హిందూ ఆశ్రమ ఉద్యోగి దారుణ హత్య..

 

బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై దాడులు, హత్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. రెండు రోజుల క్రితమే బంగ్లాదేశ్లో హిందూ పూజారిని దారుణంగా హత్య చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఉదయం ఒక హిందూ ఆశ్రమంలో పని చేసే నిత్యరంజన్ పాండే (60) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. నిత్య రంజన్ పాండే ఠాకూర్ అంకుల్ చంద్ర సత్సంగ పరమతీర్థ హిమేయత్ పుర్ధామ్ ఆశ్రమ ఉద్యోగి. ఈ హత్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని భావిస్తున్నారు.