కొడాలి నాని గుండా గిరీ...ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి!

గుడివాడ మండలంలో ఇసుక మాఫియా వీరంగం సృష్టించింది. ఏకంగా ఆర్ఐ మీదే దాడికి యత్నించింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆర్ఐ ప్రాణాలతో బైటపడ్డారు. వైకాపా దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా గుడివాడ అంటే అక్కడ వైకాపా మాజీ మంత్రి కొడాలి నానిదే హవా!

వాస్తవానికి ఆర్ఐపై దాడి చేసినది నానీ గ్యాంగేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. సంఘటన జరిగిన తీరును బట్టి అధికార పార్టీ దన్ను లేకుండా ఈ దాడి జరిగే అవకాశమే లేదని అంటున్నారు. 
ఇంతకీ అసలేం జరిగిందంటే... 
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ ఇసుక మాఫియా  రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు  ఆర్ఐ అరవింద్ అక్కడకు ఇద్దరు సిబ్బందిలో  వెళ్లారు. అక్రమ ఇసుక తరలింపును, తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మాఫియాదారులు ఆర్‌ఐను అడ్డుకోవటమే కాకుండా దాడికి దిగారు. ఏకంగా జేసీబీతో తొక్కించే ప్రయత్నం చేశారు. జేసీబీతో పక్కకు నెట్టివేశారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో మాఫీయా గ్యాంగ్ పలాయనం చిత్తగించింది. ఈ దాడిపై  ఆర్ఐ  అక్రమ ఇసుక తవ్వకాలను  ను అడ్డుకొనేందుకు ఇద్దరు సిబ్బందితో తాను వెళ్లానని,  తనపై  పలువురు   దాడికి దిగారని, జేసీబీపీ  జేసీబీతో నెట్టివేసే ప్రయత్నం చేశారన్నారు.   ఆర్ఐపై దాడికి  పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఇక తెలుగుదేశం ముఖ్యమంత్రి అండతోనే  ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని ఆరోపణలు చేస్తున్నారు. కొడాలి నాని ప్రత్యక్ష ప్రమేయంతోనే మాఫియా గుడివాడ మండలంలో రెచ్చిపోతున్నదన్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పశువుల కొట్టంలో కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్న కొడాలి చేస్తున్నది ఇసుక అక్రమ దందాయేనని విమర్శిస్తున్నాయి. కాగా ఆర్ఐపై దాడి జరిగిన స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. వైకాపా అండతోనే, వారి దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, అధికారులపై దాడులకు సైతం వెరవడం లేదని ఆరోపించారు.   ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

గత నెళ్లాళ్లుగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోలేదనీ, కొడాలి నాని, ఆయన అనుచరుల అరాచకాలకు హద్దు, అడ్డు, అదుపూ లేకుండా పోయిందనీ, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది.