రోశయ్య పదవీకాలం పొడిగింపు.. కారణం అదేనా..!


తానొవ్వక.. నొప్పించక అన్న సామెత సీనియర్ రాజకీయ నేత కొణిజేటి రోశయ్యకు బాగా నప్పుతుంది. ఎందుకంటే ఎవరిపై ఎక్కువ విమర్శలు చేయరు.. తాను కూడా ఎవరిపై ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చాలా ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తుంటారు. ఇలాంటి మంచి పేరు మూటగట్టుకోవడం వల్లే తమిళనాడు గవర్నర్ గా తన పదవి కాలం త్వరలో ముగియనున్నా కానీ... పదవీకాలం పొగిడించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇటీవలే నాలుగు రాష్ట్రాల గవర్నర్లను నియమించిన సంగతి తెలసిందే. అయితే మోడీ మార్చకుండా వదిలేసిన గవర్నరల్లో రోశయ్య ఒకరు. ఎందుకంటే మోడీ అధికారంలోకి రాకముందు నుండే రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు. దానికి తోడు ఎలాంటి వివాదాలు, అక్కర్లేని ప్రకటనలు చేయకుండా మంచి రిపోర్ట్ సొంతం చేసుకున్నారు.

 

ఇక రోశయ్య పదవికాలం పెంచమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితే స్వయంగా మోడీకి లేఖ రాశారు. ఒక్క జయలలితే కాదు పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఇదే చెబుతున్నారట. దీంతో రోశయ్య పదవీకాలం పొడిగింపు ఖాయమైనట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.