ఢిల్లీ గల్లీల్లో రాహుల్‌గాంధీ లొల్లి...
posted on Nov 28, 2014 11:34AM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన మాటలు విని జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్‌లో కామెడీగా వున్నాయి. రాజధాని ఢిల్లీలోని రంగ్‌పురి పహాడీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్ళను కూలగొట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు ఎదురు తిరగడంతో అక్కడ ఇళ్ళ కూల్చివేత కార్యక్రమానికి బ్రేకులు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇళ్ళను కూల్చివేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడూ మరోసారి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎవరో పిలిచినట్టు ఠాయ్‌మంటూ రంగంలోకి దిగాడు. తానేదో పేద ప్రజలకు అండగా నిలిచి ఉద్ధరించటానికే పుట్టినట్టుగా బిల్డప్పు ఇచ్చాడు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇళ్ళను కూలగొట్టదల్చుకుంటే ముందుగా తనమీద నుంచి బుల్డోజర్లను నడిపించాలని మాస్ సినిమా డైలాగ్ కొట్టాడు. ఆ సమయంలో రాహుల్ బాబు వెంట వున్న కాంగ్రెస్ జనం చప్పట్లు కొట్టారు. రాహుల్ గాంధీ.. నువ్వు మారవుగాక మారవ్.. అంతే...