చంద్రబాబు జపాన్ టూర్.. పలు కీలక ఒప్పందాలు

 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారన్నది అందరికి తెలిసిన వాస్తవమే. అసలే రాష్టం విడిపోయిన తరువాత ఆర్ధిక పరంగా కొంత లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి చాలా కృషి  చేస్తున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో సింగపూర్ పర్యటన కూడా చేశారు.. అక్కడ ఎంతో మంది ప్రముఖులు.. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలతో సమావేశమయి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కూడా తన వంతుగా ఏపీ అభివృద్దిలో పాటుపడటానికి గతంలో అమెరికా వెళ్లి అనేక మందిని ఏపీలో పెట్టు బడులు పెట్టడానికి ఒప్పించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఏపీలోకి పెట్టుబడిదారులను తీసుకురావడానికి జపాన్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అనేక ప్రముఖ సంస్థలతో భేటీ అయి ఏపీ లో కూడా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.

 


*
జేజీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మసియుకి సటోతో చంద్రబాబు బృందం భేటీ అయి పెట్రో కెమికల్‌ కారిడార్‌లో పెట్టుబడులు పట్టాలని కోరారు. అయితే జేజీసీ కార్పొరేషన్‌ రిఫైనరీ, క్రాకర్‌ యూనిట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలపై  ఆసక్తి కనబర్చింది.

* సుమిటొమో, మిత్సుబ్యాకింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీకి వచ్చి విశ్వవిద్యాలయాలతో కలిసి కన్సెల్‌టెన్సీ సంస్థలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.

* తోషిబా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. విద్యుత్‌ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.

* జపాన్‌ వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి యొసిజే టకజీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణంలో పాల్గొంటామని యొసిజే హామీ ఇచ్చారు.

* జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. అనంతరం వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ఉత్పత్తిలో పేరొందిన జేఎప్‌ఈ ఏపీలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది.

 

 
చివరిరోజు కొమమురా సంస్థ ప్రతినిధులను ఏపీ సీఎం చంద్రబాబు కలిసి చర్చించారు. కెమెరాలు, లెన్స్‌లు, ఆప్టిక్స్‌ కంపెనీగా పేరొందిన కొమమురా కంపెనీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చే సుకోవాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జపాన్ పర్యటనలో ఈ రోజు చివరిరోజు కాబట్టి పర్యటన అనంతరం చంద్రబాబు బృందం ఢిల్లీ బయలుదేరనుంది.