ఎన్టీఆర్ జయంతి.. ఘనంగా నివాళులు


టీడీపీ మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు.  పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వేదిక మీదే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలయ్య, పార్టీ నేతలు నివాళి అర్పించారు.

 

మరోవైపు నేటి ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రాం, తారకరత్న, లక్ష్మీపార్వతి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి వేర్వేరుగా ఆయనకు నివాళి అర్పించారు. బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు.