మన్మోహన్ పై తగిన ఆధారాలు లేవు..
posted on Sep 29, 2015 1:10PM
యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం వ్యవహారంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కు కోర్టులో ఊరట లభించింది. ఈ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు..మధు కోడాల మీద కూడా కేసులు నమోదయ్యాయి. అయతే సీబీఐ మన్మోహన్ సింగ్ ను విచారించవలసిన నేపథ్యంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీనిపై కోడా ఈ కుంభకోణం వ్యవహారంలో మన్మోహన్ సింగ్ ను కూడా ప్రశ్నించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపగా సిబిఐ తరపు న్యాయవాది ఆర్ ఎస్ చీమా మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు గనుల కేటాయింపులో కుట్రకు పాల్పడినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. మధు కోడా కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు. కాగా గతంలో కూడా దాసరి బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.