రాజకీయం చేయెద్దు... వెంకయ్యనాయుడు
posted on May 7, 2015 3:58PM
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ వ్యవహారంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం అన్న అంశం చాలా కీలకమైనదని కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించినట్టయితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని, ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని అడిగే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని... పార్టీలకు లేదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజం చట్టంలో పేర్కొన్న హామీలన్నింటిని అమలు చేస్తామని, ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక లోటు ఎలా భర్తీ చేయాలన్న విషయం పై హోంశాఖతో చర్చిస్తున్నామని అన్నారు. అలాగే హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.