లోయలో బస్సు... 21 మంది మృతి

 

పెరులోని అయాకుచో ప్రావిన్స్‌లో గల ఆండిస్ పర్వతాల సమీపంలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా, 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పెరులో ఇటీవలి కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మూడు బస్సులు, ఒక ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 38 మంది మరణించగా, 84 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొడపగానిపల్లి వద్ద ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది గాయపడ్డారు. కర్నాటకలోని నల్లపరెడ్డిపల్లికి చెందిన తీర్థయాత్రికులు మంత్రాలయం సందర్శన పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.