డిశంబర్ నుంచి డిల్లీ-శాన్ ఫ్రానిస్కో ల మధ్య డైరెక్ట్ ఫ్లయిట్స్

 

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం కాలిఫోర్నియాలోని శాన్ హెసేస్ సాప్ సెంటర్లో ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ డిల్లీ నుంచి శాన్ ఫ్రానిస్కోకి నేరుగా విమానసేవలు (డైరెక్ట్ ఫ్లయిట్) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి వారానికి మూడుసార్లు డిల్లీ- శాన్ ఫ్రానిస్కోల మధ్య నేరుగా ఎయిర్ ఇండియా విమాన సేవలు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.