‘రేయ్’ షార్ట్ రివ్యూ
posted on Mar 27, 2015 6:37PM
తారాగణం: సాయి ధరమ్ తేజ్, శ్రద్ధ దాస్, సయామీ ఖేర్. సాంకేతిక వర్గం:
సంగీతం: చక్రి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం : వైవిఎస్ చౌదరి.
రెండేళ్ళకు పైగా షూటింగ్ జరుపుకుని తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన ‘రేయ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. సినిమాలను రిచ్‌గా తీస్తాడన్న పేరున్న వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా అయినప్పటికీ రెండో సినిమాగా విడుదలైంది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
అమెరికాలో పాప్ సింగర్‌గా వున్న జెన్నీ (శ్రద్ధాదాస్) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం కోసం ఎంత పని చేయడానికైనా వెనుకాడదు. హీరోయిన్ అన్న కూడా ఆమె కారణంగానే చనిపోతాడు. అలాంటి డేంజరస్ లేడీని కథానాయకుడు ఎలా ఓడించాడన్నదే ఈ సినిమా కథాంశం.
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి ప్లస్ మార్కులు పొందిన సాయి ధరమ్ తేజ్ డాన్సులు, రిస్కీ ఫైట్లు ఈజీగా చేసేశాడు. నటన పరంగా కూడా ఓకే అనిపించాడు. పాప్ సింగర్ కమ్ లేడీ విలన్‌గా శ్రద్ధాదాస్ మెప్పించింది. ఇక హీరోయిన్ సయామీ ఖేర్ అందాలను బాగానే ఆరబోసింది.
గుణశేఖరన్ కెమెరా పనితనం ప్రశంసనీయంగా వుంది. దానికితోడు అందమైన లొకేషన్లు కూడా సినిమాలో ఆకట్టుకుంటాయి. అయితే అంతా వున్నా ఐదోతనమే లేకపోవడమే ఇబ్బంది కలిగిస్తుంది. అంతా బాగుందిగానీ, సినిమాలో కథే బాగాలేదు. సినిమాలో ముందు ముందు ఏం జరగబోతోందో ఎల్కేజీ చదువుతున్న పిల్లలు కూడా చెప్పగలిగేలా వుంది. కొన్నచోట్ల బోర్, మరికొన్ని చోట్ల స్లో.. కథ ఇలా బాగా సా....గుతుంది.