‘ఆప్’కి మేధా పాట్కర్ రాజీనామా

 

ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో అఖండ మెజారిటీతో అధికారం అయితే దక్కిందిగానీ, ఆ పార్టీ నాయకులకు, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కి మనశ్శాంతి మాత్రం లేకుండా పోయింది. మొన్నటి వరకూ తీవ్ర ఆనారోగ్యంతో బాదపడిన కేజ్రీవాల్ ప్రకృతి వైద్యం చేయించుకుని శారీరకంగా స్థిమితపడినా, పార్టీలోని లుకలుకలు ఆయన్ను మానసికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. శనివారం నాడు పార్టీ నాయకులందరూ సమావేశమై పార్టీలో కీలక పాత్రని పోషించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుంచి తరిమేశారు. పార్టీకి ఎంతో సేవ చేసిన ఈ ఇద్దరినీ గెంటేయడం పట్ల వారి మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే పార్టీలో కీలక వ్యక్తిగా వున్న ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఇది పార్టీకి పెద్ద షాకే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడు పార్టీకి టాటా చెప్పేశారు. మేధా పాట్కర్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి డిపాజిట్ కూడా కోల్పోయారు.