తెల్లతోలు వల్లే సోనియాగాంధీకి అందలం
posted on Apr 1, 2015 3:27PM
తెల్లతోలు వుండటం వల్లే సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాగలిగారని, అదేగనుక రాజీవ్‌గాంధీ ఏ నైజీరియా అమ్మాయినో పెళ్ళి చేసుకుని వుంటే పరిస్థితి వేరేగా వుండేదని కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్సెట్కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గిరిరాజ్ సింగ్ తక్షణం సోనియాకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదిలా వుంటే గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ‘నల్లతోలు’ మీద కామెంట్ చేశారు. ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నర్సులు ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్ళారు. ఈ సందర్భంగా పర్సేకర్ నర్సులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎండలో ఉద్యమాలు చేస్తే నల్లబడిపోతారని, అలా నల్లబడ్డారంటే మీకు పెళ్ళిళ్ళు కావని అన్నారు. ఈ వ్యాఖ్యాలను నర్సులు తీవ్రంగా ఖండిస్తున్నారు.