అమ్మాయి రూమ్‌కి వస్తానందా...? అయితే జాగ్రత్త
posted on Jun 28, 2017 2:49PM
.jpg)
ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు డబ్బు సంపాదించడానికి కొత్త రూట్లను ఉపయోగిస్తున్నారు. ఏం చేసైనా సరే..వీరి టార్గెట్ డబ్బు గుంజడమే. కుర్రాళ్లపై చూపుల బాణాలు విసరడం..వాళ్లు కనెక్టయ్యాక జేబు గుల్లచేయడం బాగా ఎక్కువైంది. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడికి..ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయమైంది. అటు పక్క అమ్మాయి కూడా ప్రేమగా పలకరించింది..మెల్లిగా మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ప్రతీ రోజు ఫోన్‌లో మాట్లాడుకోవడం..ఛాటింగ్ అబ్బో ఆ సాన్నిహిత్యం ...ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు..ఒక రోజు నీ రూమ్‌కి వస్తాను..సరదాగా గడుపుదాం అన్న ఆ అమ్మాయి మాటకి..అదృష్టం తలుపు తట్టిందని ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. అనుకున్నట్లుగానే అమ్మాయి యువకుడి రూమ్‌కి వచ్చింది..వస్తూ తన కూడా మద్యం బాటిల్స్ తెచ్చింది. కుర్రాడిని పీకలదాకా తాగించి మత్తులో ముంచింది..అతను నిద్రలోకి జారుకున్నాక ఐ ఫోన్, రూ.12 వేలు, మోటార్ సైకిల్‌తో ఉడాయించింది. తెల్లారి బద్ధకంగా లేచిన ఆ కుర్రాడికి విషయం అర్థమై దెబ్బకి మత్తు వదిలింది..వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన వారు సీసీటీవీ ఫుటేజ్, దొంగిలించిన ఐ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ మాయలేడి ఆచూకీ గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి చదివిన ఆ యువతి..ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మందిని ఇలాగే బొల్తా కొట్టించిందట.