టీ సర్కార్ కు కేంద్రం ఝలక్.. ఏపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి

 

రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలలో విభేధాలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ శాఖలకు సంబంధించి.. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల రిలీవింగ్ గురించి గొడవలు పడుతూనే ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరోపక్క ఏపీ ప్రభుత్వం దీనికి నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉద్యోగులు విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని లేదా.. ఉమ్మడిగా ఇరు రాష్ట్ర ఇంధన సంస్థలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది మార్చి 20న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో ఇరు రాష్ర్టాల విద్యుత్ సంస్ధలు సమావేశమయ్యి ఒప్పందం చేసుకున్న మేరకు విభజన ప్రక్రియ జరగాల్సిఉంది. అంతేకాని తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా తనకు ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని తెలిపింది.

 

ఇప్పుడు ఐ.వై.ఆర్‌.కృష్ణారావు రాసిన లేఖకు కేంద్రం కూడా మద్ధతు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ టీ సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరికాదని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపునినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గతంలో అన్నా దానికి సంబంధించిన వార్తలు ఇప్పడు వినిపించడంలేదు. కాగా ఈ నెల 31న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇరు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, ట్రాన్స్‌కో సీఎండీలు సమావేశం కావాల్సి ఉంది.