బ్యాంకు మేనేజర్ హత్య

 

తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం ఓ బ్యాంకు మేనేజర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా తేటగుంట సమీపంలో ఎస్.తిమ్మాపురం సెంట్రల్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. హత్య చేసిన తరువాత ఆంజనేయులుకు సెక్యూరిటీ డ్రెస్ వేసి తేటగుంట దగ్గర రోడ్డుపై పడేశారు. పోలీసులు హత్యా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు.