కొనసాగుతున్న ఉగ్రవేట.. ఐసిస్ ను నాశనం చేస్తాం.. ఒబామా

బెల్జియం, పారిస్ దాడుల సూత్తధారి కోసం ఉగ్రవేట కొనసాగుతోంది. పారిస్ దాడుల తరువాత సూత్రధారి అబ్దేస్లామ్ బెల్జియం వచ్చినట్టు పోలీసులు తెలుపుతున్నారు. బెల్లిజం.. బ్రసెన్స్ లో అబ్దేస్లామ్ ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి  పోలీసులు ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు.


కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఐసిస్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను భయపెట్టేందుకే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల ఆర్ధిక మూలాలను ధ్వంసం చేస్తామని..ఐసిస్ ను నాశనం చేస్తామని అన్నారు. తమతో పెట్టుకుంటే భూమిపైనే లేకుండా చేస్తామని.. తమతో పోరాడలేకే పార్కులు, హోటల్స్, ఆలయాలు, రైల్వే స్టేషన్లపై ఐఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ.. తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.కాగా ఉగ్రవాదులు పారిస్ పై దాడులు జరిపినట్టే ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలెండ్ ను.. ఒబామాను చంపేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.