రెండోసారి సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం..

 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా 42 మందితో మమతా కెబినెట్ ఏర్పాటవ్వగా.. అందులో 17 మంది కొత్త ఎమ్మెల్యేలకు స్థానం దక్కింది. కాగా కోల్ కాతాలోని రెడ్ రోడ్ లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.