UK Parliament, for his exemplary services to the society through the power of his cultural influence by Mr Navendu Mishra, MP of the ruling Labour Party from Stockport - UK, on the 19th March 2025. Other honourable MPs who would be gracing the occasion include Mr Sojan Joseph and Mr Bob Blackman among others.   Subsequently, on the same platform, Bridge India, will be recognising the tremendous contributions of Chiranjeevi to cinema, public service and philanthropy, by presenting him with the "Lifetime Achievement Award for Excellence in Public service through Cultural Leadership".   Bridge India is a prominent organisation in the UK that works on shaping public policy. Bridge India celebrates individuals whose influence extends beyond their professional achievements to create lasting social impact. This is the first time the organisation is presenting an Award for Life time Achievement to any individual. This honour adds yet another feather in the prized cap of Dr. Chiranjeevi.   These recognitions are special in terms of being presented on an international stage by law makers of the UK and a renowned organisation like Bridge India.   It is known that in the year 2024, Chiranjeevi was conferred India’s second highest civilian award ‘Padma Vibhushan’. In the same year Chiranjeevi was honoured with the Guinness World Record as the Most Prolific Actor / Dancer. Chiranjeevi was also bestowed the prestigious ANR National Award in the ANR Centennial year in 2024 by the Akkineni International Foundation.    
సినిమాపేరు:దిల్ రుబా నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లన్, కథి దేవిసన్,సత్య,జాన్ విజయ్,తులసి, ఆనంద్, ఆడుకాలం నరేన్,వడ్లమాని శ్రీనివాస్ తదితరులు   రచన,దర్శకత్వం: విశ్వకరుణ్  సినిమాటోగ్రఫి:విశ్వాస్ డానియల్  ఎడిటర్:ప్రవీణ్ కేఎల్  సంగీతం:సామ్ సి ఎస్  నిర్మాతలు:విక్రమ్ మెహ్రా,సిద్దార్ధ్ ఆనంద్ కుమార్, జోజో జోస్, రవి,రాకేష్ రెడ్డి   బ్యానర్ :శివమ్ సెల్యులాయిడ్స్ రిలీజ్ డేట్: 14 - 03 -2025  'క' లాంటి విభిన్నమైన మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)హోలీ కానుకగా 'దిల్ రుబా'(Dil Ruba)అనే మూవీతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పక్కా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా,ప్రచార చిత్రాలు,వాటిల్లోని డైలాగ్స్ తో 'దిల్ రుబా' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ సిద్దు(కిరణ్ అబ్బవరం),మ్యాగీ(కథి దేవిసన్) చిన్నవయసు నుంచే మంచి స్నేహితులతో పాటు ప్రేమికులు కూడా కావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు.కానీ సిద్దు తండ్రి(ఆనంద్) హఠాన్మరణంతో మ్యాగీ వేరే అతన్నిపెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సిద్దు  బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు.అంజలి (రుక్సర్ థిల్లన్) అనే తోటి క్లాస్ మేట్ సిద్దు మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది.తన జీవితంలో ప్రేమ అనేది లేదని మొదట్లో చెప్పిన సిద్దు ఆ తర్వాత అంజలిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు.ఈ విషయం ప్రెగ్నెంట్ తో ఉన్న మ్యాగీ కి చెప్తాడు.అంజలి,సిద్దు మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేక్ అప్ అవుతారు.  దీంతో మ్యాగీ బెంగుళూర్ వచ్చి అంజలి,సిద్దుని కలపాలని చూస్తుంది.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అంజలి,సిద్దు ఎందుకు విడిపోయారు? మ్యాగీ ఎందుకు ఆ ఇద్దర్ని కలపాలని చూస్తుంది? అసలు ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా యుఎస్ నుంచి సిద్దు లైఫ్ కోసం వచ్చిన మ్యాగీ   మరి సిద్దుని ఎందుకు వదిలేసింది?  సిద్దు ఎవరు? అతని కుటుంబనేపథ్యం ఏంటి? డ్రగ్ డీలర్ జోకర్ కి ఈ కథ కి సంబంధం ఏంటి? సిద్దు,అంజలి కలిసారా లేదా అనేదే ఈ కథ.  ఎనాలసిస్  'దిల్ రుబా' చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ ల 'జల్సా' గుర్తుకొస్తుంటుంది.ఏది ఏమైనా 'దిల్ రుబా' అంతగా తీసి పారేయాల్సిన మూవీ అయితే కాదు.హీరోతో పాటు హీరోయిన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది.ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల తర్వాత ఇందులోని   డైలాగ్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ లోనే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసింది.అందుకు తగ్గట్టుగానే చివరి దాకా ఉన్నాయి.నటీనటులు అందరు కూడా తమ క్యారక్టర్ కి,కథకి తగ్గట్టుగా నటించి ఎక్కడ బోర్ కొట్టకుండా చేసారు.కథ,కథనాలు గతంలో చాలా చిత్రంలో వచ్చినవే కావడం మాత్రమే ఈ చిత్రానికి మైనస్.ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే టైటిల్స్ బిగినింగ్ నుంచే మూవీపై మేకర్స్ క్యూరియాసిటీ కలిగించారు.సిద్ధు బెంగుళూర్ కాలేజీలో ఎంటర్ అవ్వడం,సిద్దు యాటిట్యూడ్ నచ్చి అంజలి ఇష్టం పెంచుకొని తన వెనకాలే పడటం వంటి సీన్స్ అన్ని చాలా బాగున్నాయి.ఆ తర్వాత అంజలి ప్రేమలో ప్రేమంటే ఇష్టం లేని సిద్దు ప్రేమించే రీజన్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది.సత్య కామెడీతో పాటు కథ నడిచిన విధానం కూడా వర్క్ అవుట్ అయ్యింది.కాకపోతే ఇంటర్వెల్ టైంకి సిద్దు, అంజలి విడిపోయే కారణమే కొంచం అతిగా అనిపిస్తుంది.ఎందుకంటే సిద్దు,అంజలి ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే మనుషులు.అంజలి అయితే సిద్దు కంటే కూడా ఫాస్ట్ అని చెప్పవచ్చు.అలాంటి అంజలి ఎవరో ఒకరి వల్ల సిద్దు ని అపార్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండదు.పైగా అందుకు కారణమైన వ్యక్తి అంజలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంటే,సిద్దు కాపాడతాడు.కథ కోసం కావాలని అంజలి,సిద్దు మధ్య మనస్పర్థలు రావాలని చెప్పినట్టుగా ఉంది.ఇదే లాజిక్ మ్యాగీ,సిద్దు లవ్ కి కూడా వర్తిస్తుంది.మ్యాగీ, సిద్దు మధ్య కాకపోయినా,అంజలి,సిద్దు మధ్య అయినా బ్రేక్ అప్ కావడానికి చాలా బలమైన రీజన్ సెట్ చేసుండాల్సింది.అసలు సిద్దుకి ఉన్న డిఫరెంట్ యాటిట్యూడ్ చూసే అంజలి ప్రేమిస్తుంది కదా.అసలు పవిత్రమైన ప్రేమ అర్ధం పర్థం లేని కారణానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది.జాన్ విజయ్ ని ఫస్ట్ ఆఫ్ లో కూడా యూజ్ చేసుకోవాల్సింది.సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ లో తనని ప్రేమించమని అంజలి ఏ విధంగా అయితే తిరిగిందో సిద్దు అదే విధంగా అంజలి వెంట తిరుగుతాడు.దీంతో  రిపీటెడ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.అంజలి,సిద్దు ని కలపాలని యుఎస్ నుంచి ప్రెగ్నెంట్ తో ఉన్న మ్యాగీ రావడం, సిద్దుతో ఉండటం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది.కాకపోతే  కాలేజ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోకుండా ఉండాల్సింది.ఎందుకంటే ప్రేక్షకులకి సెకండ్ ఆఫ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.పైగా నటినటులు కూడా వాళ్లే. సిద్దు పై డ్రగ్ డీలర్ జోకర్ పగ పెంచుకునే పాయింట్ బాగుంది.కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులకి తెలిసిపోతుంది.అంజలి,సిద్దు కలవడం ఖాయమని కూడా క్లైమాక్స్ కి చాలా ముందే అర్థమైపోతుంది. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు    సిద్దు క్యారక్టర్ లో కిరణ్ అబ్బవరం విజృంభించి నటించాడు.ప్రేక్షకులకి కేవలం సిద్దు క్యారక్టర్ మాత్రమే కనపడేంతలా లవ్ ,యాక్షన్,సెంటిమెంట్ ఇలా అన్ని  వేరియేషన్స్ లోను తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.హీరోయిన్లుగా చేసిన రుక్సర్ థిల్లన్(Rukshar dhillon)కథి దేవిసన్(kathy davison)తమ కెరీలోనే బెస్ట్ పెర్ఫార్మెన్సు ఇచ్చారు.ముఖ్యంగా రుక్సర్ అయితే తన యాక్టింగ్ తో ప్రేక్షకులని కట్టి పడేసింది.ఇంకా మంచి అవకాశాలు వస్తే తెలుగు తెరపై తన సత్తా చాటగలదు.సత్య,జాన్ విజయ్,రుక్సర్ తండ్రిగా చేసిన ఆడుకాలం నరేన్, సీనియర్ నటీమణి తులసి ఇలా అందరు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.దర్శకుడి పనితనం బాగానే ఉన్నా కూడా రచనా పరంగా అందరకి తెలిసిన సీన్స్ కావడం మైనస్.సాంగ్స్ తో పాటు బిజిఏం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.అన్ని ఫ్రేమ్ ల్లోను ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండి ప్రేక్షకుల చూపుల్ని కట్టిపడేసింది.   ఫైనల్ గా చెప్పాలంటే చాలా సినిమాల్లో చూసిన కథ,కథనాలుతో దిల్ రుబా తెరకెక్కడం అనేది మైనస్ గా పరిగణించవచ్చేమో.గాడ్ కంటే గొప్పదైన ప్రేమ చిన్న కారణనానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుందనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరేమో.ఏది ఏమైనా తుది తీర్పు మాత్రం ప్రేక్షకులదే. రేటింగ్ 2 /5                                                                                                                                                                                                                                                                              అరుణాచలం 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
భారతీయుల సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఋతువు మార్పుకు అనుగుణంగా జరిగేవి అయితే.. మరికొన్ని వివిధ కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలకు గుర్తుగా జరుపుకునేవి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా జరుపుకునేవి అయితే మరికొన్ని యావత్ భారతదేశం అంతా జరుకునేవి. ఇలా భారతీయులు అందరూ  దేశం మొత్తం జరుపుకునే వేడుకల్లో హోళి ఒకటి. రంగుల పండగ అయిన ఈ హోళి వెనుక చాలా కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, హోళి పూర్ణిమకు అవినాభావ సంబంధం ఎంతో ఉంది. అలాగే హోళిని దేశవ్యాప్తంగా జరుపుకున్నా ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా హోళి పండుగ జరుపుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది.  హోళి వెనుక చాలా కథలున్నాయ్! హోళీ పూర్ణిమను పలుచోట్ల కామ పున్నమి అని కూడా పిలుస్తారు. అంతే కాదు పౌర్ణమికి ముందురోజు కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ కామ దహనం వెనుక ఓ కథ ఉంది. తపస్సు చేసుకుంటున్న శివుడి మీద మన్మధ బాణాలు ప్రయోగిస్తాడు మన్మథుడు. దీనికి కోపం చెందిన శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేస్తాడు. తరువాత మన్మధుడి భార్య వేడుకోగా అతనికి పూర్వ రూపం ప్రసాదిస్తాడు. దీన్ని పురస్కరించుకుని వసంత మాసంలో వచ్చే పూర్ణిమను కామ పూర్ణిమగా జరుపుకుంటారు. మన్మధుడిని కాముడు అని పిలవడం అందరికీ తెలిసిందే.. హోళీ.. హోళిక.. హోళిక ఒక రాక్షసి. ఈమె హిరణ్యకశిపుడి చెల్లెలు. తన అన్నయ్య హిరణ్యకశిపుడు నరసింహ అవతారం చేతిలో మరణించినందుకు ప్రహ్లాదుని మీద ఎనలేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని మంటల్లోకి తోసింది. కానీ నారాయణుడి అభయం ఉన్న ప్రహ్లాదునికి ఏమి కాలేదు. హోళిక ఆ మంటల్లో దహనమైపోతుంది. చెడు మీద మంచి సాధించిన విజయం ఇదని, హోళిక చనిపోయిన సందర్భంగా హోళికా దహనం చేస్తారని చెబుతారు.  బాల కృష్ణుడు..   హోళి పండుగ రోజే.. బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసినట్టు చెబుతారు. అందుకే డోలాయాత్ర పేరుతో కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. కన్నయ్యతో పాటు రాధను కూడా జతగా ఉంచుతారు.  ఇక హోళిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా చేసుకుంటారు. హోళి అంటే ఉదయం నుండి రంగులు పట్టుకుని వీధులంతా  హంగామా చేయడమే మనకు తెలుసు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శ్రీకృష్ణుడి నివాసమైన మధురలో చాలా ప్రత్యేకంగా హోళి జరుగుతుంది.  ఇక్కడ హోళి పండుగ వీధుల్లో జరుపుకోవడం ఎక్కడా కనిపించదు. పూర్తిగా దేవాలయాల్లో మాత్రమే హోళి జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ దేవాలయాలకు బారులు తీరుతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తమతో కలిసి రంగులు చల్లుకుంటూ, హోళి ఆడతాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా బృందావనంలో హోళి సంబరాలు అంబరాన్నంటుతాయి. అంతే కాదు ఇక్కడి సంప్రదాయంలో భాగంలో ఆడవారు మగవారికి కర్రలతో కొడతారు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 16 రోజుల పాటు హోళి సంబరాలు జరుగుతాయి. ఆ ఇంద్రధనస్సు వచ్చి మధుర, బృందవనాలలో వాలిందా అన్నట్టు అక్కడ రంగుల మయం అందరినీ మాయ చేస్తుంది. ఫలితంగా హోళి పండుగ రోజు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు అదనపు పని పెడతారు, మరికొందరు తమలో ఉన్న ట్యాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇలా హోళి సందడి దేశమంతా వెల్లివిరుస్తుంది.                                       ◆నిశ్శబ్ద.
  రంగుల పండుగ అయిన హోలీ ఆనందంతో, నవ్వుతో అందరూ కలిసి మెలిసి ఉండే సమయం.  ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ఇష్టమైన పండుగ. రంగులు చల్లుకోోవడం, నీటి బుడగలు వదలడం,  ఉల్లాసంగా గడపడం పిల్లలు ఎంతో ఇష్టం.  అయితే హోలీ పండుగ సంతోషాన్నే కాదు  కొన్ని ప్రమాదాలను కూడా వెంటబెట్టుకుని వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే  చాలా ప్రమాదం.  హోలీని గుర్తుండిపోయేలా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  పిల్లల విషయంలో హోలీ నాడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన హోలీ.. హోలీని సురక్షితంగా జరుపుకోవడానికి ముఖ్యమైన అంశాలలో ఒకటి సహజ, మూలికా లేదా సేంద్రీయ రంగులను ఉపయోగించడం. రసాయన ఆధారిత సింథటిక్ రంగులు  విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మపు చికాకు లేదా అలెర్జీ రియాక్షన్స్ కు  కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  రంగుల వల్ల  హానికరమైన ప్రభావాలను నివారించడానికి తల్లిదండ్రులు పర్యావరణ అనుకూలమైన, విషరహిత రంగులను ఎంచుకోవాలి. ఆడుకోవడానికి బయటకు వెళ్లే ముందు, పిల్లల చర్మం,  జుట్టుపై కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌ను బాగా పూయడం వల్ల చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది చర్మంలోకి రంగు చొరబడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.  తరువాత రంగులను కడగడం సులభం చేస్తుంది. పిల్లలకు ఫుల్ హ్యాండ్స్   దుస్తులు,  పొడవాటి ప్యాంటులను వేయాలి.  ఇవి చర్మానికి రంగు అంటుకోకుండా,  సూర్యరశ్మి నుండి రక్షించడానికి  ప్రభావవంతమైన మార్గం. కళ్లకు  గాగుల్స్ అందించడంపెట్టడం  వల్ల ప్రమాదవశాత్తు రంగులు కళ్లలో చెందకుండా జాగ్రత్త పడవచ్చు. హోలీ వేడుకలు తరచుగా ఎండలో బయట జరుగుతాయి కాబట్టి నీరు త్రాగడం చాలా ముఖ్యం. వేడిలో ఆడటం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి తగినంత తాగునీటిని అందుబాటులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు విరామం తీసుకొని క్రమం తప్పకుండా నీరు త్రాగమని చెప్పాలి. దీని వల్ల వారు ఉత్సాహంగా,  చురుగ్గా ఉంటారు. పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. తల్లిదండ్రులు,  సంరక్షకులు,  బంధువులు ఇలా ఎవరో ఒకరు వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రంగులు చల్లుకోవడం, లిక్విడ్స్ చిమ్మడం వంటివి  ఒకరి ముఖంపై నేరుగా వేయడం సరికాదని పిల్లలకు చెప్పాలి. దీని వల్ల ప్రమాదాలను అరికట్టివచ్చు. హోలీ లో చేయకూడని పనులు.. రంగులు హోలీకి ప్రధానమైనవి అయినప్పటికీ, అన్ని రంగులు సురక్షితం కాదు. తల్లిదండ్రులు రసాయన ఆధారిత రంగులను ఖచ్చితంగా నివారించాలి, ఎందుకంటే వాటిలో దద్దుర్లు, కంటి చికాకు లేదా పిల్లలలో మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే హానికరమైన విషపదార్థాలు ఉంటాయి. నీటి ఆటల్లో జాగ్రత్త అవసరం. నీటి బుడగలు, అధిక శక్తితో పనిచేసే నీటి పిస్టల్స్ శారీరక హాని కలిగిస్తాయి, ముఖ్యంగా కళ్ళు,  ముఖానికి వీటిని ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే అవి ఊహించని గాయాలకు దారితీయవచ్చు. పిల్లలు అసౌకర్యంగా ఉన్నప్పుడు హోలీలో పాల్గొనమని బలవంతం చేయడం కూడా మానుకోవాలి. రంగులు,  నీటి ఆటలతో ఒక్కొక్కరు ఒకో విధంగా రెస్పాండ్ అవుతారు.  పిల్లల ఇష్టాన్ని గౌరవించడం ముఖ్యం.   హోలీ సమయంలో పల్లం గా ఉన్న ప్రాంతాలు   ప్రమాదాన్ని కలిగిస్తాయి. తడి నేలలు,  నీటితో తడిసిన  వాతావరణం వల్ల  పడిపోవడం,  గాయాలకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు పిల్లలు సురక్షితమైన, పొడి ప్రదేశాలలో ఆడుకునేలా చూసుకోవాలి,  తడి ఉపరితలాలపై పరిగెత్తకుండా ఉండాలి. పొడి రంగులను పీల్చడం వల్ల మరో ఆరోగ్య ప్రమాదం తలెత్తుతుంది. పెద్ద మొత్తంలో పొడిని విసిరినప్పుడు, సూక్ష్మ కణాలు పీల్చబడతాయి. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది, ముఖ్యంగా ఆస్తమా లేదా అలెర్జీలు ఉన్న పిల్లలకు ప్రమాదం. తల్లిదండ్రులు పిల్లలకు ముక్కు,  నోరు ప్రాంతాల మీద రంగులు వేయకూడదని చెప్పాలి. పిల్లలను ఎప్పుడూ ఎవరూ పట్టించుకోకుండా వదిలివేయకూడదు. ముఖ్యంగా టబ్‌లు, ట్యాంకులు లేదా పెద్ద సమూహాలు వంటి నీటి వనరుల దగ్గర. సరైన పర్యవేక్షణ నిర్వహించకపోతే ప్రమాదవశాత్తు జారిపడటం, పడిపోవడం లేదా మునిగిపోవడం వంటి సంఘటనలు సంభవించవచ్చు. పిల్లలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచడం వల్ల సురక్షితమైన,  భద్రమైన హోలీ అనుభవాన్ని పిల్లలు పొందగలుగుతారు.                                       *రూపశ్రీ
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
    హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి,  స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు.  రంగులు చల్లుకుంటూ  పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట.  ఇది మన మానసిక స్థితి,  శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి,  ఆశావాదం కలుగుతాయి.  హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా  శారీరక, మానసిక,  భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి.  హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి?   కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక,  శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు,  లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది.  మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి.   కలర్ థెరపీ  ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని,  ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం,  దూకుడును కూడా పెంచుతుంది.  కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి.   పసుపు రంగు పసుపు అనేది సానుకూలత,  తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం,  సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది,  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ,  ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.   ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి,  సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె,  ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం,  శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు,  అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.  టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.   కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు.  ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి.  దుస్తులు,  వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్,  అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి.                                                       *రూపశ్రీ.  
    హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే  ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం,  స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం  ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం ,  ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.  అయితే సింథటిక్ రంగులు,   ఆస్తమా,  శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం,  తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి  కారణాలకు దారి తీయవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే.. కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు,  హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి,  కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.  పొడి రంగులలో లేదా గులాల్‌లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కంటి వైద్యులు ఏం చెప్తున్నారు.. హోలీ సమయంలో,  తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు  కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు,  మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ,  మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు,  అలెర్జీలకు కారణమవుతాయి. హోలీ తర్వాత  కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి? హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే  కళ్ళకు ఉపశమనం కలిగించడానికి  సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి,  చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్‌ను చేయాలి.  కళ్ళను శుభ్రపరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి.  తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి. వెంటనే కళ్లు  చల్లగా కావడం కోసం  మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి.        *రూపశ్రీ.