మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో విచారణ

 

మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మెట్రో ట్రైన్లలో నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. 

న్యాయవాది నాగూర్‌ బాబు ఈ పిల్​ను వేశారు. అనంతరం న్యాయస్థానంలో ఆయన తన వాదనలు వినిపించారు. ‘బెట్టింగ్‌ యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ అడ్వర్టైజ్​మెంట్స్​పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించలేదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu