సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం పోటీసులు జారీ చేసింది. ఏపీలో  అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో  అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.  

ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.  ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై  జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 1) విచారించింది. ఈ సందర్భంగా సంజయ్ బెయిలు రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కూంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది.