చోటా రాజన్ హత్య.. నలుగురు కిల్లర్లు అరెస్ట్..
posted on Jun 10, 2016 11:58AM
మాఫియా డాన్ చోటా రాజన్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే నలుగురు కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్ ను చంపడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు.. ఈనేపథ్యంలో అతని ప్రధాన అనుచరుడు చోటా షకిల్ ను ఏర్పాటు చేయగా.. ఆ ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆ తరువాత చోటా షకీల్ ఆదేశాలతో రాబిన్సన్, జునైద్, యూనస్, మనీష్ అనే నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రంగంలోకి దిగారు. షకీల్ ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఈ నలుగురు కిల్లర్లు అదను కోసం మాటు వేశారు. ప్లాన్లో భాగంగానే వారు ఫోన్ సంభాషణలు చేసుకునేవారు. ఈ ఫోన్ సంభాషణలను పట్టేసిన పోలీసులు నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను అరెస్ట్ చేశారు. ఓ పిస్టల్, కాట్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, వారిని చోటా రాజన్ ఉంటున్న తీహార్ జైలుకే తరలించారు.