సర్వం ‘సిద్ధం’ చేసుకుంటున్న సీబీఐ, ఈడీ

ఎన్నికల ముందు జగన్ అండ్ దండుపాళెం బ్యాచ్ ‘సిద్ధం’, ‘సిద్ధం’ అని అరిచారు. ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ఖేల్ ఖతం అయిపోయినట్టేనని అర్థమైపోతున్న నేపథ్యంలో జగన్ యూరప్ వెళ్ళడానికో, వెళ్ళిపోవడానికో ‘సిద్ధం’ అవుతున్నారు. జగన్ యూరప్ వెళ్ళకుండా ఆపాలని సీబీఐ కోర్టు ముందు సీబీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ని దేశం విడిచి వెళ్ళనివ్వకూడదని విజ్ఞప్తి కూడా చేసింది. అయినప్పటికీ, జగన్ జూన్ 1 వరకు యూరప్‌లో వుండటానికి సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.

జగన్ మీద పదికి పైగా ఆర్థిక నేరాల కేసులు వున్నాయి. ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని ఆ కేసుల నుంచి జగన్ తప్పించుకుని తిరుగుతున్నారు. జూన్ 4 తర్వాత ఆ హోదా ఎలాగూ వుండదు కాబట్టి అప్పుడు తమ డ్యూటీని స్వేచ్చగా చేయడానికి సీబీఐ, ఈడీ సమాయత్తం అవుతున్నాయి. అలాగే బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా సీబీఐకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళి మరీ, ఖాళీ చేతులతో తిరిగి రావలసి వచ్చింది. జూన్ నాలుగు తర్వాత జగన్‌కి ముఖ్యమంత్రి హోదా వుండదు, అవినాష్ రెడ్డికి ఎంపీ హోదా వుండదు. అప్పుడు ప్రభుత్వ వ్యవస్థల శక్తిని చూడటానికి జగన్‌ అండ్ బ్యాచ్‌కి  అవకాశం దొరుకుతుంది.