అమ్మ సీఎం కావాలని శిలువ ఎక్కాడు....
posted on Feb 23, 2015 3:59PM

తమిళనాడులో ఒక యువకుడు అమ్మ కోసం తనను తాను శిలువ వేసుకున్నాడు. శిలువ మీద తన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మేకులు కొడుతుంటే ఆర్తిగా ‘‘అమ్మా... అమ్మా’’ అని అరిచాడు.. అమ్మ కోసం శిలువ వేసుకున్న ఇలాంటి బిడ్డని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుంటున్నారు కదూ! కానీ నిజానికి వీడిని కన్న తల్లి దురదృష్టవంతురాలు.. ఈ సన్నాసి శిలువ వేసుకుంది తనను నవమాసాలు మోసి, కని, పెంచిన కన్నతల్లి కోసం కాదు... పొలిటికల్ అమ్మ జయలలిత కోసం. జయలలితను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడుకు చెందిన హిహాన్ హుస్సేన్ అనే ఒక ‘బిడ్డ’ తనకు తాను శిలువ వేసుకున్నాడు. పురచ్చి తలైవి జయలలిత ముఖ్యమంత్రి కాకపోతే తమిళనాడుకు భవిష్యత్తే లేదని నినాదాలుచేశాడు. ఈ సీనంతా చూస్తున్నవారు కూడా పూనకం వచ్చినట్టుగా జయలలితకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒరేయ్ మూర్ఖ శిఖామణులారా... మీరంతా మీ కన్నతల్లి కోసం ఏం చేసి చచ్చార్రా.. మీరేమైనా జయలలిత కడుపున పుట్టారంట్రా? మీరంతా ‘అమ్మా’ అని రంకెలు వేస్తున్న జయలలిత కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినందుకు శిక్ష పడినందువల్ల ముఖ్యమంత్రి పదవిని వదిలేయాల్సి వచ్చింది. ఇక ఆమెకు జన్మలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. మీరు శిలువలు వేసుకోవడం కాదు.. నిప్పుల్లో దూకినా ఆమె ముఖ్యమంత్రి అవదు. అసలు పరిస్థితేంటో అర్థం చేసుకోకుండా శిలువ వేసుకునేంత మూర్ఖులు అభిమానులుగా ఉన్నారు కాబట్టే, జయలలిత లాంటి అవినీతిపరురాలు అధికారం చెలాయించారు. అయినా మాకెందుకు.. మీ ఇష్టమొచ్చినట్టు ఏడవండి!