ఆ వార్తల్లో నిజం లేదు... సచిన్

 

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, షాహిద్ కపూర్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతుందనే వార్త మీడియాలో హల్ చల్ చేసింది. అయిత్ ఆ వార్తని సచిన్ టెండూల్కర్ ఖండించారు. సారా ఇంకా విద్యార్ధి దశలోనే ఉంది, ఆమె తన విద్యార్ధి జీవితాన్ని ఆనందిస్తోంది, చక్కగా చదువుకుంటోంది అని అన్నారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఆమె సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలు ఏమీ చేయట్లేదని, ఆ వార్తలన్నీ నిరాధారాలే అని కొట్టిపడేశారు.