మహేష్ కొత్త మూవీ టైటిల్ ‘మగాడు’ కాదట.
posted on Oct 6, 2014 10:43PM
మహేష్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం చిత్రం పేరు ‘మగాడు’ అని పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి ‘మగాడు’ అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు చెబుతున్నారు. ‘‘మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ నిర్ణయించిన తర్వాత అధికారికంగా మేమే ప్రకటిస్తాం. మా సంస్థలో మొదటి చిత్రమే సూపర్‌స్టార్ మహేష్‌గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాం’’ అని చిత్ర నిర్మాతలు చెప్పారు.