పల్గాన్‌లో అగ్నిప్రమాదం.. 18 మంది జవాన్లు, ఇద్దరు అధికారులు మృతి
posted on May 31, 2016 10:12AM
మహారాష్ట్ర పల్గాన్ లోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందగా.. 19 మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. చనిపోయిన 20 మందిలో 18 మంది జవాన్లు ఉండగా ఇద్దరు అధికారులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అంతేకాదు మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హుటాహుటిన మహారాష్ట్రలోని పల్గాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఆర్మీఆయుధ కార్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో విషయం తెలుసుకున్న పారికర్ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు.