దయ్యమైన నిర్భయ రేపిస్ట్?

 

నిర్భయ కేసులో ఆరు మంది నిందితులలో నలుగురికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. దోషుల్లో ఒకడైన రాంసింగ్ కేసు విచారణ సమయంలోనే తీహార్ బైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకనుకుంటాన్నారా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సంగతేంటంటే రాంసింగ్ అతని సోదరుడు ముఖేష్ లు నేరానికి పాల్పడిన తరువాత వారి కుటుంబం ఢిల్లీ నుండి సొంత ఊరైన రాజస్థాన్ కు వెళ్లింది. అయితే ఢిల్లీలో రాంసింగ్ ఉన్న ఇల్లు రెండు సంవత్సరాలుగా తాళం వేసి ఖాళీగా ఉంటోంది. ఆత్మహత్యకు పాల్పడిన రాంసింగ్ దెయ్యంగా మారాడని, ఆ ఇంట్లోనే రాంసింగ్ ఆత్మతిరుగుతోందని, చుట్టుపక్కల వాళ్లు నమ్ముతున్నారు. గల్లీల్లో ఆడుకునే పిల్లలెవ్వర్నీ ఆ ఇంటివైపు వెళ్లొద్దని తల్లులందరూ చెప్తున్నారు. 'రాంసింగ్ దెయ్యంగా మారాడని అందరూ అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా నేను నమ్మినా, నమ్మకున్నా పిల్లల్ని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి ఆ ఇంటివైపు వెళ్లొద్దని చెప్తున్నాను' అని స్థానిక మహిళ ఒకరు తన అభిప్రాయాన్ని తెలిపారు.