ఈసారి వికెట్ ధర్మాన...
posted on Aug 25, 2016 4:55PM
పుష్కరాల జరుగుతున్న కారణంగా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పార్టీ ఫిరాయింపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. పుష్కరాల మైలేజ్ ను కూడా వాడుకోవచ్చన కాన్సెప్ట్ కూడా ఇన్నీ రోజులు ఆ ఊసే ఎత్తలేదు నేతలు. ఇక ఎలాగూ పుష్కరాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. అయితే తాజాగా పడుతున్న వికెట్ ధర్మాన ప్రసాదరావు అని తెలుస్తోంది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవేంటంటే.. జగన్ కడపలో అయితేనే నెగ్గగలడు, శ్రీకాకుళంలో అయితే ఆయన కూడా నెగ్గలేడు.. నేను గనుక తెలుగుదేశం తరపున పోటీ చేసి ఉంటే.. ఎమ్మెల్యేగా నెగ్గే వాడిని అని ధర్మాన చెప్పుకొచ్చాడు. దీంతో ధర్మాన టీడీపీలో చేరడం ఖాయం అంటున్నారు. మరోవైపు ఎలాగూ జగన్ పెట్టుబడుల కేసుల్లో ఈయన నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆయనపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కారణం చేత అయినా ఆయన అధికార పార్టీ అయిన టీడీపీలోకి వెళ్లే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు. మరి చూద్దాం.. కేసులు ఉన్నాకానీ టీడీపీ పార్టీలోకి చేర్చుకుంటుందో.. లేదో..