బ్రెజిల్లో వెరైటీ యాక్సిడెంట్
posted on Mar 25, 2015 5:19PM
బ్రెజిల్లో ఒక వెరైటీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఎవరూ చనిపోలేదు కాబట్టి ‘వెరైటీ’ అని అంటున్నాం. బ్రెజిల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ నది పక్కనే మట్టిరోడ్డు వుంది. దాని మీద వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ వుంటాయి. ఈమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీరు భారీగా చేరింది. బుధవారం నాడు ఆ నదిలో నిరూ మట్టిరోడ్డు కిందకి చేరుకుంది. దాంతో రోడ్డు మధ్యలో పెద్ద రంధ్రం పడింది. సరిగ్గా అదే సమయానికి నిండుగా ప్రయాణికులతో వున్న బస్సు ముందు చక్రాలు ఆ రంధ్రంలో ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని గమనించిన ఆ బస్సులో వున్నవారందరూ చకచకా కిందకి దిగేశారు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆ బస్సు రంధ్రంలో పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరైనా వుంటే ఒక్కరు కూడా బతికేవారు కాదు. తాము ఎక్కిన బస్సు క్షణాల్లో నీటిలో కొట్టుకుపోవడం చూసిన బస్సు ప్రయాణికులందరూ వామ్మో అని గుండెల మీద చేతులు వేసుకున్నారు.