ట్విట్టర్ లో రాహుల్

 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ నెట్ వర్క్ ద్వారా రాహుల్ యువతకు చేరువకావాలని సూచించిన విషయం తెలిసిందే. దానిని రాహుల్ గాంధీ సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు. దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. అధికారిక ఖాతాగా ట్విట్టర్ దానిని ధ్రువీకరించింది. రాహుల్ ట్విట్టర్ ఖాతా తెరిచిన గంటకే 20 వేల మంది ఫాలోవర్లు చేరిపోయారు. ఈ యువనేత ట్విట్టర్ ద్వారా ఎంతమంది యువతకు చేరువవుతారో చూద్దాం.