వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస ఆధిక్యత

 

ఇవ్వాళ ఉదయం 8 గంటలకు వరంగల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి రెండు రౌండ్ల లెక్కింపు తరువాత తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ 1,06,640 ఓట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. తెరాస తరువాత స్థానంలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. మొదటి రెండు రౌండ్లలో వైకాపా అసలు కనబడనే లేదు.