ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.. కేసీఆర్

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని వారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, అలాంటి వారికోసం ఎంతటి కష్టానైనా భరిస్తానని అన్నారు. అంతేకాక ఆయన చేపట్టిన, చేపట్టబోయే పలు అంశాల గురించి సభాపూర్వకంగా తెలియజేశారు.

* సంక్షేమ పథకాల కోసం 28 వేల కోట్లు

* మిషన్ కాకతీయ పథకం ద్వారా 46వేల చెరువులు బాగు చేస్తాం

* హరితహారం కింద 300 కోట్ల మొక్కలు నాటుతాం

* వచ్చేనెల జులైలో 25వేల ఉద్యోగాలకు ప్రకటనల జారీ

* 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడతాం

* 50 వేల డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం * ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్

* రూ.91వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టలతో 2018 నాటికి రాష్ట్రంలో నిరంతర విద్యుత్

* అంగన్ వాడీ ఉద్యోగులకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం

* మహిళల భద్రతకోసం షీ టీమ్స్ ఏర్పాటుచేశాం * రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ

* రూ. 20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం