బీజేపీ మీద పవర్ స్టార్ సంచలన ట్వీట్లు....

 

పవర్‌స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అంటూ నినదించి గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారాయన. పవన్ కళ్యాణ్‌కి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గర ప్రత్యేక గౌరవం వుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యేక హోదా గురించిన చర్చ బాగా నలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, భారతీయ జనతా పార్టీ తన మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హర్షించదగ్గ పరిణామం. పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా భారతీయ జనతాపార్టీ తన మాట మీద నిలబడుతుందని, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆశిద్దాం.