హైదరాబాద్ కు ఉగ్ర ముప్పు, ఐబీ వార్నింగ్

భారత్ లో టెర్రర్ అటాక్ జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది, ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. ఐఎస్ఐ శిక్షణ పొందిన 20మంది ఉగ్రవాదులు...భారత్ లోకి ప్రవేశించారని, వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటలిజెన్స్ ప్రకటించింది, ఐసిస్ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఐబీ సూచించింది.