క్రికెట్... ఓడిపోయిన ఇండియా

 

ప్రపంచ కప్ క్రికెట్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లూ చకచకా గెలిచి సెమీ ఫెనల్‌కి చేరుకున్న ఇండియా... సెమీ ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ తింది. సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. మొదట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాని ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడి చేయడంతో 328 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆట ప్రారంభం నుంచే పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. వికెట్లు వరసగా రాలిపోతూ వుండటంతో బ్యాట్స్‌మన్ తమ వికెట్ పడిపోకుండా చూసుకోవడంతోనే పుణ్యకాలం పూర్తయింది. ఆస్ట్రేలియా క్రీడాకారులు బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి భారత్‌ బ్యాట్స్‌మన్‌ని కట్టడి చేశారు. చివరికి ఇండియా ముక్కీ మూలిగీ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయి ఓడిపోయింది. దాంతో ఇండియా టీమ్ ఇంటికి, ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్‌కి...