ప్రధాని మోడీ థాయ్ ల్యాండ్ పర్యటన
posted on Apr 3, 2025 11:16AM

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు. వీరి మధ్య ద్వేపాక్షిక సంభంధాల మెరుగుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోడీ బెమ్ టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరుగుతాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి థాయ్ ల్యాండ్ సీఎం పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య హాజరుకానున్నారు. 2 018లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ పద్ధతిన జరిగింది.