వారి తాట తీస్తాం..చంద్రబాబు
posted on Dec 14, 2015 12:05PM
కాల్ మనీ దందాపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు.కాల్ మనీ వద్ద అప్పులు తీసుకున్న బాధితులు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించవద్దని సూచించారు.కాల్ మనీ దందా పేరుతే అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి పనలకు పాల్పడేవారిని ప్రాథమిక దశలోనే అణచివేయాలని..తప్పుడు పనులు చేసేవారు భయపడేలా విద్రోహ చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అవినీతిపరలను ఎట్టిపరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు..కాల్ మనీ నిందితులు ఇప్పటికైనా బాధితులను వేధించడం ఆపకపోతే నిర్భయ చట్టం కింది కేసులు పెడతామని అన్నారు.అంతేకాదు కల్తీ మద్యం నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాల్ మనీ, కల్తీ మధ్యం ఘటనలు ఏపీ రాజధాని అమరావతి ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని అన్నారు.