కెనడా పార్లమెంట్‌పై కాల్పులు

 

అమెరికా పక్కనే వున్న కెనడా రాజధాని అట్టావాలోని పార్లమెంట్ సమీపంలో బుధవారం ఓ ఆగంతుకుడు ఆ దేశ సైనికుడిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత సదరు దుండగుడు పార్లమెంట్ భవన సముదాయం వైపు చొచ్చుకెళ్లాడు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాంతో పార్లమెంట్‌ను మూసివేశారు. కెనడా దేశం పార్లమెంటు ఆవరణలో దుండగులు జరిపిన కాల్పులను అమెరికా అధినేత బారక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిఘా వర్గాల నుంచి ఆయన సేకరించారు. ఇలాంటి దాడులకు అమెరికా వ్యతిరేకమని ఒబామా తెలిపారు. కెనడా పార్లమెంటుపై కొందరు దుండగులు జరిపిన దాడుల్లో ఒక సైనికుడు మరణించగా మరో సైనికుడు గాయపడ్డాడు.