ఫొటోలు వేయొద్దనడం సరికాదు... కేంద్రం
posted on Oct 29, 2015 11:29AM
ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో ముఖ్యమంత్రులు లేదా మంత్రుల ఫొటోలు వేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రకటనల్లో వేయొద్దని చెప్పడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకు తెలిపిన కేంద్రం... ఈ మేరకు అటార్జీ జనరల్ తో అఫిడవిట్ దాఖలు చేయించింది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని, అలాంటప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలను వాడొద్దనడం సరికాదని అటార్జీ జనరల్ ధర్మాసనానికి నివేదించారు, ఓ ఎన్జీవో సంస్థ వేసిన పిల్ ను విచారించిన సుప్రీం... ప్రభుత్వ ప్రకటనల్లో ప్రభుత్వాధినేతల ఫొటోలు వేయొద్దని ఆదేశించింది, అయితే ఇప్పుడు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది