సొంత బావని చంపేశాడు

 

విశాఖ జిల్లా పాడేరు మండలంలో గిబ్బంగి గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి తన సొంత బావ అయిన చిట్టిబాబు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశాడు. తిరుపతిరావు చిన్నాన్న కుమార్తెతో చిట్టిబాబుకు ఐదేళ్ళ క్రితం పెళ్ళి జరిగింది. మూడేళ్ళ క్రితం చిట్టిబాబు భార్యతో సహా గిబ్బంగి గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా తాగుడుకు బానిస అయిన చిట్టిబాబు తన బావ అయిన తిరుపతిరావును దూషించడం ప్రారంభించాడు. తన భార్యకు, తిరుపతిరావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయాన్ని తిరుపతిరావు సహించలేకపోయాడు. తన చెల్లెలితో తనకు అక్రమ సంబంధం వుందని అన్యాయంగా ప్రచారం చేస్తున్నావని చిట్టిబాబును నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే చిట్టిబాబు వినకుండా తన ధోరణిలోనే ప్రచారం చేస్తూ వుండటంతో తిరుపతిరావు చిట్టిబాబుని చంపేసి పరారయ్యాడు.