పడుకునే ముందు దీన్ని తాగితే...
posted on Jan 19, 2019 11:26AM
బరువు పెరగడం ఎంత తేలికో... తగ్గడం అంత కష్టం. అందుకే ఒబెసిటీ ఇప్పుడు పెద్ద సమస్య అయ్యి కూర్చుంది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోడానికి కూడా సమయంలోని జీవనశైలి, అంతకంతకూ ఎక్కువవుతోన్న ఒత్తిడి స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. పెరిగిన బరువుని తగ్గించుకోవడం తలకు మించిన పనైపోయింది. అలాంటివారికి ఓ చక్కని మార్గం చూపిస్తున్నారు నిపుణులు.
200 మి.లీ. నీటిని బాగా మరిగించాలి. ఇందులో అరచెంచా దాల్చినచెక్క పొడి కలిపి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత చెంచాడు తేనె కలిపి ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఈ పానీయాన్ని రోజూ పడుకోవడానికి అరగంట ముందు తాగితే మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు.
జిమ్ ల చుట్టూ తిరగడం, లైపోసక్షన్లంటూ రిస్కీ ఆపరేషన్లకు సిద్ధపడటం చేయకుండా... ఇంట్లోనే, అందుబాటులో ఉన్న వస్తువులతో చేసే ఈ డ్రింక్ ఒబెసిటీకి చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే దాల్చినచెక్క కొలెస్ట్రాల్ ను కరిగించేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి సహజసిద్ధమైన తేనె కలిస్తే మరింత మేలు జరుగుతుంది. ఈ రెండూ కలిసి బరువు తగ్గించకమే కాదు... రకరకాల బ్యాక్టీరియాలను మన దరిదాపుల్లోకి రాకుండా కూడా చేస్తాయి. కావాలంటే ట్రై చేసి చూడండి... మీకే తెలుస్తుంది.
-Sameera