తెలంగాణ అసైన్డ్ భూములపై సభాసంఘం

 

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి పరిశ్రమల ఏర్పాటు కోసమంటూ తక్కువ ధరకు భూములు తీసుకున్నారని, అయితే వాటిలో ఇంతవరకు పరిశ్రమలను ఏర్పాటు చేయాలేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ఆరోపించారు. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. అలాగే పొన్నాల దళితుల నుంచి అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని, అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం, విక్రయించడం చట్ట విరుద్ధమని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అసైన్డ్, వక్ఫ్, భూదాన, దేవాలయ తదితర భూముల పరిస్థితిని తెలుసుకోవడానికి  ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.