పాపం.. ఫిల్ హ్యూగ్స్.. నోమోర్
posted on Nov 26, 2014 2:48PM

ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ (25) మరణించాడు. క్రికెట్ బంతి తగలి కోమాలోకి వెళ్ళిపోయిన హ్యూగ్స్ గురువారం మరణించాడు. హ్యూగ్స్ సిడ్నీ స్టేడియంలో ఒక స్థానిక క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బౌన్స్ అయి హెల్మెట్‌లోనుంచి దూసుకు వెళ్ళి అతని తలకి తగిలింది. దాంతో హ్యూగ్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. బంతి తగిలిన కారణంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. గాయం తగిలినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే వుంది. బంతి తగిలిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను తక్షణం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫిల్ హ్యూగ్స్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు.